iDreamPost
android-app
ios-app

ఆసీస్ టీ20 వరల్డ్ కప్​ టీమ్ ప్రకటన.. ఆ రాక్షసుడు సహా మరో ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్!

  • Published May 01, 2024 | 11:01 AM Updated Updated May 01, 2024 | 11:03 AM

ఆస్ట్రేలియా తమ టీ20 వరల్డ్ కప్ టీమ్​ను ప్రటించింది. అయితే ఇందులో ఆ రాక్షసుడు సహా ముగ్గురు స్టార్లకు మొండిచెయ్యి ఎదురైంది.

ఆస్ట్రేలియా తమ టీ20 వరల్డ్ కప్ టీమ్​ను ప్రటించింది. అయితే ఇందులో ఆ రాక్షసుడు సహా ముగ్గురు స్టార్లకు మొండిచెయ్యి ఎదురైంది.

  • Published May 01, 2024 | 11:01 AMUpdated May 01, 2024 | 11:03 AM
ఆసీస్ టీ20 వరల్డ్ కప్​ టీమ్ ప్రకటన.. ఆ రాక్షసుడు సహా మరో ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్!

కొన్ని వారాలుగా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్న ఐపీఎల్-2024 సెకండాఫ్ జోరుగా సాగుతోంది. దాదాపు అన్ని జట్లు 9 మ్యాచ్​లు ఆడేశాయి. అవన్నీ ఇంకో ఐదేసి మ్యాచ్​లు ఆడితే ప్లేఆఫ్స్​ స్టార్ట్ అవుతుంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ క్రమంగా టీ20 వరల్డ్ కప్ మీద ఫోకస్ చేస్తున్నారు. జూన్ 2వ తేదీ నుంచి మెగా టోర్నీ సంబురాలు మొదలుకానున్నాయి. యూఎస్​ఏ-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న పొట్టి ప్రపంచ కప్​లో ఆడే జట్లను దేశాలు ప్రకటిస్తూ పోతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో పాటు ఇంగ్లండ్, టీమిండియా తమ స్క్వాడ్స్​ను అనౌన్స్ చేశాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ఈ లిస్ట్​లో చేరింది.

ఆస్ట్రేలియా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. వరల్డ్ కప్ టీమ్​కు మిచెల్ మార్ష్​ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. టీమ్​లో అతడితో పాటు ప్యాట్ కమిన్స్, ఆస్టన్ అగర్, టిమ్ డేవిడ్, ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజల్​వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్​వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా చోటు దక్కించుకున్నారు. బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ ఆసీస్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. అయితే కంగారూ సెలెక్టర్లు కొందరు స్టార్లకు అన్యాయం చేశారు. అందునా ఓ రాక్షసుడ్ని టీమ్​లోకి తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్​లో దుమ్మురేపుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ చిచ్చరపిడుగు జేక్ ఫ్రేజర్ మెక్​గర్క్​కు వరల్డ్ కప్ టీమ్​లో బెర్త్ దక్కలేదు.

ఐపీఎల్​లో జేక్ ఫ్రేజర్ విధ్వంసక ఇన్నింగ్స్​లతో విరుచుకుపడుతున్నాడు. ఒకే సీజన్​లో రెండుసార్లు 15 బంతుల్లో హాఫ్ సెంచరీలు బాదాడు. ఫోర్లు, సిక్సులతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ఈ రాక్షసుడు ట్రావిస్ హెడ్​తో కలసి ఓపెనింగ్​కు దిగితే ఆసీస్​దే వరల్డ్ కప్ అని అంతా భావించారు. సింగిల్ హ్యాండ్​తో మ్యాచ్​ను మలుపుతిప్పే ఫ్రేజర్​ ప్రపంచ కప్​లో కంగారూలకు కీలకం అవుతాడని అనుకున్నారు. తీరా చూస్తే అతడికి టీమ్​లో చోటు దక్కలేదు. ఫ్రేజర్​తో పాటు టీమ్​లో చోటు ఆశించిన స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, మ్యాట్ షార్ట్​కు కూడా వరల్డ్ కప్ ఛాన్స్ మిస్సయింది. షార్ట్ ఈ మధ్య కాలంలో ఆసీస్ తరఫున బాగా రాణించాడు. అయినా అతడికి చోటు దక్కలేదు. వీళ్లతో పాటు బెరెండార్ఫ్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్టెల్ట్ కూడా సెలెక్ట్ కాని లిస్ట్​లో ఉన్నారు. మరి.. ఫ్రేజర్, స్మిత్, షార్ట్​ను ​ఆసీస్ పక్కనబెట్టడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.