Google Top 10 Most Searched List: ఇండియాలో 2023వ సంవత్సరానికి గాను గూగుల్ లో అత్యధికంగా వెతికిన వ్యక్తుల, సినిమాల, వెబ్ సిరీస్ ల లిస్ట్ ను గూగుల్ విడుదల చేసింది. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
Google Top 10 Most Searched List: ఇండియాలో 2023వ సంవత్సరానికి గాను గూగుల్ లో అత్యధికంగా వెతికిన వ్యక్తుల, సినిమాల, వెబ్ సిరీస్ ల లిస్ట్ ను గూగుల్ విడుదల చేసింది. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్రతీ సంవత్సరం భారతదేశంలో అత్యధిక మంది గూగుల్ సెర్చ్ లో వెతికిన సెలబ్రిటీల లిస్ట్ ను ప్రకటిస్తూ ఉంటుంది గూగుల్ సంస్థ. అందులో భాగంగానే ఈ సంవత్సరం(2023)కూడా టాప్-10లో నిలిచిన వ్యక్తుల జాబితాను తాజాగా విడుదల చేసింది. అందులో ఏకంగా ఆరుగురు క్రికెట్ ప్లేయర్లు ఉండటం గమనార్హం. అయితే వీరిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు లేకపోవడం ఆశ్చర్యం. వీరిద్దరిని కాదని ముగ్గురు భారత క్రికెటర్లు ఈ లిస్ట్ లో చోటు దక్కించుకున్నారు. మరి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది ఎవరు? ఆ ముగ్గురు టీమిండియా ప్లేయర్లు ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియాలో 2023వ సంవత్సరానికి గాను గూగుల్ లో అత్యధికంగా వెతికిన వ్యక్తిగా తొలి స్థానంలో నిలిచింది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఆ తర్వాత రెండో ప్లేస్ లో టీమిండియా యువ సంచలనం శుబ్ మన్ గిల్ ఉన్నాడు. ఇక మూడో స్థానంలో వరల్డ్ కప్ నయా సెన్సేషన్ న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్రను భారతీయులు తెగ వెతికారు. నాలుగో ప్లేస్ లో వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన హీరో మహ్మద్ షమీ ఉన్నాడు. స్టార్ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఐదు, కియారా అద్వానీ భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఆరు, ఆసీస్ విధ్వంసకర ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ ఏడు, మాజీ ఫుట్ బాల్ దిగ్గజం డేవిడ్ బెక్ హామ్ ఎనిమిది, టీమిండియా టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ తొమ్మిది, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ హీరో ట్రావిస్ హెడ్ పదవ స్థానాల్లో ఉన్నారు.
కాగా.. ఈ ఏడాది టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీని గూగుల్లో సెర్చ్ చేయకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కూడా గెలిచాడు విరాట్. ఇక కోహ్లీతో పాటుగా రోహిత్ కూడా టాప్ 10లో లేకపోవడం విడ్డూరం. ఇదిలా ఉండగా భారతదేశంలో మోస్ట్ సెర్చ్ డు మూవీల లిస్ట్ కు వస్తే.. బాలీవుడ్ బాద్ షా కింగ్ షారుఖ్ నటించిన జవాన్ అగ్రస్థానంలో నిలిచింది. మరో మూవీ పఠాన్ ఐదో ప్లేస్ లో ఉంది. మిగతా సినిమాల్లో వరుసగా గదర్ 2, ఓపెన్ హైమర్, ఆదిపురుష్, ద కేరళ స్టోరీ, జైలర్, లియో, టైగర్ 3, వారీసు చిత్రాలు అత్యధికంగా వెతికిన చిత్రాలుగా నిలిచాయి. ఇక వెబ్ సిరీస్ ల జాబితాకి వస్తే.. అగ్రస్థానంలో ఫర్జీ, రెండవ ప్లేస్ లో వెడ్నస్ డే, అసుర్, రానా నాయుడు, ద లాస్ట్ ఆఫ్ అస్, స్కామ్ 2003, బిగ్ బాస్ 17, గన్స్ అండ్ గులాబ్స్, సెక్స్/లైఫ్, తాజా ఖబర్ లు వరుసగా గూగుల్ లో వెతికిన జాబితాలో నిలిచాయి. మరి ఈ లిస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
BIG DAY FOR SKYians ❤
Surya Kumar Yadav is in the list of google’s top 10 most searched celebrities of India for 2023#SuryaKumarYadav #Google #CricketTwitter pic.twitter.com/O3vz4VkHhg
— Soham M ll ODIS PE LAANAT (@103of49Wankhede) December 11, 2023