Somesekhar
ఆర్సీబీ వైఫల్యాలపై ఆ టీమ్ మాజీ ఆటగాడు, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆర్సీబీ గెలుపు బాట పట్టాలంటే విరాట్ కోహ్లీ కచ్చితంగా అది చేయాలని చెప్పుకొచ్చాడు మిస్టర్ 360 ప్లేయర్.
ఆర్సీబీ వైఫల్యాలపై ఆ టీమ్ మాజీ ఆటగాడు, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆర్సీబీ గెలుపు బాట పట్టాలంటే విరాట్ కోహ్లీ కచ్చితంగా అది చేయాలని చెప్పుకొచ్చాడు మిస్టర్ 360 ప్లేయర్.
Somesekhar
ఐపీఎల్ 2024 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ప్రదర్శన చెప్పుకోతగినదిగా లేదు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడు పరాజయాలను నమోదు చేసుకుని, కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. అయితే ఆర్సీబీ సంతోషించాల్సిన విషయం ఏంటంటే? విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉండటం. కాగా.. ఆర్సీబీ వైఫల్యాలపై ఆ టీమ్ మాజీ ఆటగాడు, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆర్సీబీ గెలుపు బాట పట్టాలంటే విరాట్ కోహ్లీ కచ్చితంగా అది చేయాలని చెప్పుకొచ్చాడు మిస్టర్ 360 ప్లేయర్.
ఐపీఎల్ 17వ సీజన్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ చాలా సప్పగా ఆరంభించింది. జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. విజయాలు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో రావడం లేదు. ఆడిన నాలుగు మ్యాచ్ లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. ఇక టీమ్ లో ఓపెనర్ విరాట్ కోహ్లీ మినహా ఇతర స్టార్ బ్యాటర్లు ఎవ్వరూ రాణించకపోవడం ఆర్సీబీకి పెద్ద సమస్యగా మారింది. కాగా.. ఆర్సీబీ వరుస ఓటములపై స్పందించాడు ఏబీ డివిలియర్స్. ఓ యూట్యూబ్ ఛానల్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
ఏబీడీ మాట్లాడుతూ..”ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ టీమ్ ఆటతీరు అంత చెత్తగా లేదు. కానీ ఇంకో రెండు మ్యాచ్ లు గెలిస్తేనే వారు తిరిగి పుంజుకోగలరు. పైగా టోర్నీలో ముందుకు వెళ్లగలరు. జట్టులో విరాట్ కోహ్లీ ఒక్కడే రాణిస్తున్నాడు. ఇది మంచి పరిణామం. కానీ అతడు కచ్చితంగా 6 నుంచి 15 ఓవర్ల పాటు క్రీజ్ లో ఉండాలి. అప్పుడే ఆర్సీబీ గెలవగలదు. అయితే డుప్లెసిస్ కూడా రాణించాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉంది. అతడు రిస్క్ తీసుకోవాలి” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఆర్సీబీ తన నెక్ట్స్ మ్యాచ్ ను రాజస్తాన్ రాయల్స్ తో జైపూర్ వేదికగా ఏప్రిల్ 6న ఆడనుంది. మరి ఏబీడీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: టీ-20 వరల్డ్ కప్ కోసం BCCI మెరుపులాంటి ఆలోచన! గంభీర్‌కి పిలుపు?