iDreamPost
android-app
ios-app

అర్షదీప్‌ ఔట్‌ అయ్యాక.. నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో సిరాజ్‌ రియాక్షన్‌ చూశారా? పాపం..

  • Published Aug 03, 2024 | 8:56 AM Updated Updated Aug 03, 2024 | 8:57 AM

Mohammed Siraj, Arshdeep Singh, IND vs SL: భారత్‌-శ్రీలంక మధ్య తొలి వన్డే టై కావడంతో.. అర్షదీప్‌ సింగ్‌ ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. కానీ, అతను అవుట్‌ అయినప్పుడు నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న సిరాజ్‌ రియాక్షన్‌ చూడండి..

Mohammed Siraj, Arshdeep Singh, IND vs SL: భారత్‌-శ్రీలంక మధ్య తొలి వన్డే టై కావడంతో.. అర్షదీప్‌ సింగ్‌ ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. కానీ, అతను అవుట్‌ అయినప్పుడు నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న సిరాజ్‌ రియాక్షన్‌ చూడండి..

  • Published Aug 03, 2024 | 8:56 AMUpdated Aug 03, 2024 | 8:57 AM
అర్షదీప్‌ ఔట్‌ అయ్యాక.. నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో సిరాజ్‌ రియాక్షన్‌ చూశారా? పాపం..

స్కోర్లు సమం అయ్యాయి, విజయానికి.. 15 బాల్స్‌లో 1 రన్‌ కావాలి. చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి. పైగా స్ట్రైక్‌లో శివమ్‌ దూబే లాంటి మంచి బ్యాటర్‌ ఉన్నాడు. 24 బంతుల్లో ఒక ఫోర్‌, రెండు సిక్సులతో 25 పరుగులు చేసి.. విన్నింగ్‌ షాట్‌ కొట్టేందుకు రెడీ అయ్యాడు. కానీ, నెక్ట్స్‌ బాల్‌కు లెగ్‌ బిఫోర్‌గా అవుట్‌ అయ్యాడు శివమ్‌ దూబే. సర్లే ఇంకో వికెట్‌ ఉంది, ఒక్కటే రన్‌ కావాలి.. ఎలాగైన టచ్‌ చేసి ఉరికేస్తారులే అని భారత క్రికెట్‌ అభిమానులు అనుకున్నారు.. కానీ, అప్పుడొచ్చాడయ్యా.. ఓ హీరో. అతని పేరు అర్షదీప్‌ సింగ్‌. టీమిండియా మాజీ దిగ్గజం, సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌లో పేరులో సింగ్‌ ఉందని.. తాను కూడా సిక్స్‌ కొట్టి కింగ్‌ అయిపోదాం అనుకున్నాడు.. క్రీజ్‌లోకి వచ్చి రాగానే.. మోకాళ్లపై కూర్చోని భారీ షాట్‌కు ప్రయత్నించి.. లెగ్‌ బిఫోర్‌గా అవుట్‌ అయ్యాడు.

అంతే.. మ్యాచ్‌ ఓడిపోతాం అనుకున్న శ్రీలంక మ్యాచ్‌ను టై చేసుకుని.. దాదాపు గెలిచింది. కానీ, మ్యాచ్‌ గెలవాల్సిన టీమిండియా.. టై చేసుకొని ఒక విధంగా ఓడిపోయింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎక్కువ బాధపడింది మాత్ర​ం మొహమ్మద్‌ సిరాజ్‌. 211 పరుగుల వద్ద కుల్దీప్‌ అవుట్‌ అయిన తర్వాత.. క్రీజ్‌లోకి వచ్చాడు. టీమిండియా విజయానికి ఇంకా 20 రన్స్‌ కావాలి. వికెట్లు టపటపా పడుతున్నాయి. మరో ఎండ్‌లో ఉన్న దూబేకు కాస్త సపోర్ట్‌ చేస్తే చాటు మిగతా పని అతను చూసుకుంటాడు. కానీ, బంతిని గింగిరాలు తిప్పుతున్న లంక స్పిన్నర్లను ఎదుర్కొవడం అంటే ఒక్కో బాల్‌ ఒక్కో గండంలా ఉంది. కానీ, సిరాజ్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. అనవసరపు షాట్ల జోలికి వెళ్లకుండా.. సింగిల్స్‌ కోసం ప్రయత్నించి.. దూబేకు స్ట్రైక్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

Siraj reaction to arshadeep shot

ఎంత కఠినమైన పరిస్థితుల్లో, తీవ్ర ఒత్తిడిలోనూ 11 బంతులు ఆడి ఎంతో విలువైన 5 పరుగులు చేసి.. దూబేకు మంచి సపోర్ట్‌ అందించాడు. సిరాజ్‌ బ్యాటింగ్‌ చూపి.. అటు దూబేకు ఇటు భారత క్రికెట్‌ అభిమానులకు కూడా విజయంపై కాన్ఫిడెన్స్‌ వచ్చేసింది. కానీ, దూబే అవుట్‌ అయిన తర్వాత.. క్రీజ్‌లోకి వచ్చిన అర్షదీప్‌ సింగ్‌ ఎవ్వరూ ఊహించని విధంగా షాట్‌కు ప్రయత్నించి.. వికెట్‌ సమర్పించుకున్నాడు. సింగిల్‌ కోసం ఆడతాడు.. లేదా ఈ ఓవర్‌లో మిగిలి ఉన్న రెండు బాల్స్‌ డాట్స్‌ చేసి నాకు స్ట్రైక్‌ ఇస్తాడులే అని నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో సిరాజ్‌ వేయిట్‌ చేస్తాడు. కానీ, తానో యువరాజ్‌ సింగ్‌ అనుకున్న అర్షదీప్‌ ఆడిన తీరు చూసి.. సిరాజ్‌ అలాగే షాక్‌లో నిలబడిపోయాడు. అర్షదీప్‌ సింగ్‌ను అలాగే చూస్తూ.. ఏం చేశావ్‌ రా అనేలా ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్‌ పెట్టాడు. పాపం.. అంత సేపు కష్టపడి బ్యాటింగ్ చేసి.. విజయం గుమ్మం వరకు వచ్చి.. అర్షదీప్‌ సింగ్‌ ఓవర్‌ యాక్షన్‌తో అంతా నాశనం అవ్వడంతో సిరాజ్‌ షాక్‌కి గురయ్యాడు. అర్షదీప్‌ అవుట్‌ అయ్యాకా.. సిరాజ్‌ అతన్నే చూస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.