SNP
SNP
ఓ వైపు వన్డే వరల్డ్ కప్‌తో ఇండియా మొత్తం క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతుంటే.. మరోవైపు చైనాలో భారత్ జైత్రయాత్ర కొనసాగించింది. 19వ ఏషియన్ గేమ్స్‌లో ఇండియా ఏకంగా 100కు పైగా మెడల్స్ సాధించి కొత్త చరిత్ర లిఖించింది. అలాగే.. క్రికెట్, కబడ్డీ పోటీల్లో పురుషుల, మహిళల జట్టు సైతం గోల్డె మెడల్‌తో అదరగొట్టాయి. ముఖ్యంగా మెన్స్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటే.. సెమీ ఫైనల్‌లో పాకిస్థాన్ లాంటి పటిష్టమైన జట్టును మట్టికరిపించి.. ఫైనల్‌కు దూసుకొచ్చింది ఆఫ్గనిస్థాన్. అంతకంటే ముందు తొలి సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై ఘనవిజయంతో టీమిండియా ఫైనల్ చేరింది.
భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. టాప్ సీడ్ అయిన ఇండియాను గోల్డ్ మెడల్ వరించింది. ఒక వేళ మ్యాచ్ జరిగినా కూడా టీమిండియాదే విజయం అనుకోండి అది వేరే విషయం. అయితే.. ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు గోల్డ్ మెడల్ సాధించడంపై యావత్ భారత క్రికెట్ అభిమాన లోకం సంతోషం వ్యక్తం చేసింది. మరో వైపు ఐసీసీ వరల్డ్ కప బిజీలో ఉన్న రోహిత్ శర్మ సైతం టీమిండియా గోల్డ్ మెడల్ సాధించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. వారికి శుభాకాంక్షలు తెలిపాడు.
రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ఏషియన్ గేమ్స్‌కు వెళ్లిన టీమిండియా.. అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచి స్వర్ణపతకం గెలిచింది. గైక్వాడ్‌తో పాటు యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, మన తెలుగు తేజం తిలక్ వర్మ సైతం ఏషియన్ గేమ్స్‌లో మంచి ప్రదర్శన కనబర్చారు. అయితే.. గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత.. భారత క్రికెటర్లు హోటల్‌లో సంబురాలు చేసుకున్నారు. ముఖ్యంగా అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్.. 1983 వరల్డ్ కప్ గెలిచిన కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియాపై తీసిని 83 సినిమాలోని ‘లెహరాదో’ పాటను పాడుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి టీమిండియా క్రికెటర్ల సెలబ్రేషన్స్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gold Medal celebrations from Avesh Khan, Ravi Bishnoi and Arshdeep Singh. pic.twitter.com/513BrtZkmX
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 8, 2023
ఇదీ చదవండి: World Cup: భారత్-పాక్ మ్యాచ్! క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్