SNP
Anand Mahindra, Mahindra Thar, Sarfaraz Khan: ఇచ్చిన మాట నిలబెట్టుకునే వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఓ ప్రముఖ వ్యాపార వేత్త ఉన్నారు. అయితే.. ఆయన ఎవరి విషయంలో మాట నిలబెట్టుకున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Anand Mahindra, Mahindra Thar, Sarfaraz Khan: ఇచ్చిన మాట నిలబెట్టుకునే వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఓ ప్రముఖ వ్యాపార వేత్త ఉన్నారు. అయితే.. ఆయన ఎవరి విషయంలో మాట నిలబెట్టుకున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
కొన్ని రోజుల క్రితం ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 4-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షమీ లాంటి స్టార్లు లేకపోయినా.. కుర్రాళ్లతో నిండిన జట్టును అద్భుతంగా నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ విక్టరీని అందుకున్నాడు. అయితే.. సిరీస్‌లో కొంతమంది కుర్రాళ్లు బాగా హైలెట్ అయ్యారు. ప్రదర్శనతో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ గురించి. దేశవాళి క్రికెట్‌లో చాలా కాలంగా అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కు నిజానికి ఎప్పుడో టీమిండియాలో చోటు దక్కి ఉండాల్సింది. కానీ, ఎందుకో.. చాలా కాలం తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతనికి అవకాశం వచ్చింది.
వచ్చిన ఛాన్స్‌ను అద్భుతంగా వాడుకున్న సర్ఫారాజ్ ఖాన్ తొలి మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు. అయితే.. సర్ఫరాజ్ ఖాన్ టెస్ట్ క్యాప్ అందుకుంటున్న సమయంలో చాలా ఎమోషనల్ మూమెంట్స్ చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్ తండ్రి ఎమోషనల్ అవుతూ.. గ్రౌండ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. సర్ఫరాజ్ ఖాన్ కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని, తన జీవితం మొత్తం కొడుకును పెద్ద క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకే ఖర్చు చేసినట్లు చాలా కథనాలు వచ్చాయి. సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు.
అయితే.. సర్ఫరాజ్ ఖాన్ సక్సెస్‌లో అతని తండ్రి నౌషద్ ఖాన్ కూడా చాలా క్రెడిట్ దక్కింది. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సర్ఫరాజ్ ఖాన్ తండ్రిని ప్రశంసిస్తూ.. ఆయనకు ఓ ఆఫర్ ఇచ్చారు. ఆయన శ్రమ నుంచి స్ఫూర్తి పొందుతూ.. నౌషధ్ ఖాన్ అంగీకరిస్తే.. ఆయనకు మహీంద్రా థార్‌ను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్లు ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. ఆయన విజ్ఞప్తిని సర్ఫరాజ్ ఖాన్ తండ్రి మన్నించినట్లు ఉన్నారు. వెంటనే ఆనంద్ మహీంద్రా నుంచి సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి కారు అందింది. ఆ కారు ముందు నౌషధ్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ నిలబడి ఫొటోలు దిగారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Anand Mahindra has gifted Thar to Sarfaraz Khan’s father 👏 pic.twitter.com/Q0lRmQ60Va
— Johns. (@CricCrazyJohns) March 22, 2024