టీమిండియా దిగ్గజ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఓ యంగ్ ప్లేయర్ పై ప్రశంసలు కురిపించాడు. తాజాగా జరిగే టీ20 సిరీస్ లో అతడు చెలరేగితే ఆపడం ఆసీస్ తరం కాదని హాట్ కామెంట్స్ చేశాడు. మరి ఆ చిచ్చర పిడుగు ఎవరు? ఆ వివరాలు..
టీమిండియా దిగ్గజ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఓ యంగ్ ప్లేయర్ పై ప్రశంసలు కురిపించాడు. తాజాగా జరిగే టీ20 సిరీస్ లో అతడు చెలరేగితే ఆపడం ఆసీస్ తరం కాదని హాట్ కామెంట్స్ చేశాడు. మరి ఆ చిచ్చర పిడుగు ఎవరు? ఆ వివరాలు..
వరల్డ్ కప్ ఓటమి బాధ నుంచి టీమిండియా పూర్తిగా కోలుకోలేదు. ఇలాంటి సమయంలోనే మరో టోర్నీకి సిద్దమైంది. ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ను ఓడించి టైటిల్ ను ఎగరేసుకుపోయిన ఆస్ట్రేలియాతో 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది భారత్. అందులో భాగంగా తొలి మ్యాచ్ నవంబర్ 23(గురువారం) జరగనుంది. విశాఖపట్నం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం యువకులతో కూడిన టీమిండియా రెడీ అయ్యింది. సెలక్టర్లు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి.. యంగ్ ప్లేయర్లను పరీక్షిస్తున్నారు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో యువ ప్లేయర్ల సత్తాకు పరీక్ష పెడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఓ యంగ్ ప్లేయర్ పై ప్రశంసలు కురిపించాడు. అతడు చెలరేగితే ఆపడం ఆసీస్ తరం కాదని హాట్ కామెంట్స్ చేశాడు. మరి టీమిండియా లెజెండ్ క్రికెటర్ చెప్పిన ఆ చిచ్చర పిడుగు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆస్ట్రేలియాతో జరిగే 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం యువ టీమిండియా సిద్దమైంది. ఈ టోర్నీలో భాగంగా నవంబర్ 23న జరిగే తొలి పోరుకు సర్వం సిద్ధమైంది. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన సెలక్టర్లు.. యువ ప్లేయర్లకు అవకాశం ఇచ్చారు. వారి సత్తాను పరీక్షించి.. రాబోయే టీ20 వరల్డ్ కప్ కు సంసిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా చిచ్చర పిడుగుపై ప్రశంసల వర్షం కురిపించాడు భారత మాజీ దిగ్గజ బ్యాటర్ ఆకాశ్ చోప్రా. ఈ సిరీస్ లో ఆసీస్ ను కంగారు పెట్టేది రింకూ సింగ్ అని చెప్పుకొచ్చాడు ఆకాశ్ చోప్రా. ఈ సిరీస్ లో రింకూ సింగ్, తిలక్ వర్మ కీలక ఆటగాళ్లు. ఇక రింకూకు ఇది పెద్ద సిరీస్ అని, ఈ సిరీస్ లో అతడు సత్తా చాటితే.. అతడిని ఆపడం ఆసీస్ తరం కాదని సంచలన కామెంట్స్ చేశాడు చేశాడు ఆకాశ్ చోప్రా.
ఇప్పటి వరకు అతడు ఆడిన తక్కువ మ్యాచ్ ల్లోనే బెస్ట్ ఫినిషర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రింకూ తన తుపాన్ బ్యాటింగ్ తో ఐపీఎల్ 2023లో హాట్ టాపిక్ గా మారాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో చివరి ఓవర్ లో 5 బంతుల్లో 5 సిక్స్ లు కొట్టి తన జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు రింకూ సింగ్. అదీకాక విండీస్ తో జరిగిన టీ20 సిరీస్ లో అవకాశం వచ్చినప్పుడల్లా తనలో ఉన్న ఫినిషర్ ను బయటకి తీశాడు. దీంతో ఈ సిరీస్ లో అందరిచూపు రింకూపైనే ఉందని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. మరి టీమిండియా మాజీ లెజెండ్ చెప్పినట్లుగా రింకూ సింగ్ చెలరేగితే ఆపడం ఆసీస్ కు కష్టం అవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.