IND vs ZIM: జింబాబ్వే జట్టులో పాక్ ప్లేయర్! పౌరసత్వం రాకముందే ఎంట్రీకి రెడీ..

టీమిండియాతో జరిగే 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ కు జట్టు ప్రకటించింది జింబాబ్వే. అయితే పౌరసత్వం రాకముందే.. పాకిస్తాన్ సంతతికి చెందిన ఓ ప్లేయర్ ను స్వ్కాడ్ లోకి తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియాతో జరిగే 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ కు జట్టు ప్రకటించింది జింబాబ్వే. అయితే పౌరసత్వం రాకముందే.. పాకిస్తాన్ సంతతికి చెందిన ఓ ప్లేయర్ ను స్వ్కాడ్ లోకి తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ గెలిచి.. మంచి జోరుమీదున్న టీమిండియా జింబాబ్వే సిరీస్ కు సిద్ధమైంది. ఇక ఇదే జోరును పసికూనపై కూడా చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా లాంటి సీనియర్లు పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలకడంతో.. ఈ సిరీస్ కు యువ టీమిండియాను ఎంపిక చేశారు. జట్టును కూడా ప్రకటించారు. జింబాబ్వే సైతం భారత్ తో తలపడబోయే జట్టును ప్రకటించింది. కానీ.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. పౌరసత్వం రాకముందే.. పాకిస్తాన్ సంతతికి చెందిన ఓ ప్లేయర్ అరంగేట్రానికి సిద్ధమైయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియాతో జరగబోయే 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం జింబాబ్వే సోమవారం తన జట్టును ప్రకటించింది. ఈ స్వ్కాడ్ లో ఓ ప్లేయర్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడే అంటుమ్ నఖ్వీ.. దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన ఈ స్టార్ ఆల్ రౌండర్.. జాతీయ జట్టులోకి దూసుకొచ్చాడు. ఏకంగా ఇండియాతో జరిగే సిరీస్ కే ఎంపిక అయ్యాడు. అయితే ఇతడి గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంటుమ్ నఖ్వీ 1999లో బెల్జియంలో జన్మించాడు. అతడి తల్లిదండ్రులు పాకిస్తాన్ కు చెందినవారు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ లో నఖ్వీ రైనోస్ తరఫున ఆడుతున్నాడు.

ఇదిలా ఉండగా.. జింబాబ్వే జట్టులోకి ఎంపిక అయిన నఖ్వీకి ఇంకా జింబాబ్వే పౌరసత్వమే లభించలేదు. అయినప్పటికీ.. అతడిని టీమ్ లోకి ఎంపిక చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే పౌరసత్వం కోసం అతడు దరఖాస్తు చేసుకున్నాడని, ఇంకా అది రాలేదని, త్వరలోనే వస్తుందని తెలుస్తోంది. ఇక అతడి ఫస్ట్ క్లాస్ కెరీర్ విషయానికి వస్తే.. 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 72 సగటుతో 792 పరుగులు చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మతాబెలెలాండ్ టస్కర్స్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించడం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. పైగా జింబాబ్వే తరఫున ట్రిఫుల్ సెంచరీ కొట్టిన తొలి ప్లేయర్ గా రికార్డ్ నెలకొల్పాడు. 8 లిస్ట్ ఏ మ్యాచ్ ల్లో 514 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్ లో 38 వికెట్లు కూడా తీశాడు. ఇక ఇప్పుడు టీమిండియాపై గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైయ్యాడు. పాక్ సంతతికి చెందిన ప్లేయర్ పౌరసత్వం రాకుండానే.. జింబాబ్వే తరఫున క్రికెట్ ఆడుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments