iDreamPost

SA vs AFG: ఆఫ్గాన్ చెత్త రికార్డు.. ఎలా ఆడే జట్టు, ఇలా అయిపోయిందేంటి?

టీ20 వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణిస్తున్న ఆఫ్గాన్.. సౌతాఫ్రికాతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆఫ్గానిస్తాన్ ఓ చెత్త రికర్డ్ ను నమోదు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణిస్తున్న ఆఫ్గాన్.. సౌతాఫ్రికాతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆఫ్గానిస్తాన్ ఓ చెత్త రికర్డ్ ను నమోదు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

SA vs AFG: ఆఫ్గాన్ చెత్త రికార్డు.. ఎలా ఆడే జట్టు, ఇలా అయిపోయిందేంటి?

టీ20 వరల్డ్ కప్ లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. సెమీస్ కు దూసుకొచ్చింది ఆఫ్గానిస్తాన్. టోర్నీ ఆరంభం నుంచి నిలకడగా రాణించిన ఆ టీమ్.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్లను ఓడించి.. ఔరా అనిపించింది. ఇక సెమీ ఫైనల్లో ఈ టోర్నీలో ఒక్క ఓటమి ఎరగని సౌతాఫ్రికాతో ఢీ కొంటోంది. ఈ మ్యాచ్ లో సఫారీ బౌలర్ల ధాటికి ఆఫ్గానిస్తాన్ కుప్పకూలింది. కేవలం 56 పరుగులకే ఆలౌట్ అయ్యి.. ఓ చెత్త రికార్డును తనపేరిట లిఖించుకుంది. దాంతో ఎలా ఆడే జట్టు.. ఇలా అయిపోయిందేంటి? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆఫ్గానిస్తాన్ తడబడింది. టోర్నీ స్టార్టింగ్ నుంచి మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆ టీమ్.. కీలక మ్యాచ్ లో సఫారీ బౌలర్లను ఎదుర్కొనలేక కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆఫ్గాన్ ను ప్రోటీస్ బౌలర్లు మార్కో జాన్సన్(3), నోర్ట్జే(2) లు దెబ్బ తీశారు. చివర్లో తంబ్రైజ్ షంషీ(3) వరుసగా వికెట్లు పడగొట్టాడు. దాంతో కేవలం 11.5 ఓవర్లలో 56 రన్స్ కే కుప్పకూలింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో 10 పరుగులు చేసిన ఒమర్జాయ్ టాప్ స్కోరర్ గా నిలిచాడంటేనే అర్ధం చేసుకోవచ్చు సఫారీ బౌలర్లు ఏ రేంజ్ లో చెలరేగారో.

ఇక ఈ మ్యాచ్ లో 56 రన్స్ కే కుప్పకూలడం ద్వారా ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది ఆఫ్గానిస్తాన్. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఓ సెమీ ఫైనల్ మ్యాచ్ లో అతి తక్కువ పరుగులు చేసిన టీమ్ గా వరస్ట్ రికార్డును నమోదు చేసింది. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో ఆఫ్గాన్ ఇదే అత్యల్ప స్కోర్ కూడా. ఇంతకు ముందు ఆ టీమ్ 2014లో బంగ్లాదేశ్ పై 72 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కాగా.. టీ20 వరల్డ్ కప్ లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా ఇంగ్లండ్ తొలి ప్లేస్ లో ఉంది. ఆ జట్టు విండీస్ పై 55 పరుగులకే కుప్పకూలింది. మరి ఈ వరల్డ్ కప్ లో అంచనాలకు మించి రాణించిన ఆఫ్గాన్ కీలక మ్యాచ్ లో ఇలా తక్కువ పరుగులకే ఆలౌట్ కావడంపై క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి