iDreamPost
android-app
ios-app

ఐశ్వర్యరాయ్ పై అబ్దుల్ రజాక్ దిగజారుడు మాటలు.. ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం!

  • Author Soma Sekhar Published - 02:59 PM, Tue - 14 November 23

వరల్డ్ కప్ లో పాక్ టీమ్ వైఫల్యాన్ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ తో బ్యాడ్ గా పోలుస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వరల్డ్ కప్ లో పాక్ టీమ్ వైఫల్యాన్ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ తో బ్యాడ్ గా పోలుస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Author Soma Sekhar Published - 02:59 PM, Tue - 14 November 23
ఐశ్వర్యరాయ్ పై అబ్దుల్ రజాక్ దిగజారుడు మాటలు.. ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం!

వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ టీమ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ మెగాటోర్నీలో లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ ల్లో 4 విజయాలు సాధించి.. 5 మ్యాచ్ ల్లో ఓటమిచవిచూసింది. ఇక ఈ విశ్వ సమరంలో పాక్ దారుణమైన వైఫల్యాలను విమర్శిస్తూ.. మాజీ క్రికెటర్లు పాక్ ప్లేయర్లను ఓ ఆటాడుకుంటున్నారు. ఇక కొందరైతే తమ వైఫల్యానికి కొత్త కొత్త కారణాలు చెబుతూ.. పరువుపోగొట్టుకుంటున్నారు. తాజాగా మరోసారి తమ చౌకబారు మాటలతో ఇండియన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైయ్యారు. పాక్ టీమ్ వైఫల్యాన్ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ తో బ్యాడ్ గా పోలుస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్. దీంతో అతడిపై ఐశ్వర్య ఫ్యాన్స్ తో పాటుగా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాక్ క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు తమ పనికిమాలిన మాటలతో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక వరల్డ్ కప్ లో దారుణంగా విఫలం అయిన పాక్ జట్టుపై సొంత ప్లేయర్లే విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో ఈ వరల్డ్ కప్ లో పాక్ వైఫల్యానికి కారణాలు చెప్తూ.. పనికి మాలిన పోలిక పోల్చాడు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్. క్రికెట్ కు ఎలాంటి సంబంధం లేని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ను ఇందులోకి తీసుకొచ్చి.. బ్యాడ్ గా మాట్లాడాడు రజాక్. ఐశ్వర్యరాయ్ ను పెళ్లి చేసుకుని మంచి, పవిత్రమైన పిల్లలు పుట్టాలని కోరుకోవడం తప్పు అవుతుందని అది జరగదని అబ్దుల్ రజాక్ చౌకబారు పోలిక పోల్చాడు.

పాక్ క్రికెట్ టీమ్ కు సరైన గైడెన్స్ లేదు అని చెప్పడానికి.. ఐశ్వర్య క్యారెక్టర్ ను బ్యాడ్ చేస్తూ మాట్లాడాడు రజాక్. ఇక ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇండియన్స్. రోజులు మారుతున్నా గానీ పాక్ క్రికెటర్ల వక్రబుద్ది మాత్రం మారట్లేదంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి నీచమైన కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని, వెంటనే ఐశ్వర్యరాయ్ కి క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు పక్కనే ఉన్న షాహిద్ అఫ్రిదీ, ఉమర్ గుల్ నవ్వుతూ చప్పట్లు కొట్టడం ఇంకా దారుణమైన విషయం. మరి రజాక్ చౌకబారు మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet