iDreamPost
android-app
ios-app

Rohit Sharma: ఆ టోర్నీలో ఆడిస్తే రోహిత్ స్పృహ తప్పడం ఖాయం.. మాజీ క్రికెటర్ కామెంట్స్!

  • Published Jul 25, 2024 | 7:26 PM Updated Updated Jul 25, 2024 | 7:26 PM

టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ సొంతమవడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు హిట్​మ్యాన్ రోహిత్. విక్టరీ సెలబ్రేషన్స్ ముగియడంతో ఇప్పుడు తదుపరి అసైన్​మెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు.

టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ సొంతమవడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు హిట్​మ్యాన్ రోహిత్. విక్టరీ సెలబ్రేషన్స్ ముగియడంతో ఇప్పుడు తదుపరి అసైన్​మెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు.

  • Published Jul 25, 2024 | 7:26 PMUpdated Jul 25, 2024 | 7:26 PM
Rohit Sharma: ఆ టోర్నీలో ఆడిస్తే రోహిత్ స్పృహ తప్పడం ఖాయం.. మాజీ క్రికెటర్ కామెంట్స్!

టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ సొంతమవడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు హిట్​మ్యాన్ రోహిత్. చిరకాల కోరిక నెరవేరడంతో అతడి సంతోషానికి పగ్గాల్లేకుండా పోయింది. ప్లేయర్​గా టీ20 వరల్డ్ కప్​-2007ను గెలుచుకున్న టీమ్​లో భాగంగా ఉన్నాడు హిట్​మ్యాన్. కెరీర్ ఆరంభంలోనే ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడాడు. అయితే ఆ తర్వాత సీనియర్​గా మారడం, వరల్డ్ క్లాస్ బ్యాటర్​గా పేరు తెచ్చుకోవడం, కెప్టెన్సీ కూడా చేపట్టడం తెలిసిందే. అయితే అతడు ఎంత ఎదిగినా జట్టుకు మరో కప్పు మాత్రం అందివ్వలేకపోయాడు. ఎట్టకేలకు పొట్టి ప్రపంచ కప్-2024తో ఆ కల తీరింది. విక్టరీ సెలబ్రేషన్స్ ముగియడంతో ఇప్పుడు తదుపరి అసైన్​మెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు హిట్​మ్యాన్.

శ్రీలంకతో ఆగస్టు మొదటి వారంలో జరిగే వన్డే సిరీస్​తో మళ్లీ గ్రౌండ్​లోకి అడుగుపెట్టనున్నాడు రోహిత్. మరో రెండు, మూడ్రోజుల్లో పొరుగు దేశానికి అతడు పయనం కానున్నాడు. వచ్చే ఏడాది వన్డే ఫార్మాట్​లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండటంతో దాని మీద అతడు దృష్టి పెట్టాడు. మరో ఐసీసీ ట్రోఫీని గెలుచుకొని కెరీర్​ను మరింత చిరస్మరణీయం చేసుకోవాలని చూస్తున్నాడు. 37 ఏళ్ల రోహిత్​ ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతాడో చెప్పలేని పరిస్థితి. అయితే అతడిలో ఇంకా చాలా క్రికెట్ ఉందని.. ఫిట్​గా ఉంటే వన్డే వరల్డ్ కప్-2027లో కూడా ఆడతాడని కొత్త కోచ్ గౌతం గంభీర్ ఇటీవల స్పష్టం చేశాడు. దీంతో రోహిత్​ను ఇంకో ప్రపంచ కప్​లో చూడొచ్చని ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే అతడు​ మరో మెగాటోర్నీలో ఆడటం కష్టమేనని.. స్పృహ తప్పి పడిపోతాడని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అంటున్నాడు.

రోహిత్ వచ్చే వన్డే వరల్డ్ కప్​లో ఆడటం సాధ్యం కాదన్నాడు క్రిష్ శ్రీకాంత్. కానీ మరో సీనియర్ విరాట్ కోహ్లీ మాత్రం ఆ టోర్నీ బరిలో దిగడం ఖాయమన్నాడు. కోహ్లీ హై ఫిట్​నెస్​ స్టాండర్డ్స్ మెయింటెయిన్ చేస్తున్నాడని, కాబట్టి ఇంకోసారి మెగాటోర్నీలో ఆడటం పెద్ద సమస్య కాదన్నాడు. కానీ రోహిత్​కు మాత్రం కుదరదన్నాడు. 37 ఏళ్ల రోహిత్​కు వన్డే వరల్డ్ కప్-2027 కల్లా 40 ఏళ్లు వస్తాయని, ఆ ఏజ్​లో బ్యాటింగ్ చేయడం ఈజీ కాదన్నాడు కృష్ణమాచారి శ్రీకాంత్. ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ లాంటి సూపర్ ఫిట్ ప్లేయర్లు మాత్రం ఆ వయసులోనూ అదే రేంజ్​లో ఆడగలరని.. రోహిత్ వల్ల కాదన్నాడు. ఒకవేళ అతడ్ని వన్డే ప్రపంచ కప్​ కోసం సౌతాఫ్రికాకు తీసుకెళ్తే అతడు స్పృహ తప్పి పడిపోవడం ఖాయమన్నాడు. మరి.. రోహిత్ వచ్చే వరల్డ్ కప్​లో ఆడగలడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.