iDreamPost
android-app
ios-app

Aakash Chopra: ఆ ఇద్దరు టీ20 క్రికెట్ ను ఏలుతారు.. యువ బ్యాటర్లపై దిగ్గజ క్రికెటర్ కామెంట్స్!

  • Published Jan 08, 2024 | 1:17 PM Updated Updated Jan 09, 2024 | 11:45 AM

టీమిండియాకు చెందిన ఓ ఇద్దరు యువ ప్లేయర్లపై భారత దిగ్గజ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. వారిద్దరు టీ20 క్రికెట్ ను ఏలుతారని చెప్పుకొచ్చాడు.

టీమిండియాకు చెందిన ఓ ఇద్దరు యువ ప్లేయర్లపై భారత దిగ్గజ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. వారిద్దరు టీ20 క్రికెట్ ను ఏలుతారని చెప్పుకొచ్చాడు.

Aakash Chopra: ఆ ఇద్దరు టీ20 క్రికెట్ ను ఏలుతారు.. యువ బ్యాటర్లపై దిగ్గజ క్రికెటర్ కామెంట్స్!

ప్రస్తుతం టీమిండియాలోకి ఎంతో మంది టాలెంటెడ్ ప్లేయర్లు దూసుకొస్తున్నారు. అద్భుతమైన ఆటతీరుతో జట్టులో తమ స్థానాన్ని సుస్థిర పరుచుకుంటూ.. ముందుకు సాగుతున్నారు. అదీకాక వచ్చే టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు ఇప్పటికే ప్రయోగాల బాటపట్టింది. అందులో భాగంగా యంగ్ ప్లేయర్ల సత్తాకు పరీక్షపెడుతోంది బీసీసీఐ. ఇక తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దుమ్మురేపుతున్నారు యువ ఆటగాళ్లు. ఈ క్రమంలోనే ఓ ఇద్దరు యువ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ లెజెండ్ ఆకాశ్ చోప్రా. ఆ యువ ప్లేయర్లు టీ20 ఫార్మాట్ కు కరెక్ట్ గా సరిపోతారని, పొట్టి ఫార్మాట్ ను ఏలుతారని చెప్పుకొచ్చాడు. మరి ఆ ప్లేయర్లు ఎవరు? ఇప్పుడు చూద్దాం.

టీమిండియాలోకి ఉడుకురక్తం ఉరకలేస్తూ వస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్లు సత్తా చాటుతూ.. సెలెక్టర్లకు పరీక్ష పెడుతున్నారు. దాదాపు యువ ఆటగాళ్లు అందరూ అద్భుతంగా రాణిస్తుండటంతో.. ఎవరిని జట్టులోకి తీసుకోవాలన్న అయోమయం సెలక్టర్లలో నెలకొంది. ఇక తాజాగా ఆఫ్గానిస్తాన్ తో జరిగే మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ కు జట్టును ప్రకటించింది టీమిండియా. టీ20 వరల్డ్ కప్ 2024ను దృష్టిలో పెట్టుకునే యంగ్ ప్లేయర్లతో జట్టును నింపింది. ఈ క్రమంలోనే జట్టులో చోటు దక్కించుకున్న ఓ ఇద్దరి ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు భారత దిగ్గజం ఆకాశ్ చోప్రా.

aakash chopra comments

“టీ20 ఫార్మాట్ కు సరిగ్గా సరిపోయే కటౌట్స్ యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్. వీరిద్దరూ టీ20 క్రికెట్ ను ఏలుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. వీరు అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాలో ఎక్కువ కాలం కొనసాగుతారు” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఈ దిగ్గజ క్రికెటర్. కాగా.. గత కొంతకాలంగా జైస్వాల్, రింకూ సింగ్ పొట్టి ఫార్మాట్ లో అదరగొడుతున్నారు. వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో సంచలన బ్యాటింగ్ తో మెరిశాడు యశస్వీ. ఇక రింకూ సింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఫినిషర్ గా ఇండియన్ టీమ్ లో తనకంటూ స్పెషల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. మరి ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.