రోహిత్, కోహ్లీ కాదు.. అతడితో పని చేయడం నా తమ్ముడి అదృష్టం: అల్బీ మోర్కెల్

Albie Morkel On Morne Morkel Coaching Appointment: భారత జట్టు నయా బౌలింగ్ కోచ్​గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్​ను నియమించిన విషయం తెలిసిందే. దీనిపై మోర్నీ సోదరుడు, వెటరన్ పేసర్ అల్బీ మోర్కెల్ రియాక్ట్ అయ్యాడు. ఆ భారత స్టార్​తో కలసి పని చేయడం తన తమ్ముడి అదృష్టమన్నాడు.

Albie Morkel On Morne Morkel Coaching Appointment: భారత జట్టు నయా బౌలింగ్ కోచ్​గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్​ను నియమించిన విషయం తెలిసిందే. దీనిపై మోర్నీ సోదరుడు, వెటరన్ పేసర్ అల్బీ మోర్కెల్ రియాక్ట్ అయ్యాడు. ఆ భారత స్టార్​తో కలసి పని చేయడం తన తమ్ముడి అదృష్టమన్నాడు.

భారత నయా బౌలింగ్​ కోచ్​గా సౌతాఫ్రికా వెటరన్ పేసర్ మోర్నీ మోర్కెల్​ను నియమించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి అతడు బాధ్యతలు చేపట్టనున్నాడు. బంగ్లాదేశ్​తో జరిగే టెస్ట్ సిరీస్ అతడికి కోచ్​గా తొలి సవాల్ కానుంది. హెడ్ కోచ్ గౌతం గంభీర్ సహాయక బృందంలోని అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డొషేట్​తో మోర్నీ కూడా చేరనున్నాడు. ఒకప్పుడు భీకర ఫాస్ట్ బౌలర్​గా వరల్డ్ క్రికెట్​ను షేక్ చేసిన మోర్కెల్ ఇప్పుడు నయా రోల్​లో ఎంతవరకు రాణిస్తాడో చూడాలి. ఐపీఎల్​లో లక్నో సూపర్ జియాంట్స్ బౌలింగ్​ కోచ్​గా సక్సెస్ అయిన మోర్కెల్.. అదే తీరులో భారత జట్టుకు సేవలు అందిస్తే అభిమానులకు అతడు ఎప్పటికీ గుర్తుండిపోతాడు. త్వరలో మోర్నీ కొత్త జర్నీ స్టార్ట్ అవనున్న నేపథ్యంలో అతడి సోదరుడు అల్బీ మోర్కెల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

టీమిండియా కోచింగ్ బృందంలో భాగమయ్యే ఛాన్స్ రావడం అరుదని.. అలాంటిది మోర్నీకి ఈ ఛాన్స్ రావడం హ్యాపీ అన్నాడు అల్బీ మోర్కెల్. అయితే ఇలాంటి రెస్పాన్సిబిలిటీని సక్రమంగా నెరవేరిస్తేనే అంతా సాఫీగా సాగుతుందన్నాడు. ఎలాంటి తప్పులకు తావివ్వకుండా విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని మోర్నీకి అల్బీ సూచించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి టాప్ క్రికెటర్స్​తో కలసి వర్క్ చేసే అవకాశం అరుదుగా దక్కుతుందన్నాడు. రోహిత్, కోహ్లీ కాదు.. జస్​ప్రీత్ బుమ్రాతో కలసి పని చేయడం మోర్నీ మోర్కెల్ అదృష్టమన్నాడు అల్బీ మోర్కెల్. ఇతర టీమ్స్​తో కంపేర్ చేస్తే టీమిండియాకు పని చేయడం ఎంతో ప్రతిష్టాత్మకమైందన్నాడు. భారత్ చాన్నాళ్లుగా సక్సెస్​ఫుల్ టీమ్​గా కొనసాగుతోందని అల్బీ మోర్కెల్ మెచ్చుకున్నాడు.

‘టీమిండియా లాంటి సక్సెస్​ఫుల్ టీమ్​కు కోచ్​గా పని చేయడం అంత ఈజీ కాదు. ఆ జట్టు చాన్నాళ్లుగా విజయాల బాటలో ప్రయాణిస్తోంది. అలాంటి టీమ్​కు వర్క్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలి. జస్​ప్రీత్ బుమ్రాతో కలసి పని చేయడం నా తమ్ముడు (మోర్నీ మోర్కెల్)కు కచ్చితంగా నచ్చుతుంది. బుమ్రా ఓ స్పెషల్ బౌలర్. భారత జట్టులో ఎంతో మంది స్టార్లు ఉన్నారు. వాళ్లు కెరీర్​లో ఎంతో సాధించారు. కాబట్టి ముందు వాళ్ల నమ్మకాన్ని చూరగొనాలి. ఆటగాళ్లు వాళ్ల టాలెంట్​కు మరింత మెరుగులద్దేలా మోర్నీ మోర్కెల్ సహకరిస్తాడని నమ్ముతున్నా. ఇంటర్నేషనల్ కెరీర్​లో మోర్నీకి ఎంతో ఎక్స్​పీరియెన్స్ ఉంది. అతడి కోచింగ్​లో భారత బౌలింగ్ విభాగం మరింత బలంగా తయారవుతుంది. తన ప్లాన్స్​ను అతడు పకబడ్బందీగా అమలు చేస్తే టీమిండియాకు ఎదురుండదు‘ అని అల్బీ మోర్కెల్ వ్యాఖ్యానించాడు.

Show comments