iDreamPost
android-app
ios-app

పీయస్‌వీ గరుడ వేగ 126.18ఎమ్‌ రివ్యూ

పీయస్‌వీ గరుడ వేగ 126.18ఎమ్‌ రివ్యూ

ప‌దేళ్ల క్రితం 2007లో వ‌చ్చిన ఎవ‌డైతే నాకేంటి సినిమాతో హిట్ కొట్టిన సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ ఆ త‌ర్వాత చేసిన సినిమాల‌న్ని వ‌రుస‌గా ప్లాపుల మీద ప్లాపులు అయ్యాయి. రెండేళ్ల క్రితం గ‌డ్డం గ్యాంగ్ లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత క‌నుమ‌రుగైన రాజ‌శేఖ‌ర్ లాంగ్ గ్యాప్ తీసుకుని చేసిన సినిమా పీఎస్‌వీ గ‌రుడ‌వేగ‌. రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లోనే రూ.30 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాకు ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:
చంద్రశేఖర్‌ (రాజశేఖర్‌) నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలో అసిస్టెంట్‌ కమీషనర్‌. శేఖ‌ర్ ఎప్పుడూ ఉద్యోగం, డ్యూటీ అంటూ బిజీబిజీగా ఉండ‌డంతో ఫ్యామిలీకి స‌రైన టైం కేటాయించ‌లేడు. ఇక త‌న మిష‌న్స్ కార‌ణంగా ఎప్పుడూ భార్య స్వాతి (పూజా కుమార్‌)తో గొడ‌వ ప‌డుతుంటాడు. చంద్రశేఖ‌ర్ తీరుతో విసిగిపోయిన స్వాతి విడాకులు కోరుతుంది. చివ‌ర‌కు రాజీకి వ‌చ్చిన శేఖ‌ర్ ఫ్యామిలీకి టైం కేటాయిస్తాన‌ని చెప్పి ఆమెను కన్విన్స్ చేస్తాడు. ఇక ఉద్యోగం వ‌ద్ద‌నుకుని రాజీనామా చేయాల‌నుకునే టైంలో ఓ కేసును మ‌నోడు డీల్ చేయాల్సి వ‌స్తుంది. ఓ కీల‌క స‌మాచారాన్ని నిరంజ‌న్ (అదిత్ అరుణ్‌) ప్ర‌తిప‌క్ష లీడ‌ర్ అయిన ప్రతాప్‌ రెడ్డి (పోసాని కృష్ణమురళీ)కి రూ. 10 కోట్ల‌కు భేరం పెడ‌తాడు. ఈ స‌మాచారం ప్ర‌తాప్‌రెడ్డికి ఇచ్చే క్ర‌మంలో నిరంజ‌న్ చంద్ర‌శేఖ‌ర్‌కు దొరికిపోతాడు. నిరంజ‌న్ ఎనైఏ కస్టడీలో ఉండగానే నిరంజన్ సీక్రెట్ స‌మాచారం శ‌త్రువుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అస‌లు ఈ సీక్రెట్ స‌మాచారం ఏంటి ? దీంతో ప్ర‌తిప‌క్షనేత ప్ర‌తాప్‌రెడ్డికి ఉన్న ప‌నేంటి ? ఈ సీక్రెట్ మిష‌న్‌కు క్రిమినల్ జార్జ్‌కు ఉన్న లింకేంటి ? అన్న‌దే ఈ సినిమా

న‌టీన‌టుల పెర్పామెన్స్ :
పోలీస్ పాత్ర‌లు అంటే హీరో రాజ‌శేఖ‌ర్‌కు కొట్టిన పిండి. ఈ సినిమాలో కూడా పోలీస్ ఆఫీస‌ర్‌గా సీక్రెట్ ఇన్వెస్ట్‌గేష‌న్లు చేసే రోల్‌లో రాజ‌శేఖ‌ర్ మ‌రోసారి అద్భుతంగా న‌టించి మెప్పించాడు. యాక్ష‌న్ హీరోగా ఆయ‌న‌కు ఉన్న ఇమేజ్‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఈ రోల్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకుని చేశాడు. సినిమా అంతా రాజ‌శేఖ‌ర్ యాక్ష‌న్‌తో ద‌ద్ద‌రిల్లిపోతుంది. ఇక హీరోయిన్ పూజా కుమార్ మిడిల్ ఏజ్జ్ ఆంటీగా క‌నిపించింది. సినిమాకు అవ‌స‌ర‌మైన గ్లామ‌ర్ తేవ‌డంలో ఆమె రోల్ స‌క్సెస్ కాలేదు. రాజ‌శేఖ‌ర్ టీం స‌భ్యులుగా చేసిన చరణ్‌ దీప్‌, రవివర్మ తమ పాత్రకు న్యాయం చేశారు. పోసాని కృష్ణమురళీ రాజకీయనాయకుడి పాత్రలో మరోసారి అలరించగా, అలీ, 30 ఇయర్స్‌ పృధ్వీ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. కీలక పాత్రలో నటించిన అదిత్‌ అరుణ్‌‌ ఈ సినిమాతో మంచి మార్కులు సాధించాడు. ఇక సెకండాఫ్‌లో వ‌చ్చే మెయిన్ విల‌న్ రోల్‌లో న‌టించిన కిషోర్‌కు ఎక్కువుగా స్క్రీన్ ప్రెజెన్స్ లేక‌పోవ‌డం కాస్త మైన‌స్‌. ఇక మిగిలిన పాత్ర‌ల్లో శ్రద్దాదాస్‌, షియాజీ షిండే, శత్రులు తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు. స‌న్నీలియోన్ ఐటెం సాంగ్ మాస్‌ను ఓ ఊపు ఊపేసింది.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :
టెక్నిక‌ల్‌గా ఈ సినిమా ఉన్న‌త‌స్థాయిలో ఉంది. ఈ సినిమా సినిమాటోగ్ర‌ఫీ అదిరిపోయింది. ప్ర‌తి సీన్‌లోను విజువ‌ల్స్ గ్రాండియ‌ర్‌గా ఉన్నాయి. ఐదుగురు సినిమాటోగ్రాఫ‌ర్లు ప‌నిచేయ‌డంతో విజువ‌ల్స్ క్వాలిటీ అదిరిపోయింది. శ్రీచ‌ర‌ణ పాక‌ల ఆర్ఆర్ సినిమా రేంజ్‌ను బాగా పెంచి ప్రేక్ష‌కుడు సినిమాతో బాగా ట్రావెల్ చేసేందుకు యూజ్ అయ్యింది. ధ‌ర్మేంద్ర కాక‌రాల ఎడిటింగ్ క్రిస్పీగా ఉండి సినిమాను రేసుగుర్రంలా ప‌రిగెత్తించింది. భీమ్స్‌ కం‍పోజ్‌చేసిన రెండు పాటలు బాగున్నాయి. స‌న్నీ సాంగ్ తెర‌మీద అద‌ర‌గొట్టేసి ఓ ఊపు ఊపేసింది. ఇక సినిమాలో యాక్ష‌న్ ఎపిసోడ్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఓ తెలుగు సినిమాలో ఈ రేంజ్‌లో ఫైట్స్ తీయొచ్చా ? అని షాక్ అయిపోయేలా యాక్ష‌న్ సీన్లు ఉన్నాయి. నైట్‌ ఎఫెక్ట్‌ లో తీసిన సీన్స్‌ సూపర్బ్‌గా ఉన్నాయి. ప్ర‌వీణ్ స‌త్తార్ యాక్ష‌న్ సీన్లు తీయ‌డంలో చాలా కొత్త‌గా ట్రై చేశాడు.

ప్ర‌వీణ్ స‌త్తార్ డైరెక్ష‌న్ క‌ట్స్ :
ఈ సినిమా చూస్తే ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తాపై హాలీవుడ్ సినిమాల ప్ర‌భావం స్ప‌ష్టంగా ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఓ సింపుల్ క‌థ‌నే తీసుకున్నా క‌థ‌నంతో అత‌డు మైండ్ బ్లోయింగ్ చేసేశాడు. తాను ఏదైతే చెప్పాల‌నుకున్నాడో సినిమా ఫ‌స్ట్ షార్ట్ నుంచి అదే చూపించాడు. రాజ‌శేఖ‌ర్‌కు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఉన్న యాక్ష‌న్ ఇమేజ్‌ను తీసుకున్న ద‌ర్శ‌కుడు క‌థ‌నం మీద చాలా శ్ర‌ద్ధ తీసుకున్నాడు. డార్జీలింగ్ లో తీసిన మొదటి యాక్షన్ ఎపిసోడ్ మొదలుకుని ఫస్ట్ హాఫ్ చివరిలో వచ్చే చార్మినార్ ఎపిసోడ్ దాకా సినిమా ఓ రేసు గుర్రంలా దూసుకెళుతుంది. సెకండాఫ్‌లో మెయిన్‌గా ఉండే అస‌లు క‌థ తెలిసిపోయాక అప్ప‌టి వ‌ర‌కు సినిమాపై ఉన్న ఆస‌క్తి కాస్త స‌డ‌లుతుంది. అయితే ఇది క‌వ‌ర్ చేసేలా మ‌ళ్లీ క్లైమాక్స్‌లో చివ‌రి 20 నిమిషాలు అద‌ర‌గొట్టేశాడు. టేకింగ్ ప‌రంగా తెలుగులో ఇటీవ‌ల వ‌చ్చిన బెస్ట్ అవుట్ ఫుట్ ఇదే. పూర్తిగా టెక్నాలజీ, మైండ్‌ గేమ్‌ కు సంబందించిన అంశాలతో కథను నడిచిన ఏమాత్రం కన్ఫ్యూజన్‌ లేకుండా తెరకెక్కించటంలో సక్సెస్‌ సాధించారు. ప్రేక్ష‌కుడు పూర్తి థ్రిల్‌తో థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాడు.

ప్లస్ పాయింట్స్ (+) :
– రాజశేఖర్‌ నటన
– కథా కథనం
– నేపథ్య సంగీతం
– గ్రాండ్ విజువ‌ల్స్‌
– స్పీడ్ ఫ‌స్టాఫ్‌
– నిర్మాణ విలువ‌లు
– డైరెక్ష‌న్‌

మైనస్ పాయింట్స్ (-) :
– సెకండాఫ్‌లో కొన్ని సీన్ల సాగ‌దీత‌
– మాస్ మసాలా ఎలిమెంట్స్‌ లేకపోవటం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి