iDreamPost

వీడియో: సింహానికి వేట నేర్పినట్లు.. స్టెయిన్‌ బౌలింగ్‌ నేర్పుతున్న కుర్రాడు!

  • Published Jun 07, 2024 | 6:33 PMUpdated Jun 07, 2024 | 6:33 PM

Dale Steyn, America, T20 World Cup 2024: ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో దిగ్గజ బౌలర్‌గా ఉన్న స్టెయిన్‌కు ఓ కుర్రాడు క్రికెట్‌ పాఠాలు నేర్పాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Dale Steyn, America, T20 World Cup 2024: ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో దిగ్గజ బౌలర్‌గా ఉన్న స్టెయిన్‌కు ఓ కుర్రాడు క్రికెట్‌ పాఠాలు నేర్పాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Jun 07, 2024 | 6:33 PMUpdated Jun 07, 2024 | 6:33 PM
వీడియో: సింహానికి వేట నేర్పినట్లు.. స్టెయిన్‌ బౌలింగ్‌ నేర్పుతున్న కుర్రాడు!

క్రికెట్‌ అభిమానులకు సౌతాఫ్రికా దిగ్గజ మాజీ క్రికెటర్‌ డేల్‌ స్టేయిన్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్ల పాటు ప్రపంచంలోనే హేమాహేమీ బ్యాటర్లకు సైతం నిద్రలేకుండా చేసిన స్టెయిన్‌కు ఓ కుర్రాడు తాజాగా బౌలింగ్‌ నేర్పుతూ కనిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో దాదాపు 700 వికెట్లు ఉన్న దిగ్గజ బౌలర్‌కు బాల్‌ ఎలా పట్టుకోవాలి? ఎలా బౌలింగ్‌ చేయాలని చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిన తర్వాత కామెంటేటర్‌గా మారిన స్టెయిన్‌.. ప్రస్తుతం టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఓ షాపింగ్‌ మాల్‌లో ఏర్పాటు చేసిన నెట్‌ క్రికెట్‌ స్టాల్‌ వద్దకు స్టెయిన్‌ వెళ్లాడు. అక్కడున్న ఓ కుర్రాడు.. ఇది బాల్‌, దీన్ని ఇలా పట్టుకుని, ఇలా వేయాలి, మోచేతి ఇలా రానివ్వాలి, ఇలా బాల్‌ విసరాలి అంటూ బౌలింగ్‌ ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. స్టెయిన్‌ కూడా ఏం మాట్లాడకుండా.. ఆ కుర్రాడు ఎలా చెబితే అలా చేస్తున్నాడు. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. ఆ కుర్రాడికి స్టెయిన్‌ ఎవరో తెలియదు పాపం. స్టెయిన్‌ కూడా ఆ కుర్రాడికి తాను ఫలనా అని చెప్పకుండా.. కొద్దిసేపు తనకు క్రికెట్‌ అంటే ఏంటో తెలియదు అన్నట్లే ప్రవర్తించాడు. దీంతో ఈ వీడియో నవ్వులు పూయిస్తుంది.

2004 నుంచి 2021 వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన స్టెయిన్‌ ఎన్నో మ్యాచ్‌లలో ఎన్నో అద్భుతమైన స్పెల్స్‌ వేశాడు. ఎన్నో మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శనలు చేశాడు. తన కెరీర్‌లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20 మ్యాచ్‌లు ఆడాడు స్టెయిన్‌. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి 699 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్‌లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా స్టెయిన్‌ పేరు ఇప్పటికే అలాగే ఉంది. 2008 నుంచి 2014 మధ్య కాలంలో ఏకంగా 263 వారాలా పాటు టెస్టు క్రికెట్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ బౌలర్‌గా స్టెయిన్‌ కొనసాగాడు. ఇంత ఘనత కలిగిన దిగ్గజ క్రికెటర్‌కు ఓ కుర్రాడు బౌలింగ్‌ నేర్పించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి