iDreamPost
android-app
ios-app

కేరళ వరద బాధితులకు ఉచితంగా ఇల్లు! ధోని ఫ్యాన్స్‌ గొప్ప మనసు

  • Published Aug 06, 2024 | 4:55 PM Updated Updated Aug 06, 2024 | 4:55 PM

MS Dhoni, AKDFA, Kerala, Wayanad: టీమిండియా మాజీ క్రికెటర్‌ ధోని అభిమానులు ఒక గొప్ప పనికి పూనుకున్నారు. కేరళ వరద బాధితులకు ఉచితంగా ఇళ్లు నిర్మించే ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ విషయం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..

MS Dhoni, AKDFA, Kerala, Wayanad: టీమిండియా మాజీ క్రికెటర్‌ ధోని అభిమానులు ఒక గొప్ప పనికి పూనుకున్నారు. కేరళ వరద బాధితులకు ఉచితంగా ఇళ్లు నిర్మించే ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ విషయం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 06, 2024 | 4:55 PMUpdated Aug 06, 2024 | 4:55 PM
కేరళ వరద బాధితులకు ఉచితంగా ఇల్లు! ధోని ఫ్యాన్స్‌ గొప్ప మనసు

కేరళలోని వయనాడ్‌ ప్రాంతంలో వరదల వల్ల కొండచరియలు విరిగి వందల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో చాలా మంది తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ప్రకృతి ప్రకోపానికి బలై.. రోడ్డు మీదుకి వచ్చేసిన వారిని ఆదుకోవడానికి టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని అభిమానులు ముందుకు వచ్చారు. ఆల్‌ కేరళ ధోని ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ వాళ్లు.. వయనాడ్‌ వరదల్లో ఇళ్లు కోల్పోయి.. ఉండేందుకు ఇల్లు లేని కుటుంబానికి కొత్త ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు.

ధోనికి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయినా కూడా ధోనికి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఇంచు కూడా తగ్గలేదు సరికదా.. మరింతగా పెరిగింది. కేవలం ధోనిని అభిమానించడమే కాదు.. ధోని పేరు మీద ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు ఆయన అభిమానులు. ధోని పుట్టిన రోజును పురస్కరించుకని.. అన్నదానాలు, పేద క్రికెటర్లకు కిట్‌ల పంపిణీ లాంటి సేవా కార్యక్రమాలు అనేకం చేస్తుంటారు. తాజాగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వయనాడ్‌ వరద బాధితులకు కూడా తమ వంతు సాయం అందించేందకు ముందుకు వచ్చారు.

Dhoni

అయితే.. ఈ వరదల్లో కొండచరియలు విరిగి పడి దాదాపు 400 వందల మందికిపైగా మృతి చెందారు. ఈ భారీ దుర్ఘటనలో బతికి బట్టకట్టిన వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. అందులో కూడా కనీసం ఉండేందుకు ఇల్లులేని కుటుంబాలకు అయినా, ఒక్కరు ఉన్నా.. వారికి ఇల్లు డొనేట్‌ చేస్తామని ఆల్‌ కేరళ ధోని ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ప్రకటించారు. అయితే.. ఈ విషయం ధోని వరకు చేరితే.. ఈ సాయానికి ధోని వంతు మద్దతు కూడా లభిస్తుందని, అలాగే ఇతర ధోని అభిమానుల సంఘాల నుంచి కూడా ఆల్‌ కేరళ ధోని ఫ్యాన్స్‌ అసోసియేషన్‌కు సాయం అందే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి కష్టసమయంలో ఆసరాగా నిలుస్తున్న ధోని అభిమానులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.