iDreamPost

Aiden Markram: వీడియో: జాంటీ రోడ్స్ కూడా ఇలా పట్టడేమో? మార్క్రమ్ మైండ్ బ్లోయింగ్ క్యాచ్!

సౌతాఫ్రికా టీ20 లీగ్ లో మైండ్ బ్లోయింగ్ క్యాచ్ నమోదు అయ్యింది. జాంటీ రోడ్స్ ను మరపించేలా ఈ క్యాచ్ ను అందుకున్నాడు ఐడెన్ మార్క్రమ్.

సౌతాఫ్రికా టీ20 లీగ్ లో మైండ్ బ్లోయింగ్ క్యాచ్ నమోదు అయ్యింది. జాంటీ రోడ్స్ ను మరపించేలా ఈ క్యాచ్ ను అందుకున్నాడు ఐడెన్ మార్క్రమ్.

Aiden Markram: వీడియో: జాంటీ రోడ్స్ కూడా ఇలా పట్టడేమో? మార్క్రమ్ మైండ్ బ్లోయింగ్ క్యాచ్!

కళ్లు చెదిరే క్యాచ్ లు.. ఒళ్లు గగుర్పొడిచే ఫీల్డింగ్ విన్యాసాలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు ‘జాంటీ రోడ్స్’. ప్రపంచ క్రికెట్ లో ఫీల్డింగ్ దిగ్గజంగా పేరుగాంచాడు ఈ సౌతాఫ్రికా మాజీ ప్లేయర్. తనకే సాధ్యమైన విన్యాసాలతో బ్యాటర్లను పెవిలియన్ కు పంపేవాడు రోడ్స్. అయితే కాల క్రమంలో రోడ్స్ ను మించిన ఫీల్డింగ్ తో అదరగొడుతున్నారు నేటితరం క్రికెటర్లు. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్ లో మైండ్ బ్లోయింగ్ క్యాచ్ నమోదు అయ్యింది. సన్ రైజర్స్ ఈస్టర్న్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ఈ క్యాచ్ ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ ఫైనల్ కు చేరుకుంది. తాజాగా డర్బన్ సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఫైనల్ కు చేరి టైటిల్ రేసులో దూసుకెళ్తోంది. ఇక ఈ మ్యాచ్ లో ఓ కళ్లు చెదిరే.. ఒళ్లు గగుర్పొడిచే క్యాచ్ ను అందుకున్నాడు సన్ రైజర్స్ సారథి ఐడెన్ మార్క్రమ్. నమ్మశక్యం కానీ రీతిలో మార్ర్కమ్ అందుకున్న ఈ క్యాచ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డర్బన్ సూపర్ జెయింట్స్ బ్యాటర్ జేజే స్మట్స్ కొట్టిన బంతి స్ట్రైట్ గా వెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మార్క్రమ్ దాన్ని అమాంతం గాల్లోకి ఎగిరి, ఒంటి చేత్తో పట్టుకున్న తీరు అద్భుతం.. ఆశ్చర్యం. అసలు ఆ క్యాచ్ పట్టుకుంటాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ జాంటీ రోడ్స్ ను మరపించేలా మైండ్ బ్లోయింగ్ క్యాచ్ ను అందుకుని అందరిని షాక్ కు గురిచేశాడు.

markram superb catch

ఇక ఈ క్యాచ్ వీడియోను చూసిన నెటిజన్లు మార్క్రమ్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. నువ్వు పక్షివా? విమానానివా? అలా ఎలా పట్టావ్ సామీ క్యాచ్.. ఇట్స్ అన్ బిలివబుల్ అంటూ రాసుకొచ్చారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. జట్టులో డేవిడ్ మలన్ 63 పరుగులతో రాణించాడు. అనంతరం 158 పరుగుల మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ జెయింట్స్ టీమ్ 106 పరుగులకే కుప్పకూలింది. మార్కో జాన్సన్, బార్ట్ మన్ చెరి నాలుగు వికెట్లు తీశారు. దీంతో 51 పరుగుల తేడాతో విజయం సాధించి లీగ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది సన్ రైజర్స్ టీమ్. మరి మైండ్ బ్లోయింగ్ క్యాచ్ అందుకున్న మార్ర్కమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Yuvraj Singh: రవిశాస్త్రికి యువరాజ్ కౌంటర్.. గిల్ ఇలాగే సమాధానం ఇస్తాడంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి