iDreamPost
android-app
ios-app

బంగ్లా చేతిలో సొంత గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ వైట్‌వాష్‌.. పాక్‌ డౌన్‌ఫాల్‌కు 5 కారణాలు ఇవే!

  • Published Sep 04, 2024 | 11:50 AM Updated Updated Sep 04, 2024 | 11:50 AM

PAK vs BAN, Pakistan Cricket, PCB, Babar Azam: ఒకప్పుడు పెద్ద పెద్ద టీమ్స్‌కు కంటిమీద కునుకులేకుండా చేసిన పాకిస్థాన్‌ జట్టు.. ఇప్పుడు స్వదేశంలో పసికూనల చేతిలో కూడా ఓడిపోతూ.. తమ స్థాయిని మరింత దిగజార్చుకుంటుంది. అసలు వారి పతనానికి ప్రధానంగా 5 కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

PAK vs BAN, Pakistan Cricket, PCB, Babar Azam: ఒకప్పుడు పెద్ద పెద్ద టీమ్స్‌కు కంటిమీద కునుకులేకుండా చేసిన పాకిస్థాన్‌ జట్టు.. ఇప్పుడు స్వదేశంలో పసికూనల చేతిలో కూడా ఓడిపోతూ.. తమ స్థాయిని మరింత దిగజార్చుకుంటుంది. అసలు వారి పతనానికి ప్రధానంగా 5 కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Sep 04, 2024 | 11:50 AMUpdated Sep 04, 2024 | 11:50 AM
బంగ్లా చేతిలో సొంత గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ వైట్‌వాష్‌.. పాక్‌ డౌన్‌ఫాల్‌కు 5 కారణాలు ఇవే!

ఏ జట్టుకైన సొంత దేశంలో మ్యాచ్‌ అంటే మంచి అడ్వాంటేజ్‌ ఉంటుంది. సొంత అభిమానుల మధ్య, తనకు అనుకూలంగా ఉంటే పిచ్‌పై చెలరేగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా టీమ్స్‌ను స్వదేశంలో పులి, విదేశాల్లో పిల్లి అని కూడా అంటూ ఉంటారు. ఇలాంటి ట్యాగ్‌ కొన్నేళ్ల క్రితం వరకు టీమిండియాకు కూడా ఉండేది. మన దేశపు పిచ్‌లపై మనల్ని ఓడించడం అంత సులువైన విషయం కాదు. అలాగే ప్రతి దేశానికి వాళ్ల సొంత గ్రౌండ్‌లో ఆడటం అదనపు బలం. కానీ, పాకిస్థాన్‌ మాత్రం ఆ బలాన్ని కూడా వదులుకుంటున్నట్లు కనిపిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టులో సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది పాకిస్థాన్‌, అంతే కంటే ముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌లు సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. అలాగే 2022-23 ఏడాదిలో ఇంగ్లండ్‌తో ఆడిన మూడు టెస్టుల సిరీస్‌లో పాకిస్థాన్‌ మూడు టెస్టుల్లోనూ ఓడిపోయి.. వైట్‌ వాష్‌కు గురైంది. ఇలా.. స్వదేశంలో ఆడిన మూడు వరుస సిరీస్‌ల్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు పాకిస్థాన్‌. స్వదేశంలో పాకిస్థాన్‌ ఇంత చెత్త ప్రదర్శన ఎందుకు కనబరుస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు వారి డౌన్‌ ఫాల్‌కు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1. ఫేవరేటిజమ్‌

పాకిస్థాన్‌ టీమ్‌లో ఉన్న అతి పెద్ద దరిద్రం ఏంటంటే.. మన అనుకున్న వాళ్ల టీమ్‌లో ఉంటారు. దీనిపై చాలా మంది అనేక సార్లు ఆరోపణలు చేశారు. కెప్టెన్‌, సెలెక్టర్లు, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌కు క్లోజ్‌గా ఉంటూ.. ఫ్రెండ్స్‌గా మెలిగే క్రికెటర్లకే జాతీయ జట్టులో త్వరగా చోటు దక్కడమే కాకుండా.. వారి ప్రదర్శన ఎలా ఉన్నా.. జట్టులో కొనసాగుతూ ఉంటారు. ఎంతో టాలెంట్‌ ఉండి, దేశవాళి క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నా.. కొంతమంది ఆటగాళ్లకు అస్సలు టీమ్‌లో అవకాశం లభించదు. ఈ విషయంపై మాజీ క్రికెటర్లు మాట్లాడినా.. సెలెక్టర్లు, బోర్డు ఛైర్మన్లు, కెప్టెన్లు మారుతున్నా.. ఈ పరంపర మాత్రం అలాగే కొనసాగుతూనే ఉంది. సరైన టాలెంట్‌ను టీమ్‌లోకి తీసుకోకుండా.. ఫేవరేటిజిమ్‌ చూపిస్తుండటం పాకిస్థాన్‌ క్రికెట్‌ సర్వనాశనం అవ్వడానికి ‘ఫేవరేటిజమ్‌’ను ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

