iDreamPost
android-app
ios-app

ఆఫ్గాన్ కోచ్ మాస్టర్ ప్లాన్.. అనుకున్నట్లుగానే లంకను ఓడించారు!

  • Author Soma Sekhar Updated - 01:55 PM, Tue - 31 October 23

తాము అనుకున్నది అనుకున్నట్లుగానే వందకు వంద శాతం శ్రీలంకతో మ్యాచ్ లో అప్లై చేసింది ఆఫ్గాన్ టీమ్. ప్రస్తుతం ఆఫ్గాన్లు వేసిన మాస్టర్ ప్లాన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అదేంటో చూద్దాం పదండి.

తాము అనుకున్నది అనుకున్నట్లుగానే వందకు వంద శాతం శ్రీలంకతో మ్యాచ్ లో అప్లై చేసింది ఆఫ్గాన్ టీమ్. ప్రస్తుతం ఆఫ్గాన్లు వేసిన మాస్టర్ ప్లాన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అదేంటో చూద్దాం పదండి.

  • Author Soma Sekhar Updated - 01:55 PM, Tue - 31 October 23
ఆఫ్గాన్ కోచ్ మాస్టర్ ప్లాన్.. అనుకున్నట్లుగానే లంకను ఓడించారు!

ఆఫ్గానిస్తాన్.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో మారుమ్రోగుతున్న పేరు. దానికి కారణం వారి అద్భుతమైన ఆటతీరే. వరల్డ్ కప్ లో సంచనాలు సృష్టిస్తూ.. ఇంగ్లాండ్, పాక్ తో పాటుగా తాజాగా శ్రీలంకకు తమ దెబ్బ ఎలా ఉంటుందో రుచిచూపించింది. అయితే ఈ టోర్నీలో ఆఫ్గాన్ సాధించే విజయాలు ఏదో గాలివాటంగా వచ్చినవి అనుకుంటే మనం పొరపడినట్లే. వారి విజయాల వెనక ఇద్దరి దిగ్గజాల మాస్టర్ మైండ్ తో పాటు ఆటగాళ్లలో గెలవాలన్న కసి, పట్టుదల, దృఢసంకల్పాలే కారణంగా నిలుస్తూ వస్తున్నాయి. ఇక శ్రీలంకతో మ్యాచ్ లో విజయం వెనక పక్కా ప్రణాళికతో బరిలోకి దిగారు ఆఫ్గాన్స్. అందుకు సంబంధించి గణాంకాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి లంక విజయం వెనక ఉన్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. మరోసారి సంచలనం సృష్టించింది ఆఫ్గానిస్తాన్. ఇక ఈ మ్యాచ్ కోసం పక్కా ప్లాన్లను సిద్దం చేసుకుంది ఆఫ్గాన్. తాము అనుకున్నది అనుకున్నట్లుగానే వందకు వంద శాతం ఈ మ్యాచ్ లో అప్లై చేసింది. ప్రస్తుతం ఆఫ్గాన్లు వేసిన మాస్టర్ ప్లాన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆఫ్గాన్ కోచ్ వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే? శ్రీలంక విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని ముందుగా భాగాలుగా విడగొట్టింది. అందులో భాగంగా.. 10 ఓవర్లలో 50 రన్స్, 20 ఓవర్లలో 100, 30 ఓవర్లకు 150, 40 ఓవర్లకు 200 పరుగులు చేయాలని ముందుగానే తమ స్ట్రాటజీ బోర్డుపై రాసుకున్నారు. ఇక చివరిగా 48 ఓవర్లలోపు మ్యాచ్ ను ముగించాలన్నది ఆఫ్గాన్ ల వ్యూహం.

కాగా.. వారు అనుకున్నట్లుగానే దాన్ని అమలు పరిచారు. రెండు ఓవర్ల ముందుగానే విజయం సాధించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వారి స్ట్రాటజీ బోర్డ్ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇది తెలిసిన క్రికెట్ ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నారు. ఇంత ఫర్పెక్ట్ ప్లాన్స్ ఎలా వేస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీరు లెక్కల్లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ నే మించిపోయారు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా.. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు జోనాథన్ ట్రాట్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాక ఆఫ్గాన్ ఆటగాళ్లలో చాలా పరిణతి కనిపిస్తోంది. పేసర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. జట్టు విజయాలు అందిస్తున్నారు. ఇక టీమ్ మెంటర్ గా టీమిండియా మాజీ కెప్టెన్ అజయ్ జడేజా వచ్చాక.. వారు మరింత మెరికల్లా తయ్యారు అయ్యారు. వీరిద్దరు కలిసి ఆఫ్గాన్ టీమ్ ను ఓ అద్భుత శక్తిగా తీర్చిదిద్దుతున్నారు. ఇక వారి బ్యాటింగ్ ఆర్డర్ రోజురోజుకు పటిష్టంగా మారుతున్న విషయం మనకు తెలుస్తూనే ఉంది. మరి లంకతో మ్యాచ్ లో ఆఫ్గాన్ మాస్టర్ ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.