వరల్డ్‌ కప్‌ ముందు సౌతాఫ్రికాకు బిగ్‌ షాక్‌! ఇద్దరు స్టార్లు దూరం

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌ కప్‌ 2023 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 5 నుంచి భారత్‌ వేదికగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి టాస్‌ పడనుంది. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌ కోసం.. అన్నీ ప్రధాన జట్లు సంసిద్ధం అవుతున్నాయి. కానీ, కొన్ని జట్లకు మాత్రం వరల్డ్‌ కప్‌ ముందు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రతి వరల్డ్‌ కప్‌లో పటిష్టమైన జట్టుగా బరిలోకి దిగే సౌతాఫ్రికా జట్టు.. ఈ వరల్డ్‌ కప్‌కు బలమైన టీమ్‌తో దిగేందుకు సిద్ధమైంది.

కానీ, సరిగ్గా వరల్డ్‌ కప్‌ ఆరంభానికి ముందు ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులోని ఇద్దరు కీలక ఆటగాళ్లు వరల్డ్‌ కప్‌కు దూరం అయినట్లు విశ్వనీయ సమాచారం. స్టార్‌ బౌలర్‌ అన్రిచ్‌ నోర్జేతో పాటు సిసంద మగల గాయాలతో వరల్డ్‌ కప్‌కు పూర్తిగా దూరమైనట్లు తెలుస్తుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో నోర్జే తీవ్రంగా గాయపడ్డాడు. మ్యాచ్‌ మధ్యలోనే తీవ్ర నొప్పితో బాధపడిన అతన్ని మెరుగైన వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇక మగల మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో వీళ్లిద్దరూ వరల్డ్‌ కప్‌కు దూరం అవుతున్నారు.

ఇద్దరు మంచి ప్లేయర్లు వరల్డ్‌ కప్‌ దూరం కావడం సౌతాఫ్రికా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఆస్ట్రేలియాతో సిరీస్‌ కంటే ముందు ఎంతో పటిష్టంగా కనిపించిన సౌతాఫ్రికా జట్టు.. సిరీస్‌లో వీళ్లు గాయపడటంతో కాస్త బలహీనంగా మారింది. సిరీస్‌లోని ఆరంభం మ్యాచ్‌ల్లో స్టార్‌ ప్లేయర్లు.. కెప్టెన్‌ టెంబ బవుమా, క్లాసెన్‌, మార్కరమ్‌, డికాక్‌ లాంటి ఆటగాళ్లు అద్భుతం ఫామ్‌లోకి రావడంతో.. ఇప్పటి వరకు వరల్డ్‌ కప్‌ గెలవని సౌతాఫ్రికా.. ఈ సారి కచ్చితంగా వరల్డ్‌ కప్‌ గెలుస్తుందని చాలా మంది క్రికెటర్లు భావించారు. మరి ఇప్పుడు ఇద్దరు ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరం కావడంతో.. టోర్నీ మధ్యలో ఎదురయ్యే దురదృష్టం ఈ సారి వరల్డ్‌కప్‌ ఆరంభంలోనే ఎదురైందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై విచారణ జరపండి! పోలీసులకు ఫిర్యాదు

Show comments