SNP
RCB vs CSK, IPL 2024: ఈ సీజన్‌లోనే బిగ్గెస్ట్ మ్యాచ్ కోసం రంగం సిద్ధం అవుతోంది. ఆర్సీబీ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌లో ఆ ఒక్క నంబర్ చుట్టూ ఓ టీమ్ జాతకం తిరుగుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
RCB vs CSK, IPL 2024: ఈ సీజన్‌లోనే బిగ్గెస్ట్ మ్యాచ్ కోసం రంగం సిద్ధం అవుతోంది. ఆర్సీబీ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌లో ఆ ఒక్క నంబర్ చుట్టూ ఓ టీమ్ జాతకం తిరుగుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024 కీలక దశకు చేరుకుంది. టోర్నీలో దాదాపు 60కి పైగా మ్యాచ్‌లు ముగిసి.. సీజన్ ముగింపు దశకు వచ్చినా కేవలం రెండు టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. మిగిలిన రెండు స్థానాల కోసం ఏకంగా ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. వాటిలో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎస్‌ఆర్‌హెచ్ ఖాతాలో ఇప్పటికే 14 పాయింట్లు ఉన్నాయి. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. దీంతో.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మరో స్థానం కోసం సీఎస్‌కే, ఆర్సీబీ గట్టి పోటీ ఇస్తున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ 14 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. ఆర్సీబీ, డీసీ, లక్నో 12 పాయింట్లతో ఉన్నాయి. ఆ రెండు టీమ్స్ కంటే ఆర్సీబీకి మంచి రన్‌రేట్ ఉంది. దీంతో.. సీఎస్‌కేపై మంచి తేడాతో ఆర్సీబీ గెలిస్తే.. ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. సీఎస్‌కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఈ నెల 18న జరగనుంది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ లోకం ఎదురుచూస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇది నాకౌట్ మ్యాచ్‌లా మారిపోయింది. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే ఆర్సీబీ కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఇలాంటి కీలక మ్యాచ్‌లో ఆర్సీబీని 18వ నంబర్ కాపాడేలా కనిపిస్తోంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
సీఎస్‌కేతో మ్యాచ్ ఈ నెల 18వ తేదీన జరగనుంది. ఒక వేళ ఆర్సీబీ ముందు బ్యాటింగ్ చేస్తే.. సీఎస్‌కును 18 అంతకంటే ఎక్కువ రన్స్ తేడాతో ఓడించాలి. ఒక వేళ ఛేజింగ్ చేయాల్సి వస్తే.. 18.1 ఓవర్లలో లోపలే టార్గెట్‌ను చేరుకోవాలి. అప్పుడే సీఎస్‌కే కంటే మెరుగైన రన్ రేట్‌ను సాధించి, ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇలా 18 చుట్టూనే ఆర్సీబీ జాతకం తిరుగుతోంది. పైగా ఆర్సీబీకి పెద్ద దిక్కుగా ఉన్న విరాట్ కోహ్లీ.. సీజన్ ఆరంభం నుంచి ఆ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. కోహ్లీ జెర్సీ నంబర్ కూడా 18 కావడం విశేషం. ఇలా సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఆర్సీబీని ఆ 18 నంబరే కాపాడి, ప్లే ఆఫ్స్‌కు చేర్చాలని ఫ్యాన్స్ సరదాగా కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli has a special love with 18 :
RCB vs CSK – 18th May
Virat Jersey No – 18Virat scores on 18th May :
– 56(29) vs CSK in 2013
– 113(50) vs PBKS in 2016
– 100(63) vs SRH in 2023#RCBvsCSK #ViratKohli pic.twitter.com/kNrKdaenP4— Richard Kettleborough (@RichKettle07) May 15, 2024