iDreamPost
android-app
ios-app

Virat Kohli: ఈ ప్రపంచానికి ఒక్కడే కోహ్లీ! దయచేసి అవి ఆపేయండి: పాక్‌ క్రికెటర్‌

  • Published Jan 08, 2024 | 8:26 PM Updated Updated Jan 08, 2024 | 8:26 PM

ప్రపంచ క్రికెట్‌లో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ తర్వాత అంతటోడు ఎవడైనా ఉన్నాడంటే.. అది విరాట్‌ కోహ్లీనే. ఇన్‌ఫ్యాక్ట్‌ కొన్ని విషయాల్లో సచిన్‌ను సైతం మించిపోయాడు కోహ్లీ. అలాంటి ఆటగాడి గురించి ఓ పాకిస్థాన్‌ ప్లేయర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచ క్రికెట్‌లో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ తర్వాత అంతటోడు ఎవడైనా ఉన్నాడంటే.. అది విరాట్‌ కోహ్లీనే. ఇన్‌ఫ్యాక్ట్‌ కొన్ని విషయాల్లో సచిన్‌ను సైతం మించిపోయాడు కోహ్లీ. అలాంటి ఆటగాడి గురించి ఓ పాకిస్థాన్‌ ప్లేయర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 08, 2024 | 8:26 PMUpdated Jan 08, 2024 | 8:26 PM
Virat Kohli: ఈ ప్రపంచానికి ఒక్కడే కోహ్లీ! దయచేసి అవి ఆపేయండి: పాక్‌ క్రికెటర్‌

సాధారణంగా ఇండియన్‌ క్రికెటర్లపై అర్థంలేని వ్యాఖ్యలు, విమర్శలు, సెటైర్లు వేస్తుంటారు పాకిస్థాన్‌ క్రికెటర్లు. ఏదో ఒక విషయంలో భారత క్రికెటర్లపై బురదచల్లే పని పెట్టుకుంటారు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023 టోర్నీలో ఇండియన్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ ఎంతో అద్భుతంగా రాణించాడు. షమీ రాణింపును జీర్ణించుకోలేని కొంతమంది పాక్‌ మాజీలు.. అతనికి వేరే బాల్‌ ఇస్తున్నారంటూ అర్థంలేని వ్యాఖ్యలు చేసి నవ్వుల పాలయ్యారు. అలాగే టీమిండియాలోని గొప్ప ఆటగాళ్లను పాకిస్థాన్‌ టీమ్‌లోని బచ్చా క్రికెటర్లతో కంప్యార్‌ చేస్తూ.. నానా యాగి చేస్తుంటారు. కానీ, ఆశ్చర్యకరంగా ఓ పాకిస్థాన్‌ క్రికెటర్‌ తాజాగా కోహ్లీ విషయంలో ఎంతో పాజిటివ్‌గా స్పందించాడు. అతను చేసిన కామెంట్‌ కొంతమంది పాక్‌ మాజీలకు గూబగుయ్‌ మనిపించేలా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఎంత గొప్ప ప్లేయరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ క్రికెట్‌లో మోడ్రన్‌ గ్రేట్‌గా ఉన్నాడు. క్రికెట్‌ చరిత్రలోనే కనీవిని ఎరుగని ఎన్నో రికార్డులను నెలకొల్పుతూ.. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ నెలకొల్పిన మరెన్నో రికార్డులను బ్రేక్‌ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే వన్డే క్రికెట్‌ చరిత్రలో మరే క్రికెటర్‌కు సాధ్యంకాని విధంగా ఏకంగా 50 సెంచరీలు సాధించాడు. వన్డేల్లో 50 సెంచరీలో మార్క్‌ అందుకున్న మొట్టమొదటి క్రికెటర్‌ కోహ్లీనే. అలాంటి ఆటగాడిని కొంతమంది పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్లు, పాక్‌ అభిమానులు వేరే ఆటగాళ్లతో పోల్చుతుంటారు. వాటిపై స్పందించిన పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ అహ్మద్ షాజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

kohli is the one plz dont do like that

విరాట్‌ కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడిని వేరే వాళ్లతో పోల్చడం ఆపేయాలని, ఈ ప్రపంచానికి ఒక్కడే కోహ్లీ అని, అతని స్టాట్స్‌, అతను సాధించిన రికార్డులే అందుకు నిదర్శనంగా నిలుస్తాయని పేర్కొన్నాడు. ప్రపంచంలో కోహ్లీతో పోల్చే ఆటగాడు ఎవరూ లేరని అన్నాడు. ఒక పాకిస్థాన్‌ క్రికెటర్‌ కోహ్లీ గురించి ఇంత పాజిటివ్‌గా మాట్లాడటంతో ప్రస్తుతం అతని కామెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. కోహ్లీని చాలా మంది పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌తో పోల్చుతుంటారన్న విషయం తెలిసిందే. కానీ, కోహ్లీకి, బాబర్‌కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందనే విషయం అనేక సందర్భాల్లో నిరూపితమైంది. మరి కోహ్లీ గురించి అహ్మద్ షాజాద్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.