Nidhan
టీ20 వరల్డ్ కప్-2024ను టీమిండియా కైవసం చేసుకోవడంలో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పాత్ర కూడా ఎంతో ఉంది. జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా అర్ష్‌దీప్ రాణించడం వల్లే బౌలింగ్‌లో భారత్‌కు ఎదురు లేకుండా పోయింది.
టీ20 వరల్డ్ కప్-2024ను టీమిండియా కైవసం చేసుకోవడంలో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పాత్ర కూడా ఎంతో ఉంది. జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా అర్ష్‌దీప్ రాణించడం వల్లే బౌలింగ్‌లో భారత్‌కు ఎదురు లేకుండా పోయింది.
Nidhan
అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్‌ను భారత్ కైవసం చేసుకోవడంలో అటు బ్యాటర్లతో పాటు ఇటు బౌలర్ల పాత్ర కూడా ఎంతో ఉంది. బ్యాటింగ్ యూనిట్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, అక్షర్ పటేల్ సత్తా చాటారు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా దగ్గర నుంచి అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ వరకు అందరూ రాణించారు. బుమ్రా బౌలింగ్ అటాక్‌ను లీడ్ చేయగా.. అతడి నేతృత్వంలో అర్ష్‌దీప్ చెలరేగిపోయాడు. ఏకంగా 17 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బుమ్రా పరుగులు ఇవ్వకుండా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఇది అర్ష్‌దీప్‌కు హెల్ప్ అయింది. అతడి బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు.
ప్రపంచ కప్ విజయంలో తన వంతు పాత్ర పోషించిన అర్ష్‌దీప్ సింగ్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో గెలిచాక తాను ఎమోషనల్ అయ్యానని అన్నాడు అర్ష్‌దీప్. అయితే ఎంత ఏడ్వాలని అనుకున్నా తనకు కన్నీళ్లు రాలేదన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్ తరఫున ఎన్నో థ్రిల్లర్ మ్యాచ్‌లు ఆడానన్నాడు. ఆఖరి బంతి వరకు వెళ్లిన మ్యాచులు చూడటంతో మనసుకు అలవాటు అయిందన్నాడు. అందుకే తాను తీవ్ర భావోద్వేగానికి లోనవ్వలేదని చెప్పాడు. తనకు కన్నీళ్లు రాలేదన్నాడు. కానీ ఫైనల్లో విక్టరీ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం ఏడ్చేశారని తెలిపాడు అర్ష్‌దీప్. వాళ్లిద్దరూ చాలా ఎమోషనల్ అయిపోయారని పేర్కొన్నాడు.
సౌతాఫ్రికాపై గెలిచి కప్పు అందుకున్న తరుణంలో రోహిత్-కోహ్లీ సంతోషంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయారని అర్ష్‌దీప్ అన్నాడు. వాళ్లిద్దరూ ట్రోఫీతో టీ20 కెరీర్‌ను ముగించడం హ్యాపీ అని వివరించాడు. ఇక, అర్ష్‌దీప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వరల్డ్ కప్ గెలిచాక రోహిత్, కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్ తదితరులు ఎమోషన్ ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారని.. కానీ అర్ష్‌దీప్ మాత్రం కామ్‌గా ఉన్నాడని కొందరు నెటిజన్స్ అంటున్నారు. అతడి స్వభావం అలాంటిదని, ఇందులో ఆశ్చర్యమేమీ లేదని చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం కోహ్లీ, రోహిత్ మాదిరిగా భారీ ఓటములు, వరల్డ్ కప్ చేతి దాకా వచ్చి మిస్ అయితే ఉండే బాధ ఏంటో అర్ష్‌దీప్‌కు తెలియదని కామెంట్స్ చేస్తున్నారు. రోకో జోడీ ఎన్నో సార్లు కప్ మిస్ అయిందని, అందుకే అంతగా ఏడ్చారని అంటున్నారు.