పొరుగు దేశం చైనా వేదికగా జరుగుతున్న 19వ ఆసియా గేమ్స్‌లో భారత ఆటగాళ్లు పతకాల పంట పండిస్తున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన రెండు ఈవెంట్లలో ఇండియాకు అమ్మాయిలు గోల్డ్ మెడల్స్ అందించారు. జావెలిన్ త్రో విభాగంలో అన్ను రాణి అత్యధిక దూరం బల్లెం విసిరి స్వర్ణం కైవసం చేసుకుంది. బల్లాన్ని 62.92 మీటర్లు దూరం విసిరి ఫస్ట్ ప్లేసులో నిలిచి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. మరో భారత అథ్లెట్ పారుల్ చౌదరి సంచలనం సృష్టించింది. ఇవాళ సాయంత్రం జరిగిన 5000 మీటర్ల రన్నింగ్ రేసు ఫైనల్‌ను కేవలం 15 నిమిషాల 14.75 సెకన్లలో ఆమె కంప్లీట్ చేసింది.
5 వేల మీటర్ల పరుగు పందెంలో ఫైనల్లో తొలి స్థానంలో నిలిచిన పారుల్ చౌదరి భారత్‌కు మరో గోల్డ్ మెడల్ అందించింది. ఆసియా క్రీడల్లో ఆమెకు ఇది రెండో పతకం కావడం విశేషం. అక్టోబర్ 2న జరిగిన 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో పారుల్ చౌదరి సిల్వర్ మెడల్ నెగ్గిన విషయం తెలిసిందే. మంగళవారం మరింత ఎఫర్ట్ పెట్టి గోల్డ్ మెడల్‌తో దేశం గర్వించేలా చేసిందామె. ఆసియా క్రీడల్లో 5 కిలోమీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా పారుల్ చరిత్ర సృష్టించింది.
5 వేల మీటర్ల రన్నింగ్ రేసు ఫైనల్లో ఒక సమయంలో జపాన్ అథ్లెట్ హిరోనికా రిరికా గెలుస్తుందని అనిపించింది. కానీ ఆఖరి క్షణాల్లో వేగం పెంచిన పారుల్ చౌదరి.. బుల్లెట్ స్పీడుతో దూసుకెళ్లింది. ఫినిషింగ్ లైన్‌కు కొంత దూరంలో హిరోనికాను దాటేసి వెళ్లిపోయింది పారుల్. దీంతో జపాన్ అథ్లెట్ హిరోనికా (15 నిమిషాల 15.34 సెకన్లు) సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వీళ్లిద్దరి తర్వాత స్థానంలో కజకిస్థాన్ అథ్లెట్ కరోలిన్ చెప్‌కోయిచ్ నిలిచింది. 15 నిమిషాల 23.12 సెకన్లలో రేసును ముగించి థర్డ్ ప్లేసులో నిలిచిన కరోలిన్ బ్రాంజ్ మెడల్ దక్కించుకుంది. గోల్డ్ మెడల్ సాధించిన పారుల్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. దేశం గర్వించేలా చేశావంటూ ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండి: వరల్డ్ కప్‌కు ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ! బీసీసీఐ ఏం చేస్తోంది?
Make way for Girl Boss, @Annu_Javelin
The #TOPSchemeAthlete absolutely threw her way into our hearts with her #Golden🥇Throw.
Congratulations on giving a majestic throw of 62.92 m💪🏻
Keep rocking Champ! #AsianGames2022#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/6iw1mFkv36
— SAI Media (@Media_SAI) October 3, 2023
Parul Chaudhary wins Gold Medal in Women’s 5000m for India in Asian Games.
– The dominance of Indian athelete continues!pic.twitter.com/xPOu5Uiy2m
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 3, 2023