iDreamPost
android-app
ios-app

Abhishek Sharma: అభిషేక్ శర్మ చెత్త రికార్డ్.. విరాట్ కోహ్లీ తర్వాత ఇతడే!

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అద్భుత శతకం సాధించిన విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ.. ఆ తర్వాత జరిగిన మ్యాచ్ లో ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఆ వరస్ట్ రికార్డ్ నమోదు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు.

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అద్భుత శతకం సాధించిన విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ.. ఆ తర్వాత జరిగిన మ్యాచ్ లో ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఆ వరస్ట్ రికార్డ్ నమోదు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు.

Abhishek Sharma: అభిషేక్ శర్మ చెత్త రికార్డ్.. విరాట్ కోహ్లీ తర్వాత ఇతడే!

జింబాబ్వే టూర్ కు పూర్తిగా యువ టీమిండియానే పంపించింది మేనేజ్ మెంట్. ఐపీఎల్ లో మెరుపులు మెరిపించిన ప్లేయర్ల సత్తాను పరీక్షించడానికి ప్రయోగాత్మకంగా యువ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది. అయితే తొలి మ్యాచ్ లోనే ఘోర పరాభవంతో మేనేజ్ మెంట్ ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకుందా? అన్న అనుమానం అందరిలో వచ్చింది. అయితే ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి తామేమీ తక్కువకాదని నిరూపించుకున్నారు. ఇక రెండో మ్యాచ్ లో అద్భుత శతకం సాధించిన చిచ్చర పిడుగు అభిషేక్ శర్మ.. ఆ తర్వాత మ్యాచ్ లో నిరాశపరిచాడు. అదీకాక ఓ చెత్త రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు.

అభిషేక్ శర్మ.. ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన ఈ యంగ్ ప్లేయర్ విధ్వంసకర ఇన్నింగ్స్ లతో చెలరేగాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం చీల్చిచెండాడాడు. సన్ రైజర్స్ ఫైనల్ కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో జింబాబ్వే సిరీస్ కు ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే తొలి మ్యాచ్ లోనే డకౌట్ గా వెనుదిరిగి.. తన ఎంట్రీని పేవలంగా ఆరంభించాడు. కానీ ఆ తర్వాత మ్యాచ్ లో అద్భుతంగా పుంజుకుని సెంచరీతో చెలరేగాడు. 47 బంతుల్లో 100 పరుగులు చేసి.. జట్టుకు భారీ స్కోర్ తో పాటుగా భారీ విజయాన్ని అందించాడు.

ఇదిలా ఉండగా.. మూడో టీ20లో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు అభిషేక్ శర్మ. అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన డీమోట్ అయిన రెండో టీమిండియా ప్లేయర్ గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. రెండో టీ20లో ఓపెనర్ గా బరిలోకి దిగిన సెంచరీ చేసిన తర్వాత మ్యాచ్ లో డీమోట్ అయ్యాడు. రెగ్యూలర్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ జట్టులోకి రావడంతో.. ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగాడు అభిషేక్. ఈ మ్యాచ్ లో 10 రన్స్ మాత్రమే చేసి తీవ్ర నిరాశపరిచాడు. సెంచరీ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ లో డీమోట్ అవ్వడం ద్వారా ఓ చెత్త రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు.

కాగా.. గతంలో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. 2022 ఆసియా కప్ లో ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగి సెంచరీ చేశాడు. కానీ ఆ తర్వాత మ్యాచ్ లో డీమోట్ అయ్యి.. ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చి.. కేవలం 2 రన్స్ మాత్రమే చేశాడు. దాంతో విరాట్ కోహ్లీ తర్వాత ఇలాంటి చెత్త రికార్డ్ ను నమోదు చేసిన రెండో భారత ప్లేయర్ గా అభిషేక్ శర్మ నిలిచాడు. అయితే అతడిని బ్యాటింగ్ ఆర్డర్ లో మార్చడం పట్ల కెప్టెన్ శుబ్ మన్ గిల్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి