iDreamPost
android-app
ios-app

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్‌ క్రికెటర్‌

  • Published Aug 04, 2023 | 6:14 PMUpdated Aug 04, 2023 | 6:14 PM
  • Published Aug 04, 2023 | 6:14 PMUpdated Aug 04, 2023 | 6:14 PM
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్‌ క్రికెటర్‌

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ అలెక్స్‌ హేల్స్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 34 ఏళ్లు హేల్స్‌ ఇంగ్లండ్‌ తరఫున దాదాపు 12 ఏళ్ల పాటు ఆడాడు. 2011లో టీమిండియాపైనే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడి.. క్రికెట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌ టీమ్‌లో కీ ప్లేయర్‌గా మారాడు. అలాగే 2022లో ఇంగ్లండ్‌ గెలిచిన టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో హేల్స్‌ సభ్యుడు. ఓపెనర్‌గా టీమ్‌ మంచి ఆరంభాలు ఇచ్చి.. రెండో సారి టీ20 వరల్డ్‌ ఛాంపియన్‌గా ఇంగ్లండ్‌ నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. హేల్స్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌ జట్టులో లేడు. గతేడాది నవంబర్‌లో అతను ఇంగ్లండ్‌ తరఫున చివరి మ్యాచ్‌ ఆడాడు.

అయితే.. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఫ్రాంచైజ్‌ క్రికెట్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు నుంచి పూర్తి స్థాయి అనుమతి తీసుకునేందుకే హేల్స్‌.. ఆటకు వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్‌ ప్రకటించిన సందర్భంగా హేల్స్‌ మాట్లాడుతూ.. ‘మూడు ఫార్మాట్లలో కలిపి 156 మ్యాచ్‌ల్లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వంగా ఉంది. రిటైర్మెంట్‌ ప్రకటించేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. కెరీర్‌లో చాలా ఎత్తు పల్లాలు చూశాను. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. ఇంగ్లండ్ కోసం ప్రపంచ కప్ గెలవడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది.’ అని హేల్స్‌ పేర్కొన్నాడు.

ఒకసారి హేల్స్‌ కెరీర్‌ను పరిశీలస్తే.. అతను ఇంగ్లండ్‌ తరఫున 11 టెస్టులు, 70 వన్డేలు, 75 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 11 టెస్టుల్లో 573 పరుగులు చేశాడు. అందులో 5 హాఫ​ సెంచరీలు ఉన్నాయి. 11 టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. ఇక 70 వన్డేల్లో 37.8 సగటుతో 2419 పరుగులు చేశాడు. అందులో 6 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20ల విషయానికి వస్తే.. 75 మ్యాచ్‌ల్లో 2074 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 12 మాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో అతని అత్యధిక స్కోర్‌ 116 కాగా, వన్డేల్లో 171గా ఉంది. ఇక ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున 2018లో 6 మ్యాచ్‌లు ఆడిన హేల్స్‌ 148 పరుగులు చేశాడు. మరి హేల్స్‌ రిటైర్మెంట్‌ ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: దుమ్ములేపిన రియాన్‌ పరాగ్‌! 65 బంతుల్లోనే భారీ ఇన్నింగ్స్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి