iDreamPost
android-app
ios-app

రోహిత్​ కెప్టెన్సీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇలా ఎవ్వరూ చేసి ఉండరు!

  • Published Feb 23, 2024 | 5:01 PM Updated Updated Feb 24, 2024 | 4:08 PM

ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన పనికి ప్రశంసలు కురుస్తున్నాయి. హిట్ మ్యాన్ చేసినట్లు ఇలా ఎవ్వరూ చేసి ఉండరూ అంటూ నెటిజన్లు పొగుడుతున్నారు. మరి ఇంతకీ రోహిత్ చేసిన పనేంటి?

ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన పనికి ప్రశంసలు కురుస్తున్నాయి. హిట్ మ్యాన్ చేసినట్లు ఇలా ఎవ్వరూ చేసి ఉండరూ అంటూ నెటిజన్లు పొగుడుతున్నారు. మరి ఇంతకీ రోహిత్ చేసిన పనేంటి?

రోహిత్​ కెప్టెన్సీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇలా ఎవ్వరూ చేసి ఉండరు!

ఇంగ్లాండ్ తో జరుగుతున్న కీలకమైన నాలుగో టెస్ట్ లో టీమిండియా బౌలర్లు రాణించారు. తొలిరోజు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడిచేయడంలో సఫలమైయ్యారు. రాంచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీకి మారుపేరుగా నిలిచాడు. అసలైన నాయకుడి లక్షణాలు ఎలా ఉంటాయో ఈ మ్యాచ్ లో చూపించాడు. లంచ్ టైమ్ లో విరామానికి దిగుతున్న సమయంలో రోహిత్ చేసిన పనికి అంతా ఫిదా అయ్యారు. మరి ఇంతకీ హిట్ మ్యాన్ చేసిన ఆ పనేంటో ఇప్పుడు చూద్దాం.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు ఊహించని షాకిచ్చాడు డెబ్యూ బౌలర్ ఆకాశ్ దీప్. ఆడుతుంది తొలి మ్యాచ్, పైగా బజ్ బాల్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్న ఇంగ్లండ్ టీమ్ పై. దీంతో సహజంగానే కొత్త బౌలర్ కు కాస్త బెరుకు ఉండటం సహజం. కానీ అవేవీ తనకు లేవంటూ రెచ్చిపోయాడు అరంగేట్ర బౌలర్ ఆకాశ్ దీప్. ఇంగ్లీష్ టీమ్ టాప్ ఆర్డర్ ను తక్కువ పరుగులకే కుప్పకూల్చి శాభాష్ అనిపించుకున్నాడు. బెన్ డకెట్(11), ఓలీ పోప్(0), జాక్ క్రాలే(42) లాంటి స్టార్ బ్యాటర్లను పెవిలియన్ కు పంపి టీమిండియాకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు ఈ 27 ఏళ్ల బౌలర్. ఇక అతడికి అంతే గౌరవం ఇచ్చి కెప్టెన్ గా మరో మెట్టుపైకెక్కాడు రోహిత్ శర్మ. అసలేం జరిగిందంటే?

ఇంగ్లండ్ లంచ్ టైమ్ కు కీలక వికెట్లను కోల్పోయింది. అందులో ముఖ్య పాత్ర పోషించాడు అరంగేట్ర బౌలర్ ఆకాశ్ దీప్. దీంతో లంచ్ టైమ్ లో గ్రౌండ్ నుంచి బయటకి వెళ్లేటప్పుడు రోహిత్ వెనక్కి జరిగి.. ఆకాశ్ దీప్ ను ముందుకు రమ్మని అతడి వెనకాల టీమిండియా ఆటగాళ్లు అంతా నడిచారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ గా మారడంతో.. రోహిత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. సాధారణంగా లంచ్ టైమ్ లో గానీ, ఆటముగిసిన తర్వాత గానీ.. డ్రస్సింగ్ రూమ్ కు వెళ్లేటప్పుడు ముందు కెప్టెన్, ఆ తర్వాత అతడి వెనక ప్లేయర్లు నడుస్తారు. కానీ ఇందుకు భిన్నంగా అద్భుతంగా బౌలింగ్ చేసిన డెబ్యూ ప్లేయర్ కు గౌరవం ఇచ్చి తన నాయకత్వ లక్షణాన్ని చాటుకున్నాడు హిట్ మ్యాన్. మరి రోహిత్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: టీమిండియాలో కొత్త సెంటిమెంట్.. వాళ్లొస్తే ఇరగదీయడం పక్కా!