iDreamPost

దుమ్ములేపిన రియాన్‌ పరాగ్‌! 65 బంతుల్లోనే భారీ ఇన్నింగ్స్‌

  • Published Aug 04, 2023 | 4:44 PMUpdated Aug 04, 2023 | 4:44 PM
  • Published Aug 04, 2023 | 4:44 PMUpdated Aug 04, 2023 | 4:44 PM
దుమ్ములేపిన రియాన్‌ పరాగ్‌! 65 బంతుల్లోనే భారీ ఇన్నింగ్స్‌

ఆటతో కంటే యాటిట్యూట్‌తో బాగా ఫేమస్‌ అయిన యువ క్రికెటర్లలో రియాన్‌ పరాగ్‌ ముందు వరసలో ఉంటాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడుతూ.. తన డ్యాన్స్‌, యాటిట్యూడ్‌తో పరాగ్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. సోషల్‌ మీడియాలో బాగా ట్రోలింగ్‌కు గురయ్యేవాడు. అసలు వీడికి అవకాశాలు ఎందుకు ఇస్తున్నారా? బాబూ అంటూ అనేకమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. అతని ఓవర్‌ యాక్షన్‌, ధోని తర్వాత నేనే లాంటి భారీ భారీ స్టేట్‌మెంట్లతో క్రికెటర్ల అభిమానులకు రియాన్‌ పరాగ్‌ ఓ ఫన్నీ విలన్‌ అయిపోయాడు. నెగిటిల్‌ పబ్లిసిటీ పొందిన ఈ యువ క్రికెటర్‌ అప్పుడప్పుడూ బ్యాటింగ్‌, బౌలింగ్‌తో రాణించినా.. అతనిపై సెటైర్ల వర్షం కురిసేది.

కానీ, ఇప్పుడీ కుర్రాడు కాస్త మారినట్లు కనిపిస్తున్నాడు. నోటికి తాళం వేసి, ఆటకు పదును పెట్టాడు. ఇటీవల ఏసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ 2023లో మంచి ప్రదర్శన కనబర్చాడు. తాజాగా.. దేవ్‌దార్‌ ట్రోఫీలో ఈస్ట్‌ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ.. సూపర్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సౌత్‌ జోన్‌తో జరిగిన దేవ్‌దార్‌ ట్రోఫీ 2023 ఫైనల్‌ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. సౌత్‌జోన్‌ నిర్దేశించిన 329 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 65 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్సులతో 95 పరుగులు చేసి అదరగొట్టాడు. కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నా.. అతని ఎటాకింగ్‌ బ్యాటింగ్‌ బాగుంది. పైగా మ్యాచ్‌ గెలిపించాలనే ఇంటెన్స్‌పై క్రికెట్‌ నిపుణులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే.. పరాగ్‌ అంత అద్భుతంగా రాణించినా.. ఈస్ట్‌ జోన్‌ మ్యాచ్‌ గెలవలేకపోయింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌత్‌జోన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రోహన్ కున్నుమ్మల్ 75 బంతుల్లో 11 ఫోర్లు 4 సిక్సులతో 107 పరుగులు చేసి రాణించాడు. అలాగే జగదీశన్‌ 54 పరుగులు, కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ 63 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో సౌత్‌ జోన్‌ భారీ స్కోర్‌ చేసింది. ఈ టార్గెట్‌ ఛేదించే క్రమంలో ఈస్ట్‌ జోన్‌ టాపార్డర్‌ దారుణంగా విఫలమైంది. సుదీప్‌ కుమార్‌ 41, రియాన్‌ పరాగ్‌ 95, కుమార్‌ కుసగ్రా 68 పరుగులతో రాణించినా.. విజయం అందలేదు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం అవ్వడంతో 46.1 ఓవర్లలో 283 పరుగులకే ఈస్ట్‌ జోన్‌ ఆలౌట్‌ అయింది. సౌత్‌ జోన్‌ బౌలర్లల వాషింగ్టన్‌ సుందర్‌ 3 వికెట్లతో సత్తా చాటాడు. మరి ఈ మ్యాచ్‌లో రియాన్‌ పరాగ్‌ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: టీమిండియా ఓటమి! కన్నీళ్లు పెట్టుకున్న కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి