iDreamPost
android-app
ios-app

కోచ్‌గా వెళ్లిపోతూ.. కోహ్లీకి మరో టార్గెట్‌ ఇచ్చిన రాహుల్‌ ద్రవిడ్‌!

  • Published Jul 01, 2024 | 3:19 PM Updated Updated Jul 01, 2024 | 3:19 PM

Rahul Dravid, Virat Kohli, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ ముగిసిన వెంటనే టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి రాహుల్‌ ద్రవిడ్‌ మరో భారీ టార్గెట్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Rahul Dravid, Virat Kohli, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ ముగిసిన వెంటనే టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి రాహుల్‌ ద్రవిడ్‌ మరో భారీ టార్గెట్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 01, 2024 | 3:19 PMUpdated Jul 01, 2024 | 3:19 PM
కోచ్‌గా వెళ్లిపోతూ.. కోహ్లీకి మరో టార్గెట్‌ ఇచ్చిన రాహుల్‌ ద్రవిడ్‌!

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రస్తుతం ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. అది టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచిన సంతోషం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 17 ఏళ్ల తర్వాత టీమిండియా రెండో సారి టీ20 వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకుంది. అప్పుడెప్పుడో టీ20 ఫార్మాట్‌లో వరల్డ్‌ కప్‌ టోర్నీని ప్రారంభించిన ఏడాది అంటే 2007లో భారత్‌ ఛాంపియన్‌గా నిలిచింది. సౌతాఫ్రికా వేదికగా జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ను ధోని సారథ్యంలోని భారత​ జట్టు కైవసం చేసుకుని విశ్వవిజేతగా నిలిచింది. మళ్లీ ఇన్నేళ్లకు రోహిత్‌ కెప్టెన్సీలో టీమిండియా ఛాంపియన్‌ అయింది.

ఫైనల్‌ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను తన అనుభవంతో గట్టెక్కించాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 76 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబేతో కలిసి అద్భుతమైన పార్ట్నర్‌షిప్‌లు నెలకొల్పి.. టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. కోహ్లీ పడిన కష్టానికి బౌలర్లు మంచి మద్దతు ఇవ్వడంతో టీమిండియా ఛాంపియన్‌గా నిలిచి.. టీ20 వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకుంది. కోహ్లీ ఎంతో సంతోషంగా తన కెరీర్‌లో తొలి టీ20 వరల్డ్‌ కప్‌ను లిఫ్ట్‌ చేశాడు. టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన కోహ్లీకి.. ద్రవిడ్‌ మరో టార్గెట్‌ ఇచ్చాడు.

అదేంటంటే.. కోహ్లీ ఇప్పటికే వైట్‌ బాల్‌ క్రికెట్‌లో ఉన్న అన్ని కప్పులు సాధించాడని, ఇక రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో సాధించాల్సిన కప్పు ఇంకొకటి ఉందంటూ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని కోహ్లీతోనే చెప్పాడు ద్రవిడ్‌. విరాట్‌ కోహ్లీ తన కెరీర్‌లో అండర్‌-19 వరల్డ్‌ కప్‌ గెలిచాడు. అతనే కెప్టెన్‌ అప్పుడు. అలాగే టీమిండియా తరఫున 2011లో వన్డే వరల్డ్‌ కప్‌, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ, ఇప్పుడు టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమ్‌లో సభ్యుడు. అలాగే ఆసియా కప్‌ కూడా గెలిచాడు. ఇక మిగిలింది వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌. 2021 ‍కంటే ముందు టెస్టు టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా పాయింట్ల పట్టికలో నంబర్‌ వన్‌ ప్లస్‌లో ఉన్న టీమ్‌కు టెస్ట్‌ ట్రోఫీగా గద ఇచ్చేవాళ్లు. కానీ, తర్వాత వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్స్‌ పేరిట టాప్‌ టూ టీమ్స్‌ మధ్య ఫైనల్‌ నిర్వహిస్తున్నారు. 2021, 2023లో వరుసగా రెండు సార్లు టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడింది. కానీ, 2021లో న్యూజిలాండ్‌ చేతిలో, 2023లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. ఇక 2025లో జరగబోయే డబ్య్లూటీసీ ఫైనల్‌ ఆడితే ఆ కప్పు గెలవాలని కోహ్లీకి ద్రవిడ్‌ సూచించాడు. మరి అన్ని సాధించిన కోహ్లీ.. ద్రవిడ్‌ ఇచ్చిన టార్గెట్‌ను కూడా పూర్తి చేస్తాడో లేదో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.