iDreamPost
android-app
ios-app

Sachin Tendulkar: సచిన్ టెండుల్కర్ పై పక్కింటి వ్యక్తి కంప్లైంట్! కారణం ఏంటంటే?

  • Published May 06, 2024 | 1:23 PM Updated Updated May 06, 2024 | 1:23 PM

సచిన్ టెండుల్కర్ పై పక్కింటి వ్యక్తి కంప్లైంట్ చేశాడు. ట్విట్టర్ వేదికగా సచిన్ ను ట్యాగ్ చేస్తూ.. తన బాధను వ్యక్తపరిచాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

సచిన్ టెండుల్కర్ పై పక్కింటి వ్యక్తి కంప్లైంట్ చేశాడు. ట్విట్టర్ వేదికగా సచిన్ ను ట్యాగ్ చేస్తూ.. తన బాధను వ్యక్తపరిచాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published May 06, 2024 | 1:23 PMUpdated May 06, 2024 | 1:23 PM
Sachin Tendulkar: సచిన్ టెండుల్కర్ పై పక్కింటి వ్యక్తి కంప్లైంట్! కారణం ఏంటంటే?

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కు క్రికెట్ లో వివాదరహితుడిగా పేరుంది. ఎలాంటి గొడవలకు వెళ్ళకుండా తన  సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో క్రికెట్ గాడ్ గా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. క్రికెట్ లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా సచిన్ ఎంతో సౌమ్యుడు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి అలాంటి సచిన్ పై పక్కింటి వ్యక్తి కంప్లైంట్ చేశాడు. ట్విట్టర్ వేదికగా సచిన్ ను ట్యాగ్ చేస్తూ.. తన బాధను వ్యక్తపరిచాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

సచిన్ టెండుల్కర్ కు పక్కింటి వ్యక్తి ట్విట్టర్ వేదికగా కంప్లైంట్ చేశాడు. ఇంతకీ ఆ కంప్లైంట్ లో ఏముందంటే? హౌస్ కన్ స్ట్రక్షన్ లో భాగంగా  కాంక్రీట్ మిల్లర్స్ చేసే సౌండ్స్ భరించలేని విధంగా ఉన్నాయని, రాత్రి 9 గంటలు దాటినా వాటి సౌండ్ ఆగడంలేదని దిలీప్ డిసౌజా అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా తన బాధను వ్యక్తపరిచాడు. ఏకంగా సచిన్ ను ట్యాగ్ చేస్తూ తన ఆవేదనను తెలియజేశాడు. కాగా.. సచిన్ టెండుల్కర్ సంబంధించి బాద్రాలో ఉన్న ఇంటి నుంచి ఈ సౌండ్స్ వస్తున్నాయని సదరు వ్యక్తి తెలిపాడు. వర్కర్లను టైమింగ్స్ ఫాలో అవ్వమని చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేశాడు.

అయితే ఈ ట్విట్ పై సచిన్ ఇంకా స్పందించాలేేదు. ఏవిధంగా రిప్లై ఇస్తాడో చూడాలి మరి. ఇక ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సచిన్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండని సలహా ఇస్తే.. మరికొందరు కొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుపోతాయిలేండీ అంటున్నారు. ఇక ఇంకొందరు ఇండియా వదిలి పారిపోండి అంటూ సరదాగా రాసుకొస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet