iDreamPost
android-app
ios-app

Amit Shah: ఛాంపియన్స్ ట్రోఫీపై తేల్చేసిన అమిత్ షా.. ఒక్క కామెంట్​తో ఫుల్ క్లారిటీ!

  • Published Sep 06, 2024 | 10:02 PM Updated Updated Sep 06, 2024 | 11:09 PM

Amit Shah, Champions Trophy 2025, Team India, Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్​కు టీమిండియా వెళ్తుందా? లేదా? అనేది చాన్నాళ్లుగా జవాబు లేని ప్రశ్నగానే ఉండిపోయింది. తమ దేశానికి రోహిత్ సేన వచ్చి తీరాలని పీసీబీ పట్టు పడుతోంది. అయితే అక్కడికి మెన్ ఇన్ బ్లూను పంపేది లేదంటూ భారత బోర్డు మొండికేస్తోంది.

Amit Shah, Champions Trophy 2025, Team India, Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్​కు టీమిండియా వెళ్తుందా? లేదా? అనేది చాన్నాళ్లుగా జవాబు లేని ప్రశ్నగానే ఉండిపోయింది. తమ దేశానికి రోహిత్ సేన వచ్చి తీరాలని పీసీబీ పట్టు పడుతోంది. అయితే అక్కడికి మెన్ ఇన్ బ్లూను పంపేది లేదంటూ భారత బోర్డు మొండికేస్తోంది.

  • Published Sep 06, 2024 | 10:02 PMUpdated Sep 06, 2024 | 11:09 PM
Amit Shah: ఛాంపియన్స్ ట్రోఫీపై తేల్చేసిన అమిత్ షా.. ఒక్క కామెంట్​తో ఫుల్ క్లారిటీ!

ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఈ టోర్నమెంట్ కోసం దాయాది దేశానికి టీమిండియా వెళ్తుందా? లేదా? అనేది చాన్నాళ్లుగా జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ టోర్నమెంట్​కు రోహిత్ సేనను పంపేది లేదంటూ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తోంది భారత క్రికెట్ బోర్డు. సెక్యూరిటీ రీజన్స్, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడం, సరిహద్దు సమస్యల నేపథ్యంలో ఆ టోర్నీకి వచ్చేది లేదంటూ పట్టుదలగా ఉంటోంది. జైషా ఐసీసీ ప్రెసిడెంట్ అవడంతో ఈ విషయంలో భారత్ మాట నెగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సహా అన్ని టీమ్స్ వస్తున్నాయని.. భారత్​ మాత్రం ఎందుకు రాదంటూ అడ్డగోలుగా వాదిస్తోంది. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తేల్చేశారు.

భారత్-పాకిస్థాన్ సంబంధాలపై అమిత్ షా తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉగ్రవాదం అంతం అయ్యే వరకు పాక్​తో చర్చలు జరిపేది లేదన్నారు. అయితే కశ్మీర్ యువతతో మాత్రం తాము తప్పకుండా మాట్లాడతామని తెలిపారు. లైన్ ఆఫ్​ కంట్రోల్ గుండా ఇరు దేశాల మధ్య జరిగే ఎగుమతులు, దిగుమతుల పునరుద్ధరణ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా ఆన్సర్ ఇచ్చారు. ట్రేడ్ ఎకో సిస్టమ్​లోనూ టెర్రరిస్టుల జోక్యం ఉందన్న షా.. ఉగ్రవాదం అంతం అయ్యే వరకు ఎలాంటి సంబంధాలను పునరుద్ధరించబోమని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఛాంపియన్స్ ట్రోఫీపై క్లారిటీ వచ్చేసిందని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. పాక్​కు టీమిండియాను పంపబోమని ఆయన ఇన్​డైరెక్ట్​గా క్లారిటీ ఇచ్చారని చెబుతున్నారు. షా వ్యాఖ్యలతో పాక్​పై భారత్ ఎంత సీరియస్​గా ఉందన్నది అర్థం అవుతోందని.. ఈ సిచ్యువేషన్స్​లో ఇంక టీమ్​ను పాక్​కు ఎలా పంపిస్తారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

కాగా, పాక్​కు టీమిండియాను పంపేది లేదంటూ బీసీసీఐ పట్టుదలతో వ్యవహరించడం, ఆ తర్వాత ఐసీసీకి ఛైర్మన్​గా జైషా నియామకం కావడంతో మన బోర్డు చెప్పిందే నడుస్తుందని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ వర్గాలు చెప్పడంతో ఏం జరుగుతుందోనని అంతా ఎదురు చూశారు. అటు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచెస్, వెన్యూస్​కు సంబంధించిన డ్రాఫ్ట్​ను ఐసీసీకి పీసీబీ సబ్మిట్ చేసింది. దీంతో ఈ వివాదంపై సెంట్రల్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందోనని వెయిట్ చేస్తున్న టైమ్​లో తాజాగా అమిత్ షా పైవ్యాఖ్యలు చేశారు. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న ఆయన.. టెర్రరిజం అంతం అయ్యే వరకు ఆ దేశంతో చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. పాక్​తో సంబంధాలను పునరుద్ధరించేది లేదని క్లారిటీ ఇచ్చారు.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/