iDreamPost
android-app
ios-app

హెడ్‌ కోచ్‌ పదవికి టీమిండియా దిగ్గజం రాజీనామా? కారణం​ ఏంటంటే..?

  • Published Jul 24, 2024 | 1:50 PMUpdated Jul 24, 2024 | 1:50 PM

Head Coach: భారత దిగ్గజ క్రికెటర్‌, ఓ టీమ్‌కు మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ హెడ్‌ కోచ్‌గా ఉండి.. తాజాగా రాజీనామాకు సిద్ధం అవుతున్నాడు. మరి ఆ కోచ్‌ ఎవరు? ఏ టీమ్‌ హెడ్‌ కోచ్‌ పదవికి రాజీనామా చేశాడో ఇప్పుడు చూద్దాం..

Head Coach: భారత దిగ్గజ క్రికెటర్‌, ఓ టీమ్‌కు మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ హెడ్‌ కోచ్‌గా ఉండి.. తాజాగా రాజీనామాకు సిద్ధం అవుతున్నాడు. మరి ఆ కోచ్‌ ఎవరు? ఏ టీమ్‌ హెడ్‌ కోచ్‌ పదవికి రాజీనామా చేశాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 24, 2024 | 1:50 PMUpdated Jul 24, 2024 | 1:50 PM
హెడ్‌ కోచ్‌ పదవికి టీమిండియా దిగ్గజం రాజీనామా? కారణం​ ఏంటంటే..?

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 విజయం తర్వాత.. తన పదవీ కాలం ముగియడంతో రాహుల్‌ ద్రవిడ్‌ ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యాడు. అతని స్థానంలో టీమిండియా కొత్త హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ బాధ్యతలు తీసుకొని ప్రస్తుతం యంగ్‌ టీమిండియాలో కలిసి శ్రీలంకలో ఉన్నాడు. అలాగే గుజరాత్‌ టైటాన్స్‌కు యువరాజ్‌ సింగ్‌ కొత్త హెడ్‌ కోచ్‌గా వస్తాడనే ప్రచారం జరుగుతోంది. క్రికెట్‌ వర్గాల్లో మొత్తం హెడ్‌ కోచ్‌ల గురించే గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే మరో హెడ్‌ కోచ్‌ గురించి సంచలన విషయం వెలుగులోకి వస్తోంది.

గుజరాత్‌ టైటాన్స్‌కు హెడ్‌ కోచ్‌గా ఉన్న టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ ఆశిష్‌ నెహ్రా తాజాగా తన పదవికి రాజీనామా చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. గుజరాత్‌ టైటాన్స్‌ మేనేజర్‌ సోలంకితో పాటు హెడ్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రా ఆ ఫ్రాంచైజ్‌ నుంచి బయటికి వచ్చేస్తున్నారంటూ సమాచారం. గుజరాత్‌ టైటాన్స్‌తో విభేదాల కారణంగానే ఆశిష్‌ నెహ్రా.. తన పదవికి రాజీనామా చేసి ఫ్రాంచైజ్‌ నుంచి బయటికి రావాలని ఫిక్స్‌ అయ్యాడని తెలుస్తోంది. అయితే.. ఏ విషయంలో విభేదాలు తలెత్తాయి అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. కాగా, ఆశిష్‌ నెహ్రా కోచింగ్‌లో జీటీ ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసందే. 2023లో ఫైనల్‌ ఆడి రన్నరప్‌గా నిలిచింది.

ఆశిష్‌ నెహ్రా వెళ్లిపోతున్నాడనే వార్తలకు బలం చేకూరుస్తూ.. తమ జట్టుకు హెడ్‌ కోచ్‌గా రావాలని గుజరాత్‌ టైటాన్స్‌ మేనేజ్‌మెంట్‌, టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ను సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. నెహ్రా ప్లేస్‌లో యువీని దింపేందుకు జీటీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఐపీఎల్‌ 2025 సీజన్‌ కంటే ముందు మెగా వేలం జరనుంది. ఈ వేలం కంటే ముందు రీటెన్‌ చేసుకోవాల్సిన ఆటగాళ్లు, రిలీజ్‌ చేయాల్సిన ఆటగాళ్ల లిస్ట్‌పై టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో నెహ్రాకు విభేదాలు వచ్చినట్లు సమాచారం. పైగా గుజరాత్‌ టైటాన్స్‌ను వేరే వాళ్లు టేక్‌ఓవర్‌ చేస్తున్నారనే వార్తలు రావడంతో కూడా నెహ్రా ఆ టీమ్‌ను వీడాలని డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి