iDreamPost

లంక ప్రీమియర్‌ లీగ్‌ను శాసించిన హసరంగా! రికార్డులన్నీ అతని పేరిటే

  • Author Soma Sekhar Published - 02:52 PM, Mon - 21 August 23
  • Author Soma Sekhar Published - 02:52 PM, Mon - 21 August 23
లంక ప్రీమియర్‌ లీగ్‌ను శాసించిన హసరంగా! రికార్డులన్నీ అతని పేరిటే

వానిందు హసరంగా.. ప్రస్తుతం ఈ పేరు క్రికెట్ చరిత్రలో మారు మ్రోగిపోతోంది. సమకాలీన క్రికెట్ చరిత్రలో బెస్ట్ ఆల్ రౌండర్ గా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న హసరంగా.. మరో అద్భుతాన్ని సృష్టించాడు. లంక ప్రీమియర్ లీగ్ 2023లో దుమ్మురేపిన హసరంగా.. LPL అంటే హసరంగా, హసరంగా అంటే LPL అన్నంతగా మారిపోయాడు. ఇక లంక ప్రీమియర్ లీగ్ లో తాను కెప్టెన్సీ వహించిన బీ-లవ్ క్యాండీ జట్టును విజేతగా నిలిపాడు. ఇక ఈ లీగ్ లో అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ తో పాటు అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు.

వానిందు హసరంగా.. లంక ప్రీమియర్ లీగ్ హీరో. హీరో అనే పదం కూడా అతడి ముందు చిన్నదే అవుతుందేమో. అంతలా అతడి దండయాత్ర కొనసాగింది లంక ప్రీమియర్ లీగ్ లో. ఒక్క విభాగంలోనే కాదు.. అన్నింట్లో హసరంగా లంక ప్రీమియర్ లీగ్ ను శాసించాడు. ఈ లీగ్ లో అత్యధిక రన్స్ (279), అత్యధిక వికెట్లు (19), మోస్ట్ సిక్సెస్ (14), ఫాస్టెస్ట్ ఫిప్టీ (18 బంతుల్లో), బెస్ట్ బౌలింగ్ (6/9), బెస్ట్ స్ట్రైక్ రేట్ (189.7), ఎక్కువ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు(4), ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇలా అన్ని విభాగాల్లో లంక ప్రీమియర్ లీగ్ ను శాసించాడు హసరంగా.

దీంతో తన జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. కాగా.. కొన్ని రోజుల క్రితమే ఇతడు టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డేలు, టీ20లపై ఫోకస్ పెట్టాలన్న ఉద్దేశంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. వరల్డ్ కప్ ముందు శ్రీలంకకు తన ఫర్పామెన్స్ తో బూస్ట్ ఇస్తున్నాడు. మరి లంక ప్రీమియర్ లీగ్ ను శాసించిన వానిందు హసరంగాపై మీ అభిప్రాయాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: ఆసియా కప్‌ 2023లో ఆడే టీమిండియా ఇదే! జట్టును ప్రకటించిన BCCI

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి