Somesekhar
Virat Kohli, Alex Carey: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం టీమిండియా త్వరలోనే ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఛాన్స్ ఉంటే ఆ టీమిండియా స్టార్ క్రికెటర్ ను ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకుంటానని చెప్పుకొచ్చాడు.
Virat Kohli, Alex Carey: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం టీమిండియా త్వరలోనే ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఛాన్స్ ఉంటే ఆ టీమిండియా స్టార్ క్రికెటర్ ను ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకుంటానని చెప్పుకొచ్చాడు.
Somesekhar
ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు రెస్ట్ మోడ్ లో ఉన్నారు. త్వరలోనే బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉండగా.. అక్కడి పరిస్థితుల దృష్ట్యా సిరీస్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఆ తర్వాత నవంబర్ లో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టబోతోంది భారత జట్టు. ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆలెక్స్ కేరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అవకాశం ఉంటే.. ఆ టీమిండియా స్టార్ ప్లేయర్ ను ఆస్ట్రేలియా టీమ్ లోకి తీసుకుంటాం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టనుంది. నవంబర్ 22 నుంచి ప్రారంభం అయ్యే ఈ కీలక సిరీస్ కోసం ఇరు జట్లు ఇప్పటి నుంచే ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాళ్లు, ఇతర ఆటగాళ్లు పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.”ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీ కింగ్. అతడిని మించిన ఆటగాడు లేడనే చెప్పాలి. ఒకవేళ అవకాశం లభిస్తే.. ఎవరినైనా ఆస్ట్రేలియా టీమ్ లోకి తీసుకోవాలనుకుంటే నేను విరాట్ కోహ్లీని పిక్ చేసుకుంటాను. ఎందుకంటే? అతడు ‘కింగ్'” అంటూ అలెక్స్ కేరీ ప్రశంసలు కురిపించాడు. కాగా.. క్రికెట్ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా భావించే సిరీస్ ల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఒకటి. ఈ సిరీస్ ను ఎలాగైనా గెల్చుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే రెండు టీమ్స్ మాస్టర్ ప్లాన్స్ తో రెడీ అవుతున్నాయి. మరి ఛాన్స్ ఉంటే ఆసీస్ టీమ్ లోకి కోహ్లీని తీసుకుంటాను అన్న కేరీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.
Alex Carey said, “Virat Kohli is the King. If I have to pick someone for the Australian team, I want to pick Virat”. (Amazon Prime). pic.twitter.com/RCpQKwnABF
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 28, 2024