iDreamPost
android-app
ios-app

మార్క​రమ్ మార్వలెస్ సెంచరీ.. ప్రత్యర్థైనా మెచ్చుకోవాల్సిన ఇన్నింగ్స్!

Aiden Markaram Century: రెండో టెస్టులో టీమిండియా బౌలింగ్ లో మెరుపులు మెరిపించినా.. బ్యాటింగ్ లో మాత్రం చేతులు ఎత్తేసింది. మార్కరమ్ మాత్రం అద్భుత శతకంతో చెలరేగాడు.

Aiden Markaram Century: రెండో టెస్టులో టీమిండియా బౌలింగ్ లో మెరుపులు మెరిపించినా.. బ్యాటింగ్ లో మాత్రం చేతులు ఎత్తేసింది. మార్కరమ్ మాత్రం అద్భుత శతకంతో చెలరేగాడు.

మార్క​రమ్ మార్వలెస్ సెంచరీ.. ప్రత్యర్థైనా మెచ్చుకోవాల్సిన ఇన్నింగ్స్!

టీమిండియా టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాలో భాగంగా కేప్ టౌన్ వేదికగా రెండో టెస్టులో ఇరు జట్లు తలపడుతున్నాయి. రెండో టెస్టులో చాలానే అద్భుతాలు జరిగాయని చెప్పాలి. బౌలింగ్ ఇరగదీసిన భారత్.. బ్యాటింగ్ లో మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఒక్క పరుగు కూడా చేయకుండా ఆరుగురు బ్యాటర్లు పెవిలియన్ చేరారంటే అది ఎంత పరాభవమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియాలో టెయిలెండర్స్ బ్యాటింగ్ ఎంత వీక్ అనేది మరోసారి రుజువైంది. అయితే ఈసారి మిడిలార్డర్ కూడా చేతులెత్తేయడంతో కేవలం 153 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇన్నింగ్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాని ఓడించాలనుకున్నద్ సాధ్యం కాలేదు. ఇలాంటి తరుణంలో మార్కరమ్ పోరాటంపై టీమిండియా ఫ్యాన్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి 55 పరుగలకే సౌత్ ఆఫ్రికాని ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన టీమిండియా ఘోరాతి ఘోరంగా విఫలమైంది. మొదట మెచ్చుకున్న అభిమానులే బ్యాటింగ్ చూసిన తర్వాత పెదవి విరిచారు. మరీ ఇంత దారుణంగా బ్యాటింగ్ ఎలా చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 153 పరుగులే చేశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన సౌత్ ఆఫ్రికా ఈసారి గట్టిగానే పోరాడింది. అయితే సౌత్ ఆఫ్రికా టీమ్ పోరాడింది అనే కంటే కూడా మార్కరమ్ జట్టును ముందుకు నడిపించాడు అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే జట్టు స్కోర్ 176 పరుగులు అయితే అందులో 106 పరుగులు ఒక్క మార్కర్ మాత్రమే చేశాడు.

ఇలాంటి ఒక పిచ్ మీద మార్కరమ్ పోరాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవతలి ఎండ్ లో వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు పెవిలియన్ చేరుతుంటే.. ఒక్క మార్కమ్ మాత్రమే ఆఖరి వరకు పోరాడాడు. కేవలం పోరాడటం మాత్రమే కాకుండా శతకంతో చెలరేగాడు. బుమ్రా వేసే బంతులను ఎదుర్కోవడానికి మిగిలిన వాళ్లు నానా తంటాలు పడుతుంటే.. మార్కరమ్ మాత్రం బౌండిరీలు కొట్టేస్తున్నాడు. తొలిరోజే 23 వికెట్లు పడిన అలాంటి పిచ్ మీద మార్కరమ్ ఆట తీరుకు అంతా ఫిదా అయిపోతున్నారు. నిజంగా మార్కరమ్ ఆడిన ఈ ఇన్నింగ్స్ కచ్చితంగా చాలా స్పెషల్ అనే చెప్పాలి. అలాగే అతని ఆటపై టీమిండియా అభిమానులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అతను ఎంతో స్పెషల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ్యాచ్ విషయానకి వస్తే.. రెండో ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా 176 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మార్కరమ్(106) మినహా మిగిలిన వాళ్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. బెండింగామ్(11), జాన్సన్(11) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. ఇంక టీమిండియా బౌలిగ్ విషయానికి వస్తే.. జాస్ప్రిత్ బుమ్రా తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లు తీసుకోగా.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 6 వికెట్లతో విజృంభించాడు. ముఖేష్ కుమార్ రెండో ఇన్నింగ్స్ లో కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో దుమ్ములేపిన సిరాజ్ మాత్రం 1 వికెట్ తో సరిపెట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో ప్రసిద్ కృష్ణకు కూడా ఒక వికెట్ దక్కింది. టీమిండియా 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మరి.. మార్కరమ్ సెంచరీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.