iDreamPost

వరల్డ్‌ కప్‌ ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ! BCCI ఏం చేస్తోంది?

  • Author singhj Published - 07:50 PM, Tue - 3 October 23
  • Author singhj Published - 07:50 PM, Tue - 3 October 23
వరల్డ్‌ కప్‌ ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ! BCCI ఏం చేస్తోంది?

ప్రపంచ కప్​కు ముందు భారత క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మెగా టోర్నీకి సన్నాహకంగా నిర్వహిస్తున్న వార్మప్ మ్యాచులు​ టీమిండియాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. మన జట్టు ఆడాల్సిన రెండు వార్మప్ మ్యాచ్​లు రద్దయ్యాయి. వార్మప్ మ్యాచ్​లకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వాన వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్​లు రద్దవుతున్నాయి. ఇప్పటికే అఫ్గానిస్థాన్, సౌతాఫ్రికా.. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్​లు రద్దయ్యాయి. ఇవాళ నెదర్లాండ్స్​తో భారత్ ఆడాల్సిన వార్మప్ మ్యాచ్​కు కూడా వరుణుడు ఆటంకం కలిగించాడు. ఈ మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రద్దయింది.

టీమిండియా ఆడాల్సిన రెండు వార్మప్ మ్యాచ్​లూ వర్షార్పణం అయినట్లయింది. ఈసారి ఒక్క వార్మప్ మ్యాచ్​లో కూడా బరిలోకి దిగని ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. నేటితో వార్మప్ మ్యాచ్​లు ముగుస్తాయి. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్​తో వరల్డ్ కప్​లో ప్రధాన మ్యాచ్​లు మొదలవుతాయి. టీమిండియా తన తొలి మ్యాచ్​లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్​ అక్టోబర్ 8న చెన్నై వేదికగా జరగనుంది. అయితే వరుసగా రెండు వార్మప్ మ్యాచ్​లు రద్దవడంతో.. భారత్​ ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా మెగా టోర్నీకి వెళ్తోంది. టీమిండియా ఆడాల్సిన వార్మప్ మ్యాచుల్లో ఒకటి గౌహతిలో, ఇంకోటి తిరువనంతపురంలో జరగాల్సింది. ఈ రెండు చోట్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే సూచించినా.. బీసీసీఐ వేదికలను మార్చకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

భారత జట్టుకు సరైన ప్రాక్టీస్ కోసం కనీసం ఒక్క వేదికనైనా వేరే చోటకు మార్చాల్సిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఇవి వార్మప్ మ్యాచ్​లే కాబట్టి వేదిక మార్చి మ్యాచ్​లు జరిపించి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో బీసీసీఐ ముందే జాగ్రత్త పడి ఉంటే టీమిండియాకు మంచి ప్రాక్టీస్ దొరికేదని అంటున్నారు. దాయాది పాకిస్థాన్ సహా ఇతర జట్లకు ప్రాక్టీస్ దొరికిందని.. అవి వార్మప్ మ్యాచ్​లు ఆడాయని గుర్తుచేస్తున్నారు. కానీ సొంత గడ్డపై టోర్నీ జరుగుతున్న నేపథ్యంలో వార్మప్ మ్యాచ్​ల వేదికలు మార్చే అధికారం తమ చేతిలో ఉన్నా బీసీసీఐ ఏం చేస్తోందని టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి.. భారత్ ఆడాల్సిన రెండు వార్మప్ మ్యాచులు రద్దవడం, బీసీసీఐ చూస్తూ సైలెంట్ అయిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బీజేపీ బంపరాఫర్.. వరల్డ్ కప్ ఫ్రీగా చూసే ఛాన్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి