SNP
ఇటీవల ముగిసిన భారత్-సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో.. ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి.. సమవుజ్జీలుగా నిలిచాయి. తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా, రెండో మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటాయి. అయితే.. ఈ టెస్ట్ సిరీస్‌పై మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల ముగిసిన భారత్-సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో.. ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి.. సమవుజ్జీలుగా నిలిచాయి. తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా, రెండో మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటాయి. అయితే.. ఈ టెస్ట్ సిరీస్‌పై మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
SNP
ఇటీవల టీమిండియా సౌతాఫ్రికా పర్యటనను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు భారత జట్టు సఫారీ పర్యటనకు వెళ్లింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 సిరీస్ ఆడిన యంగ్ టీమిండియా.. 1-1తో సమం చేసింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో వన్డే సిరీస్‌ను 2-1తో నెగ్గింది. ఇక ఎంతో కీలకమైన టెస్ట్‌ను కూడా టీమిండియా సంతృప్తికరంగానే ముగించింది. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత తొలిసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగడంతో టెస్ట్ సిరీస్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.
కానీ, తొలి టెస్ట్‌లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా మినహా జట్టు మొత్తం దారుణంగా విఫలమైంది. కేవలం మూడు రోజుల్లోనే తొలి టెస్ట్ మ్యాచ్ ముగిసింది. సౌతాఫ్రికాలో టెస్ట్ గెలిచిన రికార్డులేని భారత జట్టు.. ఆ అపఖ్యాతిని తుడిచిపెడుతుందని అంతా భావించారు. కానీ, తొలి టెస్ట్‌లోనే ఓటమి పాలు కావడంతో.. ఆ ఆశలు ఆవిరి అయ్యాయి. రెండో టెస్టులో టీమిండియా కనీసం పోటీ అయినా ఇస్తుందా అని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా పుంజుకున్న భారత్.. సౌతాఫ్రికాను వాళ్ల సొంతగడ్డపై అవమానకరంగా ఓడించింది.
కేప్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒకటిన్నర రోజుల్లోనే రెండో టెస్ట్‌ను ముగించింది. టీమిండియా బౌలర్లు నిప్పులు చెరగడంతో సౌతాఫ్రికా బ్యాటర్లు మన బౌలింగ్ ఎటాక్ ముందు నిలువలేకపోయారు. దీంతో.. 1-1తో టెస్ట్ సిరీస్‌ను సమం చేసిన టీమిండియా.. సంతృప్తికరంగానే సఫారీ పర్యటనను ముగించింది. అయితే.. ఈ రెండు జట్ల మధ్య మూడో టెస్టు నిర్వహించకుండా.. కేవలం రెండు టెస్టులకే సిరీస్ పరిమితం చేయడంపై సౌతాఫ్రికా దిగ్గజ మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్-సౌతాఫ్రికా మధ్య మూడో టెస్ట్ లేకపోవడంతో తాను సంతోషంగా లేనని, టీ20 క్రికెట్ వల్లే ఇలా జరుగుతుందని, కానీ, ఈ విషయమై ఎవరిని నిందించాలో తనకు తెలియదని.. కానీ, ఎక్కడో పెద్ద తప్పు జరుగుతుందని అన్నాడు. మరి డివిలియర్స్ బాధపడుతున్నట్లు.. ఇండియా-సౌతాఫ్రికా మధ్య మూడో టెస్ట్ జరిగిన ఉంటే సిరీస్ విజేత తేలే అవకాశంతో పాటు టెస్ట్ క్రికెట్ మనగడకు ఉపయోగం ఉండేది. మరి డివిలియర్స్ ఆవేదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
AB De Villiers said, “I’m not happy to not see a 3rd Test between India and South Africa. You’ve to blame T20 cricket going around, I don’t know whom to blame, but I sense something is wrong. If you want to see all the teams compete, something has to change”. (AB YT). pic.twitter.com/HHhNy5oIGU
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 9, 2024