iDreamPost
android-app
ios-app

చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్ బౌలర్! తొలి ఇండియన్ పేసర్ గా..

  • Author Soma Sekhar Published - 04:41 PM, Mon - 21 August 23
  • Author Soma Sekhar Published - 04:41 PM, Mon - 21 August 23
చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్ బౌలర్! తొలి ఇండియన్ పేసర్ గా..

టీమిండియాలో ఎంతో మంది స్టార్ క్రికెటర్లు ఉన్నారు. కానీ అతి తక్కువ కాలంలోనే జట్టులో తన స్థానాన్ని సుస్థిర పరచుకున్న ఆటగాళ్లు చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి ప్లేయర్స్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ఒకడు. ప్రస్తుతం ఐర్లాండ్ సిరీస్ లో ఆడుతున్న అర్షదీప్ రెండు టీ20ల్లో రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అయినప్పటికీ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు అర్షదీప్. తొలి ఇండియన్ పేసర్ గా ఘనత సాధించాడు. మరి ఇంతకీ అర్షదీప్ బ్రేక్ చేసిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి భారత పేసర్ గా రికార్డు నమోదు చేశాడు. ఈ రికార్డు ఇంతకు ముందు టీమిండియా పేస్ గుర్రం బుమ్రా పేరిట ఉండేది. బుమ్రా 41 మ్యాచ్ ల్లో ఈ మైలురాయిని అందుకోగా.. అర్షదీప్ కేవలం 33 మ్యాచ్ ల్లోనే ఈ రికార్డును సాధించాడు.

కాగా.. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్ తో జరిగిన 2వ టీ20లో అండ్రూ బల్బిర్నీని ఔట్ చేయడం ద్వారా అర్షదీప్ ఈ ఫీట్ ను అందుకున్నాడు. అంతకు ముందు టీమిండియా తరపున ఈ రికార్డు వెంటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేరిట ఉండేది. అతడు 30 మ్యాచ్ ల్లో ఈ ఘనత సాధించాడు. అయితే అతడు స్పిన్ విభాగంలో ఈ రికార్డును నెలకొల్పగా.. అర్షదీప్ ఫాస్ట్ బౌలింగ్ లో ఈ ఫీట్ సాధించాడు. మరి తక్కువ కాలంలోనే స్టార్ బౌలర్ గా ఎదిగి, రికార్డులు సాధిస్తున్న అర్షదీప్ సింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: లంక ప్రీమియర్‌ లీగ్‌ను శాసించిన హసరంగా! రికార్డులన్నీ అతని పేరిటే