Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 హడావుడి ఇంకా ముగియలేదు. కప్పు గెలిచిన భారత ఆటగాళ్లు త్వరలో స్వదేశానికి చేరుకోనున్నారు. ఈ తరుణంలో మరో ఆసక్తికర సిరీస్‌కు రంగం సిద్ధమవుతోంది.
టీ20 వరల్డ్ కప్-2024 హడావుడి ఇంకా ముగియలేదు. కప్పు గెలిచిన భారత ఆటగాళ్లు త్వరలో స్వదేశానికి చేరుకోనున్నారు. ఈ తరుణంలో మరో ఆసక్తికర సిరీస్‌కు రంగం సిద్ధమవుతోంది.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 హడావుడి ముగియలేదు. కప్పు గెలిచిన భారత ఆటగాళ్లు త్వరలో స్వదేశానికి చేరుకోనున్నారు. ఒకవైపు ప్లేయర్లతో పాటు కోట్లాది మంది అభిమానులంతా టైటిల్ నెగ్గిన సంతోషంలో ఉండగా.. మరోవైపు మెన్ ఇన్ బ్లూ మరో ఆసక్తికర సిరీస్‌కు సిద్ధమవుతోంది. జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్‌కు రెడీ అవుతోంది మన జట్టు. జులై 6వ తేదీ నుంచి మొదలవనున్న ఈ సిరీస్‌లో టీమిండియాకు యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గిల్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, తుషాద్ దేశ్‌పాండే ఈ సిరీస్‌లో భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు.
జింబాబ్వేతో సిరీస్‌కు బలమైన లైనప్‌తో ఉన్న జట్టును ఎంపిక చేశారు సెలెక్టర్లు. టీమ్‌లో స్ట్రాంగ్ బ్యాటర్లతో పాటు అంతే బలమైన బౌలర్లు కూడా ఉన్నారు. దీంతో ఈ సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే అవతల ఉన్న జింబాబ్వేను లైట్ తీసుకోవడానికి లేదు. కెప్టెన్ సికందర్ రజాతో పాటు కొందరు డేంజరస్ ప్లేయర్లు ఆ టీమ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ గిల్ ముందున్న పలు సవాళ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నయా సారథి ముందు ఉన్న తొలి సవాల్ ఓపెనర్‌గా, బ్యాటర్‌గా సత్తా చాటడం. గత కొన్నేళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ రెగ్యులర్ ప్లేయర్‌గా మారాడు గిల్. అతడి టాలెంట్ చూసే ఇప్పుడు కెప్టెన్సీ ఛాన్స్ వచ్చింది. కాబట్టి అతడు ఈ సిరీస్‌లో పరుగుల వర్షం కురిపించాలి. రోహిత్ శర్మ ప్లేస్‌లో తానే ఓపెనర్‌గా కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి.
జింబాబ్వే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం గిల్ ముందు ఉన్న ఇంకో సవాల్. ఆ టీమ్‌ను వైట్‌వాష్ చేయడం ద్వారా సారథిగా రోహిత్‌కు సిసలైన వారసుడ్ని తానేనని అతడు నిరూపించుకోవాలి. మరో ఛాలెంజ్ ఏంటంటే.. గిల్ తాను రాణించడమే గాక జట్టులోని ఇతర ఆటగాళ్ల నుంచి కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ను రాబట్టాలి. ఒకవేళ టీ20ల్లో కెప్టెన్‌గా గిల్ సక్సెస్ అయితే.. ఫ్యూచర్లో వన్డేల్లోనూ రోహిత్ నుంచి సారథ్య పగ్గాలు తీసుకోవచ్చు. కెప్టెన్సీ రేసులో ఉన్న హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ లాంటి వారిని అధిగమిచాలంటే జింబాబ్వే సిరీస్ అతడికి ఎంతో కీలకం.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇక మీదట వీళ్లు వన్డేలు, టెస్టులకే పరిమితం కానున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కేవలం 6 వన్డేలు మాత్రమే జరగనున్నాయి. కాబట్టి రోకో జోడీని ఇకపై టెస్టుల్లోనే ఎక్కువగా చూడనున్నాం. వీళ్లిద్దరి ఎరా ముగిసింది. కాబట్టి టీమిండియా నుంచి మరో లెజెండ్ పుట్టుకకు ఇది ఆరంభం కావాలి. ఆ ఇద్దరి నుంచి బ్యాటన్‌ను పట్టుకొని భారత క్రికెట్‌ను ముందుకు నడిపించే సత్తా ఉన్నోడు కావాలి. అది తానేనని ప్రూవ్ చేయడానికి గిల్‌కు ఇదే బెస్ట్ ఛాన్స్. మరి.. శుబ్‌మన్ ఎదుర్కొంటున్న సవాళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.