Nidhan
Ihsanullah Janat: ఫిక్సింగ్ అనే పదం వింటేనే క్రికెట్ లవర్స్ భయపడతారు. అంతగా ఈ ఆటపై అది ప్రభావం చూపింది. ఈ ఊబిలో పడి చాలా మంది క్రికెటర్లు తమ కెరీర్‌ను నాశనం చేసుకున్నారు.
Ihsanullah Janat: ఫిక్సింగ్ అనే పదం వింటేనే క్రికెట్ లవర్స్ భయపడతారు. అంతగా ఈ ఆటపై అది ప్రభావం చూపింది. ఈ ఊబిలో పడి చాలా మంది క్రికెటర్లు తమ కెరీర్‌ను నాశనం చేసుకున్నారు.
Nidhan
ఫిక్సింగ్.. ఈ పదం వింటేనే క్రికెట్ లవర్స్ భయపడతారు. అంతగా ఈ ఆటపై అది ప్రభావం చూపింది. ఈ ఊబిలో పడి చాలా మంది క్రికెటర్లు తమ కెరీర్‌ను నాశనం చేసుకున్నారు. లెజెండ్స్ స్థాయికి చేరాల్సిన కొందరు ఆటగాళ్లు కాస్తా ఫిక్సింగ్ వల్ల ద్రోహులుగా మిగిలిపోయారు. స్టార్లుగా గేమ్‌ను ముందుకు నడపాల్సిన యంగ్ ప్లేయర్లు దీని మాయలో పడి క్రికెట్‌కు దూరమైపోయారు. డబ్బుల వ్యామోహంలో పడి ఫిక్సింగ్‌కు పాల్పడి అభిమానుల ముందు దోషులుగా నిలబడ్డారు. ఆ దేశం, ఈ దేశం అని ఏమీ లేదు.. చాలా కంట్రీస్ ప్లేయర్లు దీని బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఇప్పుడు మరో క్రికెటర్ ఈ లిస్ట్‌లో చేరాడు.
ఆఫ్ఘానిస్థాన్ టాపార్డర్ బ్యాటర్ ఇసానుల్లా జనత్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అతడ్ని ఏకంగా 5 ఏళ్ల పాటు బ్యాన్ చేసింది. అన్ని రకాల క్రికెటింగ్ యాక్టివిటీస్ నుంచి అతడ్ని దూరం పెడుతున్నట్లు ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తెలిపింది. తాను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డానని ఏసీబీతో పాటు ఐసీసీ అవినీతి నిరోధక అధికారుల ముందు అతడు ఒప్పుకున్నాడు. కాబుల్ ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) సీజన్ 2 టైమ్‌లో ఫిక్సింగ్ జరిగిందని ఏసీబీ విచారణలో అతడు అంగీకరించాడు. దీంతో ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ ఆర్టికల్ 2.1.1 కింద జనత్‌పై నిషేధం విధించామని ఆఫ్ఘాన్ బోర్డు అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
ఆఫ్ఘాన్ క్రికెట్‌కు సంబంధించిన అన్ని వ్యవహారాల నుంచి జనత్‌ను దూరం పెడుతున్నామని.. ఐదేళ్ల పాటు అతడిపై నిషేధం అమల్లో ఉంటుందని ఏసీబీ పేర్కొంది. ఇంటర్నేషనల్ సిరీస్‌లతో పాటు దేశీయంగా నిర్వహించే కాబుల్ ప్రీమియర్ లీగ్ ద్వారా సొంత ఆదాయాన్ని పెంచుకోవడం, అలాగే దేశంలోని యంగ్‌స్టర్స్‌కు మరిన్ని అవకాశాలు దక్కేలా చేయాలని అనుకుంటున్న ఆఫ్ఘాన్ బోర్డుకు ఈ ఫిక్సింగ్ ఉదంతం పెద్ద షాక్ అనే చెప్పాలి. ఫిక్సింగ్ వల్ల కేపీఎల్ ఫ్యూచర్‌పై ఎఫెక్ట్ పడటం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇక, జనత్ ఒకడే కాదు.. ఈ ఫిక్సింగ్ ఉదంతంలో మరో ముగ్గురు క్రికెటర్లకు కూడా భాగస్వామ్యం ఉందని, దీనికి సంబంధించిన విచారణను మరింత వేగవంతం చేశామని ఆఫ్ఘాన్ బోర్డు అఫీషియల్ స్టేట్మెంట్లో స్పష్టం చేసింది. మరి.. క్రికెట్లో మళ్లీ ఫిక్సింగ్ కలకలం రేపడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
🚨 BREAKING: Top-order batter Ihsanullah Janat has been banned for 5 years from all cricketing activities for breaching ACB and ICC Anti-Corruption Codes during KPL2. He admitted to violating Article 2.1.1 of the ICC Code.
🔗: https://t.co/6wDujqf7TC#ACB | #ACU pic.twitter.com/xqQ91fz17Q
— Afghanistan Cricket Board (@ACBofficials) August 7, 2024