iDreamPost
android-app
ios-app

Anil Gaurav: సచిన్ కన్నా గొప్ప క్రికెటర్! అనిల్‌ గురవ్‌ ఫెయిల్యూర్ స్టోరీ!

  • Published Jan 31, 2024 | 2:34 PM Updated Updated Jan 31, 2024 | 9:27 PM

Anil Gaurav: అతని ఆట చూసి.. క్రికెట్‌ నేర్చుకున్న వ్యక్తి సచిన్‌, అతని బ్యాట్‌తోనే తన జీవితంలో సచిన్‌ తొలి సెంచరీ నమోదు చేశాడు. ఇలా సచిన్‌ బచ్చాగా ఉన్నపుడే అతను తోపు క్రికెటర్‌. కానీ, సచిన్‌ క్రికెట్‌కు దేవుడిగా ఎదిగితే.. అతను మాత్రం మురికివాడల్లోనే మిగిలిపోయాడు. ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Anil Gaurav: అతని ఆట చూసి.. క్రికెట్‌ నేర్చుకున్న వ్యక్తి సచిన్‌, అతని బ్యాట్‌తోనే తన జీవితంలో సచిన్‌ తొలి సెంచరీ నమోదు చేశాడు. ఇలా సచిన్‌ బచ్చాగా ఉన్నపుడే అతను తోపు క్రికెటర్‌. కానీ, సచిన్‌ క్రికెట్‌కు దేవుడిగా ఎదిగితే.. అతను మాత్రం మురికివాడల్లోనే మిగిలిపోయాడు. ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 31, 2024 | 2:34 PMUpdated Jan 31, 2024 | 9:27 PM
Anil Gaurav: సచిన్ కన్నా గొప్ప క్రికెటర్! అనిల్‌ గురవ్‌ ఫెయిల్యూర్ స్టోరీ!

సచిన్‌ టెండూల్కర్‌.. ఈ పేరు తెలియని క్రికెట్‌ అభిమాని లేడంటే అతిశయొక్తి కాదు. క్రికెట్‌ ప్రపంచంలో సచిన్‌ స్థానం ఏంటో అందరికి తెలిసిందే. తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. క్రికెట్‌ను మతంలా ఆరాధించే దేశంలో దేవుడిలా ఎదిగాడు. కేవలం సచిన్‌ బ్యాటింగ్‌ కోసమే క్రికెట్‌ చూసేవాళ్లు లక్షల్లో ఉండేవారు. సచిన్‌తో ఆడిన చాలా మంది బౌలర్లు.. సచిన్‌ను అవుట్‌ చేస్తే క్రికెటర్‌గా తమ జన్మధన్యమైనట్లుగా భావించేవారు. ఇక సచిన్‌ ఆటోగ్రాఫ్‌, ఫొటోగ్రాఫ్‌ కోసం పోటీ పడే అభిమాన సంద్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. సచిన్‌ లాంటి క్రికెటర్‌ మన దేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టంగా భావించే క్రికెట్‌ అభిమానులు చాలా మందే ఉన్నారు. అయిదే.. ‘సచిన్‌ను మించిన’ క్రికెటర్‌ కూడా మన దేశంలో పుట్టాడంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. సచిన్‌ కంటే ముందే టీమిండియాకు ఆడి, సచిన్‌ కంటే గొప్ప క్రికెటర్‌గా ఎదగాల్సిన అతను.. దేశానికి ఆడకుండా, వెలుగులోకి రాకుండా ముంబై మురికివాడల్లోనే మిగిలిపోయాడు. ఇప్పుడా క్రికెటర్‌ గురించి మనం తెలుసుకుందాం..

సచిన్‌కు క్రికెట్‌ పాఠాలు నేర్పిన కోచ్‌ రమాకాంత్‌ అచ్రేకర్‌ వద్దే అనిల్‌ గురవ్‌ అనే కుర్రాడు కూడా క్రికెట్‌ కోచింగ్‌ తీసుకుంటున్నాడు. సచిన్‌ కంటే కాస్త సీనియర్‌ అతను. పైగా రమాకాంత్‌కు అత్యంత ప్రియమైన శిష్యుడు. తన వద్ద శిక్షణ పొందుతున్న కుర్రాళ్లలో అందరి కంటే ముందు టీమిండియాకు ఆడబోయేది అతనే అని కోచ్‌ రమాకాంత్‌ బల్లగుద్ది చెప్పేవారు. అనిల్‌ నెట్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న టైమ్‌లో, ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో కోచ్‌ రమాకాంత్‌ సచిన్‌ టెండూల్కర్‌-వినోద్‌ కాంబ్లీలను పిలిచి.. అనిల్‌ బ్యాటింగ్‌ను జాగ్రత్తగా గమనించాలని ఆదేశించేవారు. అనిల్‌ టైమింగ్‌, షాట్‌ ఆడుతున్న విధానం, ఫుట్‌వర్క్‌ను చాలా కీన్‌గా అబ్జర్వ్‌ చేయాలని చెప్పేవారు. సచిన్‌-కాంబ్లీ కూడా అనిల్‌ బ్యాటింగ్‌ను నెట్స్‌ వెనుక ఉండి గమనించేవారు.

Anil gurav life story

సచిన్‌ తన అండర్‌-14 తొలి మ్యాచ్‌ను అనిల్‌ గురవ్‌ బ్యాట్‌తోనే ఆడి తన జీవితంలో తొలి సెంచరీ బాదాడు. తన బ్యాట్‌ అడిగేందుకు భయపడుతూ వచ్చిన సచిన్‌ను.. దగ్గరకు పిలిచి ‘నా బ్యాట్‌ ఇస్తాను కానీ, నా బ్యాట్‌తో ఆడితే నువ్వు సెంచరీ కొట్టాలి’ అని ఒక కండీషన్‌ పెట్టాడు అనిల్‌.. దానికి ‘సరే సార్‌’ అని సచిన్‌ బదులిచ్చి, అనిల్‌ నుంచి ఎస్‌జీ బ్యాట్‌ను తీసుకుని అండర్‌ 14లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టాడు. ఇలా అనిల్ బ్యాటింగ్‌ చూసి టెక్నిక్స్‌ నేర్చుకుని, అతన్ని సార్‌ అని పిలుస్తూ.. అతని బ్యాట్‌తో జీవితంలో తొలి సెంచరీ కొట్టిన సచిన్‌ ప్రస్తుతం ప్రపంచ దిగ్గజ క్రికెటర్‌గా ఎదిగితే.. అనిల్‌ మాత్రం ముంబై మురికి వాడల్లో మిగిలిపోయాడు. అందుకు కారణం.. అనిల్‌ తమ్ముడు అజిత్‌.

సచిన్‌కు అజిత్‌ అనే అన్న ఉన్నట్లే.. అనిల్‌కు కూడా అనిత్‌ అనే తమ్ముడు ఉన్నాడు. సచిన్‌ అన్న అజిత్‌.. తన తమ్ముడిని క్రికెట్‌లో గొప్పొడిగా చూడాలని కలలుకని, అందుకోసం తన వంతు శ్రమిస్తే.. అనిల్‌ తమ్ముడు అజిత్‌ మాత్రం అన్న కలలు, కెరీర్‌ నాశనం అయ్యేందుకు కారణం అయ్యాడు. అనిల్‌ తమ్ముడు అజిత్‌ ముంబై అండర్‌వరల్డ్‌లో షార్ఫ్‌షూటర్‌గా మారి, సంఘవిద్రోహ శక్తుల గ్యాంగ్‌లో చేరిపోయాడు. పోలీసులు అనిల్‌తో పాటు వాళ్ల అమ్మను కూడా అజిత్‌ జాడ చెప్పాలని చిత్రహింసలు పెట్టేవారు. అజిత్‌ గురించి ఎంక్వైరీ చేసిన ప్రతిసారి.. అనిల్‌ను, వాళ్ల అమ్మను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలు చేసేవారు.

Anil gurav life story

దీంతో అనిల్‌ క్రికెట్‌ ప్రాక్టీస్‌ దూరమయ్యాడు. సమాజంలో తమ పరువుపోయిందనే ఆవేదనకు తోడు పోలీసుల టార్చర్‌ ఎక్కువ కావడంతో మద్యానికి అలవాటయ్యాడు. మెల్లమెల్లగా దానికి బానిసగా మారి తన క్రికెట్‌ కెరీర్‌, దేశం తరఫున ఆడాలనే కలను మర్చిపోయాడు. అప్పుడప్పుడు డబ్బుల కోసం టెన్నిస్‌ క్రికెట్‌ కూడా ఆడాడు. టీమిండియాకు ఆడతాడుకున్న కుర్రాడు ఇలా మత్తుకు బానిసై, చిల్లర డబ్బుల కోసం టెన్నిస్‌ క్రికెట్‌ ఆడుతుండటం చూసి.. తట్టుకోలేకపోయిన కోచ్‌ రమాకాంత్‌ అచ్రేకర్‌, అనిల్‌ను అందులోంచి బయటపడాలని గట్టిగానే వారించారు. కానీ.. అనిల్‌ వినిపించుకోలేడు.

ఇతను ప్రస్తుతం ముంబైలోని నాలాసోపురా అనే మురికివాడలో ఒక చిన్న ఇంట్లో జీవనం సాగిస్తూ.. తన తల్లి, కుటుంబం కోసం గొడ్డుచాకిరీ చేస్తున్నాడు. తన తమ్ముడు చేసిన తప్పుకు అనిల్‌ తన క్రికెట్‌ జీవితం కోల్పోవడమే కాకుండా.. సచిన్‌ను మించిన క్రికెటర్‌ దేశానికి దక్కకుండా పోయాడు. 1990ల్లో సచిన్‌ టీమిండియాకు ఆడుతున్న సమయంలో ఇస్లామ్‌లోని జిమ్‌ఖానా గ్రౌండ్‌లో సచిన్‌ను చూసేందుకు వెళ్లిన గుంపులో అనిల్‌ను గుర్తుపట్టి మరీ సచిన్‌ పిలిపించుకుని ఇంటికి రావాలని ఆహ్వానించాడంటే.. అనిల్‌, సచిన్‌పై ఎంత ప్రభావం చూపి ఉండాడో అర్థం చేసుకోవచ్చు. ఎంత టాలెంట్‌ ఉన్నా.. కుటుంబ మద్దతు, మంచి నేపథ్యం లేకపోవడంతో.. సచిన్‌ అవ్వాల్సిన వ్యక్తి అనిల్‌లా మిగిలిపోయాడు. మరి.. కన్నీళ్లు పెట్టించే అనిల్‌ గురవ్‌ జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.