Asia Cup: ఇండియా vs పాకిస్థాన్‌ మ్యాచ్‌! కీలక అప్డేట్‌

ఆసియా కప్‌ 2023లో భాగంగా క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు సంబంధించి కీలక అప్డేట్‌ తెలుస్తోంది. ఉదయం వరకు కూడా గ్రౌండ్‌ కవర్లతో కప్పి ఉంచడంతో మ్యాచ్‌ జరుగుతుందా లేదా అనే అనుమానం అందరిలోనూ నెలకొంది. వర్షం కారణంగా అసలు మ్యాచ్‌ పూర్తిగా రద్దు అవుతుందని, లేదా మ్యాచ్‌ ప్రారంభమైనా.. మధ్యలోనే నిలిచిపోతుంది రిపోర్టులు చెబుతూ ఉన్నాయి. కానీ, మ్యాచ్‌ సమయం దగ్గర పడుతున్న కొద్ది వాతావరణం అనుకూలిస్తూ కనిపించింది. ఆకాశం కాస్త సాధారణంగా మారడంతో.. మ్యాచ్‌ నిర్వహణకు అనుకూలంగా మారింది. దీంతో క్రికెట్‌ అభిమానుల పూజలు ఫలించాయి.. మరికొద్ది సేపట్లో హైఓల్టేజ్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

టాస్‌..
వర్షం వచ్చే సూచనలు లేకపోవడంతో సరిగ్గా అనుకున్న సమయానికే మ్యాచ్‌ కోసం టాస్‌ పడింది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా విజయావకాశాలు మరింత మెరుగయ్యాయి. ఈ వర్షం వచ్చే సూచనలు ఉండటంతో ఈ మ్యాచ్‌లో టాస్‌ ఎంతో కీలకంగా మారింది. టీమిండియా టాస్‌ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకుంటుందని అంతా భావించారు. కానీ, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అనూహ్యంగా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో ఎవరి విజయావకాశాలు ఎలో ఉన్నాయో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

తుది జట్లు..Asia Cup 2023, IND vs PAK, Rohit Sharma
ఇండియా: రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజమ్‌(కెప్టెన్‌), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌ కీపర్‌), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్

ఇదీ చదవండి: రోహిత్ ​శర్మవి మతి లేని మాటలు.. మండిపడ్డ వరల్డ్ కప్ హీరో!

Show comments