SNP
ఓ టీమిండియా గ్రేట్ ప్లేయర్ గురించి సౌతాఫ్రికా దిగ్గజ మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ క్రికెటర్ రక్తంలోనే క్రికెట్ ఉందని, అలా క్రికెట్‌ను తన రక్తంలో నింపుకుండూ అతను ఎదిగాడంటూ పేర్కొన్నాడు. మరి ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓ టీమిండియా గ్రేట్ ప్లేయర్ గురించి సౌతాఫ్రికా దిగ్గజ మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ క్రికెటర్ రక్తంలోనే క్రికెట్ ఉందని, అలా క్రికెట్‌ను తన రక్తంలో నింపుకుండూ అతను ఎదిగాడంటూ పేర్కొన్నాడు. మరి ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌కు అతని దేశంలో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలియదు కానీ, ఇండియాలో మాత్రం ఏబీడీకి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకు కారణం ఏబీడీ.. ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడటమే. ఐపీఎల్‌లో భారీ పాపులారిటీ ఉన్న టీమ్ ఏదంటే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ జట్టు తరఫున డివిలియర్స్ చాలా కాలంపాటు ఆడాడు. పైగా విరాట్ కోహ్లీకి డివిలియర్స మంచి ఫ్రెండ్. వీరిద్దరి ఫ్రెండ్‌షిప్‌తో కూడా డివిలియర్స్‌ను ఇష్టపడేవారు ఉన్నారు. అందుకే ఇండియాకు సంబంధి డివిలియర్స్ ఏం మాట్లాడిన అది హైలెట్ అవుతూ ఉంటుంది.
తాజాగా డివిలియర్స్ ఒక విషయం గురించి మాట్లాడుతూ.. టీమిండియా స్టార్ క్రికెటర్, తన బెస్ట్ ఫ్రెండ్ విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ రక్తంలోనే క్రికెట్ ఉంది. రక్తంలో క్రికెట్ నింపుకుని కోహ్లీ పెరిగాడు.. నిజానికి అదే కోహ్లీని నడిపిస్తోంది. క్రికెట్ అంటే కోహ్లీ ఎప్పుడూ ప్యాషనే అంటూ డివిలియర్స్.. తన ఫ్రెండ్‌కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమో చెప్పుకున్నాడు. ప్రస్తుతం డివిలియర్స్ చేసిన కామెంట్స్ చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోహ్లీ గురించి డివిలియర్స్ ఏం చెప్పినా అద్భుతంగా ఉంటుందని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే.. ప్రస్తుతం కోహ్లీ ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.
అయితే.. చాలా కాలం తర్వాత టీ20 క్రికెట్ ఆడబోతున్న విరాట్ కోహ్లీ.. ఆఫ్ఘనిస్థాన్‌పై ఎలా ఆడతాడా? అని అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ తొలి మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. అయితే రెండో టీ20లో కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో కోహ్లీ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఏకంగా 765 పరుగులు చేసి.. వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇదే టెంపోను రాబోయే టీ20 వరల్డ్ కప్‌లోనూ చూపించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి కోహ్లీ రక్తంలోనే క్రికెట్ ఉందంటూ.. డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
AB Devilliers said “Virat Kohli grew up with cricket in his blood – that is probably what keeps him going. Cricket has always been his passion”. [SA20] pic.twitter.com/LNrp0Z4mci
— Johns. (@CricCrazyJohns) January 12, 2024