iDreamPost

సెమీస్​కు చేరిన ఆఫ్ఘానిస్థాన్.. రోహిత్​పై రషీద్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Jun 25, 2024 | 4:34 PMUpdated Jun 25, 2024 | 4:34 PM

ఆఫ్ఘానిస్థాన్ జట్టు కల నెరవేర్చుకుంది. వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ దాటితే చాలనుకునే దశ నుంచి ఏకంగా సెమీస్​కు క్వాలిఫై అయింది. ఆస్ట్రేలియాను ఓడించి అందర్నీ ఆశ్చర్యపర్చిన రషీద్ సేన.. తాజాగా బంగ్లాదేశ్​ను చిత్తు చేసి సగర్వంగా నాకౌట్ గడప తొక్కింది.

ఆఫ్ఘానిస్థాన్ జట్టు కల నెరవేర్చుకుంది. వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ దాటితే చాలనుకునే దశ నుంచి ఏకంగా సెమీస్​కు క్వాలిఫై అయింది. ఆస్ట్రేలియాను ఓడించి అందర్నీ ఆశ్చర్యపర్చిన రషీద్ సేన.. తాజాగా బంగ్లాదేశ్​ను చిత్తు చేసి సగర్వంగా నాకౌట్ గడప తొక్కింది.

  • Published Jun 25, 2024 | 4:34 PMUpdated Jun 25, 2024 | 4:34 PM
సెమీస్​కు చేరిన ఆఫ్ఘానిస్థాన్.. రోహిత్​పై రషీద్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఆఫ్ఘానిస్థాన్ జట్టు కల నెరవేర్చుకుంది. వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ దాటితే చాలనుకునే దశ నుంచి ఏకంగా సెమీస్​కు క్వాలిఫై అయింది. సూపర్-8లో భాగంగా తొలుత ఆస్ట్రేలియాను ఓడించి అందర్నీ ఆశ్చర్యపర్చిన రషీద్ సేన.. తాజాగా బంగ్లాదేశ్​ను చిత్తు చేసి సగర్వంగా నాకౌట్ గడప తొక్కింది. బంగ్లాతో మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసి 115 పరుగులు చేసింది ఆఫ్ఘాన్. ఈ టార్గెట్​ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు.. 105 పరుగులకే పరిమితమై ఇంటిదారి పట్టింది. ఏ దశలోనూ ఆ జట్టు విజయం దిశగా సాగుతున్నట్లు అనిపించలేదు. అయితే లిటన్ దాస్ (54 నాటౌట్) పోరాటంతో మ్యాచ్ ఆఫ్ఘాన్ చేజారినట్లు కనిపించింది. కానీ ఆ టీమ్ ఆటగాళ్లు ఆఖరి వరకు పోరాడి సంచలన విజయం సాధించారు.

ఆఫ్ఘాన్ విజయంతో కాబూల్ నుంచి కాందహార్ లక్షలాది మంది ప్రజలు సంతోషంలో మునిగిపోయారు. నిత్యం ఆకలి, అణచివేత, పేదరికంతో బాధపడే ఆఫ్ఘాన్ ప్రజలు.. జట్టు సెమీస్​కు చేరడంతో ఆనందంతో కేరింతలు కొట్టారు. ఎన్నో బాధల మధ్య ఈ గెలుపు వారికో వెలుగుజ్యోతిలా మారింది. సెన్సేషనల్ పెర్ఫార్మెన్స్​తో ఆసీస్​, బంగ్లాను ఇంటికి పంపి, సెమీస్​కు చేరిన రషీద్ సేనను అందరూ మెచ్చుకుంటున్నారు. ఇదీ క్రికెట్ అంటే.. ఇలా ఆడాలి అంటూ ఆ టీమ్​ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ తరుణంలో ఆఫ్ఘాన్ కెప్టెన్ రషీద్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. భారత సారథి రోహిత్ శర్మను ఉద్దేశిస్తూ అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై నుంచి వచ్చిన నా స్నేహితుడు అంటూ హిట్​మ్యాన్​కు అతడు కృతజ్ఞతలు తెలిపాడు.

సూపర్-8 రెండో మ్యాచ్​లో ఆసీస్​ను ఓడించింది ఆఫ్ఘాన్. అయితే ఆ టీమ్ సెమీస్ ఆశలు భారత్ మీద ఆధారపడ్డాయి. కంగారూలను రోహిత్ సేన ఓడిస్తే వారితో పాటు సెమీస్ వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. దీంతో భారత్ గెలుపు కోసం ఆఫ్ఘాన్లు పూజలు చేశారు. అది ఫలించి ఆసీస్​ను మెన్ ఇన్ బ్లూ ఓడించడం, అటు బంగ్లాదేశ్​ను ఆఫ్ఘాన్ చిత్తు చేయడం జరిగాయి. ఈ రెండు టీమ్స్ నాకౌట్​కు క్వాలిఫై అయ్యాయి. దీంతో ఆసీస్​ను ఓడించి తమ సెమీస్ అవకాశాలు కాపాడిన భారత్​కు రషీద్ ఖాన్ థ్యాంక్స్ చెప్పాడు. బాంబే నుంచి వచ్చాడు నా దోస్త్ అంటూ హిట్​మ్యాన్​ను పొగిడాడు. అతడితో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. సెమీఫైనల్స్​కు క్వాలిఫై అయ్యామంటూ తన సంతోషాన్ని ఫ్యాన్స్​తో పంచుకున్నాడు. రోహిత్​తో తనకు ఉన్న అనుబంధం, టీమిండియా చేసిన సాయాన్ని గుర్తుచేస్తూ రషీద్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. ఈ రెండు జట్లు ఫైనల్స్​లో తలపడితే చూడాలని ఉందంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rashid Khan (@rashid.khan19)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి