Arshdeep Singh: పాపం.. అర్షదీప్‌ సింగ్‌! 2022లో పాక్‌తో మ్యాచ్‌ తర్వాత.. మళ్లీ ఇప్పుడిలా?

శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ టై అవ్వడానికి ప్రధాన కారణం అర్షదీప్ సింగ్ అని అందరూ విమర్శిస్తున్నారు. అయితే గతంలో కూడా ఇలాగే ఓ తప్పు చేసి దారుణమైన ట్రోల్స్ కు గురైయ్యాడు అర్షదీప్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ టై అవ్వడానికి ప్రధాన కారణం అర్షదీప్ సింగ్ అని అందరూ విమర్శిస్తున్నారు. అయితే గతంలో కూడా ఇలాగే ఓ తప్పు చేసి దారుణమైన ట్రోల్స్ కు గురైయ్యాడు అర్షదీప్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

శ్రీలంకతో తాజాగా ముగిసిన టీ20 సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. అదే జోరును వన్డే సిరీస్ లో కొనసాగించలేకపోయింది. సీనియర్లు అయిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రావడంతో.. జట్టు ఇంకా బలంగా తయ్యారు అయ్యింది. దాంతో లంకను చిత్తుగా ఓడిస్తుందని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ సునాయసంగా గెలవాల్సిన తొలి వన్డే అనూహ్యంగా టై అయ్యింది. ఈ మ్యాచ్ టై అవ్వడానికి ప్రధాన కారణం అర్షదీప్ సింగ్ అని అందరూ విమర్శిస్తున్నారు. గతంలో కూడా ఇలాగే ఓ తప్పు చేసి దారుణమైన ట్రోల్స్ కు గురైయ్యాడు అర్షదీప్.

15 బంతుల్లో టీమిండియా విజయానికి కేవలం ఒక రన్ మాత్రమే కావాలి. చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి. ఇంకేముందు టీమిండియా ఈజీగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ క్రమంలో బౌలింగ్ కు వచ్చిన అసలంక వరుస బంతుల్లో శివమ్ దూబే, అర్షదీప్ సింగ్ లను పెవిలియన్ కు చేర్చి.. భారత్ కు విజయాన్ని దూరం చేసి, మ్యాచ్ ను టైగా ముగించాడు. కేవలం అర్షదీప్ కారణంగానే ఈ మ్యాచ్ టై అయ్యిందని విమర్శిస్తున్నారు. ఒక విధంగా అది నిజమే. ఎందుకంటే? దూబే పెవిలియన్ చేరిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన అర్షదీప్ సింగిల్ తీసినా.. టీమ్ విజయం సాధించి ఉండేది. కానీ అతడు అలా చేయలేదు. సిక్స్ కొట్టి జట్టును గెలిపించి హీరో అవ్వాలన్న ఉద్దేశంతో భారీ షాట్ కు ప్రయత్నించి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

అయితే టీమిండియా గెలిచే మ్యాచ్ ల్లో ఇలా బ్లండర్ మిస్టెక్ చేయడం అర్షదీప్ కు ఇదే తొలిసారి కాదు. గతంలో జరిగిన ఆసియా కప్ 2022లో కూడా ఇలాంటి తప్పే చేశాడు. ఆ టోర్నీలో పాకిస్తాన్ తో జరిగిన గ్రూప్ 4 మ్యాచ్ లో పాక్ ప్లేయర్ అసిఫ్ అలీ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్ ను డ్రాప్ చేశాడు. దాంతో దారుణమైన ట్రోల్స్, విమర్శలు ఎదుర్కొన్నాడు ఈ యంగ్ పేసర్. కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహాన్ని కూడా అప్పుడు ఎదుర్కొన్నాడు అర్షదీప్. అప్పుడు క్యాచ్ మిస్ చేసి, ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్ తో మ్యాచ్ ఫలితాలను మార్చేశాడని ఈ యంగ్ పేసర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ లవర్స్. మరి అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా ఘోర తప్పిదాలు చేసిన అర్షదీప్ సింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments