10 ఏళ్ల శ్రీలంకన్ చిచ్చర పిడుగు తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి భరతం పట్టాడు. దిగ్గజ బౌలర్లే ఆశ్చర్యపోయేలా రికార్డు స్థాయి గణాంకాలు నమోదు చేశాడు.
10 ఏళ్ల శ్రీలంకన్ చిచ్చర పిడుగు తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి భరతం పట్టాడు. దిగ్గజ బౌలర్లే ఆశ్చర్యపోయేలా రికార్డు స్థాయి గణాంకాలు నమోదు చేశాడు.
క్రికెట్ చరిత్రలో ఎన్నో అరుదైన రికార్డులు నమోదైన, అవుతున్న విషయం మనందరికి తెలిసిందే. ఒకదానికి మించి మరోటి అన్నట్లుగా ఈ ఘనతలను నెలకొల్పుతున్నారు ఆటగాళ్లు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే రికార్డు గురించి తెలిస్తే.. మీరు అవాక్కైతారు. ఈ ఘనత సాధించింది ఇంటర్నేషనల్ ప్లేయర్ కాదు. ఓ 10 ఏళ్ల స్కూల్ పిల్లాడు. అలా అని అతడిని తక్కువగా అంచనా వేస్తే మనం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే తాజాగా ఆ కుర్రాడు చెలరేగిన విధానం చూస్తే.. అతడి బౌలింగ్ కు ఫిదా అవ్వాల్సిందే. ఈ శ్రీలంక చిచ్చర పిడుగు తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి భరతం పట్టాడు. 9 ఓవర్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. అతడి పేరే సెల్వశేకరన్ రిషియుధన్.
సెల్వశేకరన్ రిషియుధన్.. ప్రస్తుతం క్రికెట్ లో సంచలనంగా మారిన పేరు. దానికి కారణం అతడి అసాధారణమైన బౌలింగే. క్రికెట్ వర్గాలు మెుత్తం ఇప్పుడు ఇతడి గురించే మాట్లాడుకుంటున్నాయి. ఇటీవల జరిగిన అండర్-13 స్కూల్ గేమ్స్ లో పాల్గొన్నాడు స్పిన్నర్ రిషియుధన్. ఈ గేమ్స్ లో ఓ మ్యాచ్ లో 9.4 ఓవర్లు వేసి ఒక్క రన్ కూడా ఇవ్వకుండా ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. రిషియుధన్ దెబ్బకు ప్రత్యర్థి జట్టు కేవలం 28 పరుగులుకే ఆలౌట్ అయ్యింది. ఇక 10 సంవత్సరాలకే ఈ లంక చిచ్చర పిడుగు చెలరేగిన విధానం దిగ్గజ క్రికెటర్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
కాగా.. మ్యాచ్ అనంతరం రిషియుధన్ మాట్లాడుతూ..”ఒకే ఓవర్ లో6 బాల్స్ ను 6 రకాలుగా ఎలా వేయాలో నాకు తెలుసు. క్యారమ్ బాల్, లూప్, లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, ఫాస్ట్ బాల్, ఫ్లాట్ లూప్ లాంటి అన్ని అస్త్రాలు నా దగ్గర ఉన్నాయి. ఇక 19 ఏళ్లకే శ్రీలంక జట్టు తరఫున అరంగేట్రం చేయాలనుకుంటున్నాను. నాకు ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ స్ఫూర్తి” అంటూ చెప్పుకొచ్చాడు ఈ లంక నయా సంచలనం. ఇక ఈ ప్రదర్శనతో ఒక్కసారిగి లైమ్ లైట్ లోకి వచ్చాడు రిషియుధన్. ఇతడి ప్రదర్శన చూసిన క్రికెట్ అభిమానులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. శ్రీలంకకు మరో ముత్తయ్య మురళీ ధరన్ దొరికాడు అంటూ కితాబిస్తున్నారు. మరి 10 ఏళ్లకే రికార్డు గణాంకాలు నమోదు చేసిన రిషియుధన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
All the very best Selvasekaran Rishiyudhan!
මේ දරුවාගේ හැකියාව දැකලා ඇගේ හිරිගඩු පිපුනා …ඇයි මන්දා අප්පා ක්රිකට් වලට මෙච්චර ආදරේ අපි… pic.twitter.com/tGGsNhs5L1
— Ishan Abeygunawardena (@IamIshanAbey) November 26, 2023