2. ఒకరిద్దరిపై ఆధారపడటం

ఒకప్పుడు పాకిస్థాన్‌ జట్టు ఎంతో స్ట్రాంగ్‌గా ఉండేది. మిగతా టీమ్స్‌తో పరిస్థితి ఎలా ఉన్నా.. టీమిండియా చాలా సార్లు గట్టి పోటీ ఇచ్చేలా ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం టీమిండియా అండర్‌ 19 జట్టులో ఆడినా ఓడిపోయేలా పరిస్థితి తయారైంది. ఇందుకు కారణం.. చాలా కాలంగా పాకిస్థాన్‌ జట్టు ఒకరిద్దరు ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. బాబర్‌ ఆజమ్‌, మొహ్మమద్‌ రిజ్వాన్‌, షాహీన్‌ షా అఫ్రిదీలను పాక్‌ జట్టు ఎక్కువగా నమ్ముకుంది. బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిదీ విఫలం అవ్వడంతో పాక్‌ కనీసం.. బంగ్లాదేశ్‌కు కూడా పోటీ ఇవ్వలేకపోతుంది. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో బాబర్‌ ఆజమ్‌ దారుణంగా విఫలం అయ్యాడు.. షాహీన్‌ అఫ్రిదీ సైతం తొలి టెస్టులో చెత్త ప్రదర్శనతో రెండో టెస్టుకు కూడా దూరం అయ్యాడు.

3. ఆటగాళ్ల మధ్య విభేదాలు

ఉన్న దరిద్రాలు సరిపోవు అన్నట్లుగా.. పాకిస్థాన్‌ క్రికెట్‌కు పట్టిన మరో దరిద్రం ఏంటంటే.. ఆటగాళ్ల మధ్య విభేదాలు. కాస్త స్టార్‌డమ్‌ రాగానే ఇక మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లు బిహేవ్‌ చేస్తుంటారు పాక్‌ ఆటగాళ్లు. టీమ్‌ మొత్తాన్ని తానొక్కడినే నడిపిస్తున్నానని, నేను లేకపోతే టీమ్‌ లేదనే భ్రమలో బతికేస్తూ.. మిగతా ఆటగాళ్లను చులకన చేస్తుంటారు. ఇలాంటి యాటిట్యూడ్‌తో టీమ్‌లో ఆటగాళ్ల మధ్య సరైన సాన్నిహిత్యం లేదు. ఇక విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ అంత పాపులారిటీ వచ్చి ఉంటే.. పాక్‌ క్రికెటర్లలో కొంతమందికి కళ్లు ఎప్పుడో నెత్తికి ఎక్కేవి. బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ షా అఫ్రిదీ, టెస్ట్‌ కెప్టెన్‌ షాన్‌ మసూద్‌లకు ఒకరంటే ఒకరు పడదనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా స్టార్‌ ఆటగాళ్లంతా అత్తాకోడల్లా గొడవపడుతుంటే.. ఇంక టీమ్‌ ఎలా మ్యాచ్‌లు గెలుస్తుంది?

4. రాజకీయ జోక్యం

పాకిస్థాన్‌ క్రికెట్‌లో రాజకీయ జోక్యం చాలా ఎక్కువ. నిజానికి క్రికెట్‌ బోర్డుల విషయంలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటే ఐసీసీ సహించదు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బోర్డులుగా ఉండాలని ఐసీసీ చెబుతోంది. కానీ, పాకిస్థాన్‌ క్రికెట్‌లో అనధికారికంగా రాజకీయ జోక్యం చాలా ఎక్కువ. అక్కడి ప్రభుత్వాలు, బడా రాజకీయ నేతలు చెప్పిన వారే పీసీబీ ఛైర్మన్‌, సెలెక్షన్‌ కమిటీ మెంబర్‌, జట్టు కెప్టెన్‌ అవుతారు. వాళ్లు అనుమతి లేనిదే పాక్‌ క్రికెట్‌లో ఏం జరగదు. ఇలా రాజకీయ జోక్యం ఎక్కువ అవ్వడంతో జట్టులో నాణ్యత లోపించి.. ఎక్కడెక్కడి చెత్త అంత పేరుకుపోయింది. టాలెంట్‌ ఉన్న క్రికెటర్లు దేశవాళి క్రికెట్‌లో మగ్గుతుంటారు.. స్క్రాప్‌ అంతా నేషనల్‌ టీమ్‌లోనే ఉంటుంది.

5. చెత్త ఆట

తెరవెనుక ఎన్ని జరిగినా.. గ్రౌండ్‌లోకి దిగిన తర్వాత ఆడాల్సిందే ఆటగాళ్లే. బాబర్‌ ఆజమ్‌ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉండి, అతని రాజ్యం సాగినంత కాలం పాకిస్థాన్‌ జట్టు కాస్త పర్వాలేదనిపించింది. ఎప్పుడైతే.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో ఓటమికి బాధ్యత వహిస్తూ.. బాబర్‌ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడో అప్పటి నుంచి పాక్‌ క్రికెట్‌ పూర్తిగా గాడి తప్పింది. బాబర్‌ స్థానంలో టీ20 కెప్టెన్‌గా షాహీన్‌ షా అఫ్రిదీకి అవకాశం ఇచ్చారు.. కెప్టెన్‌గా అతను తేలిపోయాడు. దాంతో గతిలేక మళ్లి బాబర్‌కే టీ20, వన్డే కెప్టెన్సీ అప్పగించారు. టెస్టు కెప్టెన్సీ మాత్రం షాన్‌ మసూద్‌కు ఇచ్చారు. అతను కూడా కెప్టెన్‌గా విఫలం అయ్యాడు. ఇలా పాకిస్తాన్‌ క్రికెట్‌కు సవాలక్ష కారణాలు ఉన్నా.. ఈ ఐదు కారణాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరి ఈ కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.