iDreamPost
android-app
ios-app

రంజీ ట్రోఫీలో సంచలన బౌలింగ్.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన అన్షుల్ కాంబోజ్‌

Anshul Kamboj: క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డ్స్ నమోదవుతూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా రంజీ ట్రోఫీలో సంచలనం నమోదైంది. యువ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్స్ పడగొట్టి రికార్డుల్లోకి ఎక్కాడు.

Anshul Kamboj: క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డ్స్ నమోదవుతూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా రంజీ ట్రోఫీలో సంచలనం నమోదైంది. యువ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్స్ పడగొట్టి రికార్డుల్లోకి ఎక్కాడు.

రంజీ ట్రోఫీలో సంచలన బౌలింగ్.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన అన్షుల్ కాంబోజ్‌

భారత క్రికెట్ చరిత్రలో సంచలనం నమోదైంది. రంజీ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు పడగొట్టి హిస్టరీ క్రియేట్ చేశాడు యువ బౌలర్ అన్షుల్ కాంబోజ్. ముంబై ఇండియన్స్ ప్లేయర్, హర్యానా ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లతో విజృంభి సంచలన ప్రదర్శన చేశాడు. మెరుపు బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుకు వణుకు పుట్టించాడు. కాంబోజ్ బౌలింగ్ ధాటికి బ్యాటర్లు పెవిలియన్ బాటపట్టారు. నిప్పులు చెరిగే బంతులతో 10మంది బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. దీంతో అన్షుల్ కాంబోజ్ పేరు మారు మ్రోగుతోంది.

క్రికెటర్స్, క్రికెట్ లవర్స్ కాంబోజ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రంజీ ట్రోఫీలో కేరళ, హర్యాన మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఈ అరుదైన రికార్డ్ చోటుచేసుకుంది. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో అన్షుల్ కాంబోజ్ 30.1 ఓవర్లు బౌలింగ్ వేసి 49 పరుగులు ఇచ్చి మొత్తం 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాంబోజ్ బౌలింగ్ ధాటికి ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో కేర‌ళ 291 ర‌న్స్‌కే ఆలౌటైంది. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్స్ తీసి రికార్డుల్లోకి ఎక్కాడు. రంజీ ట్రోఫీలో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు.

రంజీ ట్రోఫీలో అంతకుముందు ఈ ఘనతను ప్రేమంగ్షు ఛటర్జీ, ప్రదీప్ సుందరం సాధించారు. 1957లో బెంగాల్ తరఫున ఛటర్జీ అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టాడు. అలాగే 1985లో రాజస్థాన్ తరఫున ప్రదీప్ విదర్భపై పది వికెట్లు సాధించాడు. 39 ఏళ్ల తర్వాత మళ్లీ కాంబోజ్ ఈ రేర్ ఫీట్ అందుకున్నాడు. కాంబోజ్ ఎవరన్న విషయానికి వస్తే.. 23 ఏళ్ల అన్షుల్ కాంబోజ్ 2021-22 రంజీ ట్రోఫీలో హర్యానా తరపున 17 ఫిబ్రవరి 2022న ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. అతను 2022-23 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హర్యానా తరపున 22 అక్టోబర్ 2022న తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.

19 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లు ఆడిన కాంబోజ్ 57 వికెట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. 2024 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న వేళ కాంబోజ్ అద్భుతమైన ప్రదర్శన అతడిపై కోట్లు కురిపించే అవకాశం ఉంది. ఫ్రాంచైజీలు కాంబోజ్ కోసం పోటీ పడే అవకాశం ఉందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. మరి ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు నేల కూల్చి రికార్డ్ క్రియేట్ చేసిన అన్షుల్ కాంబోజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.