AFG vs SL: వరల్డ్ కప్ లో మరో సంచలనం.. ఆఫ్గాన్ ఇక పసికూన కాదు..

వరల్డ్ కప్ లో మరో సంచలనం.. ఆఫ్గాన్ ఇక పసికూన కాదు..

  • Author Soma Sekhar Published - 08:29 AM, Tue - 31 October 23

భారీ అంచనాలు పెట్టుకోకుండా వరల్డ్ కప్ బరిలోకి దిగిన ఆఫ్గాన్.. సంచలనాలు సృష్టిస్తోంది. మెున్న ఇంగ్లాండ్, నిన్న పాకిస్థాన్.. నేడు శ్రీలంకను చిత్తుచేసి ఔరా అనిపించింది.

భారీ అంచనాలు పెట్టుకోకుండా వరల్డ్ కప్ బరిలోకి దిగిన ఆఫ్గాన్.. సంచలనాలు సృష్టిస్తోంది. మెున్న ఇంగ్లాండ్, నిన్న పాకిస్థాన్.. నేడు శ్రీలంకను చిత్తుచేసి ఔరా అనిపించింది.

  • Author Soma Sekhar Published - 08:29 AM, Tue - 31 October 23

2023 వరల్డ్ కప్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. మేటి జట్లను మట్టికరిపిస్తూ.. ఈ వరల్డ్ కప్ లో చెరగని ముద్రను వేస్తూ ముందుకు సాగుతోంది ఆఫ్గానిస్తాన్. ఇకపై తమ జట్టును పసికూనగా చూస్తే.. ఏమవుతుందో మరోసారి గట్టిగా ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ మెగాటోర్నీలో తాము సాధిస్తున్న విజయాలు గాలివాటం కాదని రుజువుచేస్తూ.. శ్రీలంకను చిత్తుచేసింది. మూడోసారి వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న ఆఫ్గాన్ ఆ టోర్నీలో తమకంటే అన్ని విభాగాల్లో, ర్యాంకుల్లో పటిష్టంగా ఉన్న జట్లను కంగుతినిపించడం విశేషం. మెున్నటికి మెున్న డిఫెండింగ్ ఛాంపియన్ కు షాకిచ్చి.. ఆ ఉత్సాహంతో పాక్ ను మట్టికరిపించింది. తాజాగా 1996 వరల్డ్ కప్ ఛాంపియన్ శ్రీలంకను 7 వికెట్లతో చిత్తుచేసింది.

భారీ అంచనాలు పెట్టుకోకుండా వరల్డ్ కప్ బరిలోకి దిగిన ఆఫ్గాన్.. సంచలనాలు సృష్టిస్తోంది. మెున్న ఇంగ్లాండ్, నిన్న పాకిస్థాన్.. నేడు శ్రీలంకను చిత్తుచేసి ఔరా అనిపించింది. ఇక ఇప్పటి నుంచి తమ జట్టును పసికూన అనకూడదని ప్రపంచ జట్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. వరల్డ్ కప్ లో భాగంగా పూణే వేదికగా జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది ఆఫ్గాన్. 242 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్గాన్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక ఆఫ్గాన్ బౌలర్లను దీటుగానే ఎదుర్కొంది. ఒక దశలో 134/2తో పటిష్టస్థితిలో ఉంది లంక.

అయితే ఆ తర్వాత ఆఫ్గాన్ బౌలర్లు చెలరేగడంతో.. 107 పరుగులు చేసి చివరి 7 వికెట్లు కోల్పోయింది. నిస్సాంక(49), కెప్టెన్ కుశాల్ మెండిస్(39), సమరవిక్రమ(36) పరుగులతో రాణించారు. చివరికి 49.3 ఓవర్లలో 241 రన్స్ కు లంక ఆలౌట్ అయ్యింది. ఆఫ్గాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూఖీ 4 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గాన్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 45.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో రహ్మత్ షా(62), హష్మతుల్లా(58*), ఓమర్ జాయ్(73*) పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక విజయంతో ఆఫ్గాన్ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలోకి దూసుకొచ్చింది. మరి వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదు చేస్తూ.. దూసుకెళ్తున్న ఆఫ్గాన్ టీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments