SNP
Nathan Bracken, Accountant, Australia: 8 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ ఉండి.. మంచి బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకొని.. ఇప్పుడు ఓ సాధారణ ఉద్యోగిగా మిగిలి పోయిన.. ఆసీస్ క్రికెటర్ కథ ఇప్పుడు తెలుసుకుందాం..
Nathan Bracken, Accountant, Australia: 8 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ ఉండి.. మంచి బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకొని.. ఇప్పుడు ఓ సాధారణ ఉద్యోగిగా మిగిలి పోయిన.. ఆసీస్ క్రికెటర్ కథ ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
క్రికెట్‌ను కెరీర్‌గా మల్చుకున్న వాళ్లు.. ఒక్కసారి జాతీయ జట్టులో చోటు సంపాదిస్తే.. ఇక వాళ్లకు తిరుగులేదని, ఆర్థికంగా వాళ్ల కష్టాల్లోని పోయి.. మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ, అందరి జీవితాలు అలా మారిపోవు. ఆస్ట్రేలియా లాంటి ఒక ఛాంపియన్ టీమ్ తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడి.. అద్భుతమైన ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కూడా.. జీవనోపాధి కోసం నెల జీతానికి పనిచేయాల్సిన పరిస్థితులు కూడా రావొచ్చు. అలాంటి దీన పరిస్థితిని.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ నాథన్ బ్రాకెన్ అనుభవిస్తున్నాడు.
ఆస్ట్రేలియా తరఫున 2001లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. 116 వన్డేలు, 5 టెస్టులు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడిన నాథన్ బ్రాకెన్.. ఇప్పుడు ఓ చిన్న బ్యాంక్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటి ఓ మాజీ క్రికెటర్, అంత మంచి కెరీర్ ఉన్న తర్వాత కూడా.. ఎందుకిలా పరిస్థితి మారిపోయిందంటూ.. క్రికెట్ అభిమానులు అయ్యో పాపం అంటున్నారు. బ్రాకెన్ 2009లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. మోకాలి గాయంతో టీమ్‌లో స్థానం కోల్పోయిన బ్రాకెన్.. ఆ తర్వాత.. రిటైర్మెంట్ ప్రకటించాడు.
అయితే.. తనను బలవంతంగా రిటైర్ చేశారని, తన గాయానికి నష్టపరిహారం చెల్లించాలంటూ.. 2011లో క్రికెట్ ఆస్ట్రేలియాపై ఆ దేశపు సుప్రీం కోర్టులో నాథన్ కేసు కూడా వేశాడు. తన చికిత్స కోసం, అలాగే మిగతా జీవితం కోసం తనకు నష్టపరిహారం ఇవ్వాలని కోరాడు. ఆ తర్వాత.. మెడికల్ డాక్యూమెంట్లు సమర్పించాలని క్రికెట్ ఆస్ట్రేలియా కోరింది. కొంత సోమ్మును మాత్రమే చెల్లినట్లు సమాచారం. గాయం నుంచి కోలుకున్న తర్వాత.. క్రికెట్‌కు పూర్తిగా దూరమైన నాథన్ బ్రాకెన్.. జీవనోపాధి కోసం అకౌంటెంట్‌గా మారాడు. అయితే.. అతనికి 2008లో ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఆడే అవకాశం వచ్చినా.. దాన్ని అతను తిరస్కరించాడు.
ఇక నాథన్ కెరీర్ విషయానికి వస్తే.. 2001 జనవరి 11న వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2003లో ఇండియాతో బ్రిస్బేన్‌లో ఇండియాతో జరిగిన టెస్ట్‌తో సంప్రదాయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. మొత్తంగా 5 టెస్టుల్లో 12 వికెట్లు, 116 వన్డేల్లో 174 వికెట్లు, 19 టీ20ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. ఎంతో మంచి కెరీర్ ఉన్నా.. ఇప్పుడు కేవలం ఒక అకౌంటెంట్‌గా మిగిలిపోయాడు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును కోర్టుకు లాగడంతో.. క్రికెట్‌కు సంబంధించిన ఇతర ఉద్యోగాలు.. కోచింగ్, కామెంట్రీకి కూడా దూరమైనట్లు సమాచారం. మరి నాథన్ బ్రాకెన్ జీవితం ఇలా మలుపు తిరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.