iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్.. అందుబాటులోకి వరల్డ్ కప్ టికెట్స్! ఇలా కొనుక్కోండి..

  • Author Soma Sekhar Published - 08:53 PM, Sat - 29 July 23
  • Author Soma Sekhar Published - 08:53 PM, Sat - 29 July 23
గుడ్ న్యూస్.. అందుబాటులోకి వరల్డ్ కప్ టికెట్స్! ఇలా కొనుక్కోండి..

మరికొన్ని రోజుల్లో క్రికెట్ మహా సంగ్రామం ప్రారంభం కానుంది. ఈ విశ్వ సమరం కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనేక్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. స్టేడియానికి వెళ్లి మ్యాచ్ లు చూడాలి అనుకున్న వాళ్లు ఇక సిద్ధం కాండి.. ఎందుకంటే వరల్డ్ కప్ మ్యాచ్ లకు సంబంధించిన టికెట్లను బీసీసీఐ అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మహా సంగ్రామం జరగనుంది. మరి ఈ టికెట్లు ఎలా కొనుక్కోవాలి? ఏ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2023 వరల్డ్ కప్ కు ఇంకా రెండు నెలలే సమయం ఉంది. దీంతో ఈ ప్రపంచ కప్ కు సంబంధించిన అన్ని విషయాలను చాలా క్షణ్ణంగా పరిశీలిస్తోంది బీసీసీఐ. భారత్ వేదికగా జరిగే ఈ వరల్డ్ కప్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ. అందుకు అనుగుణంగానే అన్ని ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఈ క్రమంలోనే క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. వరల్డ్ కప్ మ్యాచ్ లకు సంబంధించిన టికెట్లను ఆగస్టు 10 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.

ఇక ఈ టికెట్లను ఆన్ లైన్, ఆఫ్ లైన్ పద్దతిలో విక్రయించనున్నారు. కాగా.. టికెట్ల ధరలను తొందర్లోనే ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. అయితే టికెట్ల కొనుగోలు విషయంలో ఫ్యాన్స్ కు ఒక షరతును విధించింది. ఆన్ లైన్ లో టికెట్లు కొన్నవారు మ్యాచ్ కు వచ్చేటప్పుడు తప్పనిసరిగా భౌతిక (ప్రింటెడ్) టికెట్లను తీసుకురావాలని సూచించింది. ఈ-టికెట్ ను అనుమతించబోమని జై షా స్పష్టం చేశారు. ఆన్ లైన్ లో టికెట్లను బుక్ చేసుకున్నవారికి ఫిజికల్ టికెట్లు పొందడానికి 7 నుంచి 8 కేంద్రాలను సిద్దం చేశామని ఆయన పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: కావ్యని అలా చూడలేక ఛానల్ మార్చే వాడిని: సూపర్ స్టార్ రజినీ